భవిష్యత్తు చెబుతానంటాడు.. ఇంకొకరి జాతకంలో ప్రమాదం ఉందంటాడు.. మరో సెలబ్రిటీకి పెళ్లి నిలబడదని చెబుతాడు. కొన్నిసార్లు రాజకీయ నాయకుల భవిష్యత్తు కూడా తనకు ముందే తెలుసంటాడు. ఆయన చెప్పిన మాటలు నిజమైతే తన గొప్పతనమని ప్రచారం చేసుకుంటాడు. అదే జరగకపోతే మాత్రం మరో కొత్త వివరణ ఇస్తాడు. ఇదంతా చూస్తుంటే అసలు జ్యోతిష్యం చెబుతున్నారా? లేక జనాల ఆసక్తితో ఆటలాడుకుంటున్నారా? అనే డౌట్ చాలామందికి వస్తోంది. ఇలా ఎప్పటికప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తరచూ వార్తల్లో కనిపించే వేణుస్వామి వ్యవహారం కూడా ఇప్పుడు ఇలాంటి చర్చకే కారణమవుతోంది. వేణుస్వామి పేరు తెలియని తెలుగు వారు చాలా తక్కువమందే ఉంటారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీల జాతకాలు, వారి పెళ్లిళ్లు, రాజకీయ నాయకుల భవిష్యత్తు గురించి ఆయన చేసిన కామెంట్లు చాలాసార్లు వార్తల్లో నిలిచాయి. ఒకప్పుడు ఆయన చెప్పే జ్యోతిష్య విషయాలపై ఆసక్తి చూపినవాళ్లు ఇప్పుడు ఆయన అంచనాలపై ప్రశ్నలు వేస్తున్నారు. అసలు ఆయన చెప్పే…
Author: Sai Durga
ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్ ఎన్నికల పంచాయతీ జోరందుకుంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం..తాజాగా షెడ్యూల్ విడుదల చేయడంతో పల్లె రాజకీయాలన్నీ ఒక్కసారిగా వేడెక్కాయి. మొత్తం 13వేల168 పంచాయతీలకు 3 విడతల్లో పోలింగ్ జరగనుండగా, నవంబర్ 26వ తేదీన మొదటి విడత ఓటింగ్ జరగనుంది. అయితే ఈసారి ఎన్నికల హీట్ కంటే కూడా తమ ఊరి అకౌంట్లో పడే కోట్ల రూపాయల నజరానా గురించే ఆయా గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలంటే వర్గపోరులు, పగలు, అప్పులు చేసి మరీ కోట్లు ఖర్చు చేయడాలు వంటివి పల్లెల్లో కామన్‌గా కనిపిస్తుంటాయి. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం దానికి పూర్తి చెక్ పెడుతూ ఒక మాస్టర్ ప్లాన్ అమలులోకి తెచ్చింది. ఎవరికి వారే పోటీపడి డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు, అందరూ కలిసికట్టుగా ఏకగ్రీవం కనుక చేసుకుంటే ఊరి అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులను ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గతంలో ఉన్న…
నారాయణపేట జిల్లా భూనీడ్‌లో యువనాయకులు సత్య కావలి.. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మద్దూర్‌కు చెందిన శ్రీ రాఘవేంద్ర క్లినిక్ అండ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ఈ మెగా హెల్త్ క్యాంప్‌ను ఘనంగా నిర్వహించారు. ‘మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత’ అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో… ఎంబిబిఎస్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ గణప మల్లిక, మరియు డాక్టర్ గణప అరవింద్ స్థానిక ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు బీపీ, షుగర్, ఉష్ణోగ్రత వంటి సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయడంతో పాటు.. ఉచిత ఆరోగ్య సలహాలు, మందులపై తగిన మార్గదర్శకం ఇచ్చారు. వ్యాధులను ముందస్తుగా గుర్తించి నివారించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి భూనీడ్ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుండి మంచి స్పందన లభించింది.” ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు వార్డు సభ్యులు…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంత స్పీడ్‌గా విస్తరిస్తుందో, కంటెంట్ క్రియేటర్స్‌తో పాటు న్యూస్ పబ్లిషర్ల రైట్స్‌కు అంతగా భంగం వాటిల్లుతోందనే ఆందోళన వరల్డ్ వైడ్‌గా వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఇంటర్నెట్లో మాత్రమే దొరికే ఇన్ఫర్మేషన్ ,న్యూస్ , స్పెషల్ ఆర్టికల్స్ , ఫోటోలు వంటి కంటెంట్‌ను బిగ్ టెక్ కంపెనీలు తమ ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇచ్చుకోవడానికి ఎలాంటి ముందస్తు పర్మిషన్ లేకుండా ఉచితంగా వాడుకుంటున్నాయి. వేల గంటల మనుషుల శ్రమతో ఇలా రూపొందిన కంటెంట్ ద్వారా ఏఐ కంపెనీలు భారీగా లాభం పొందుతున్నా.. అసలైన క్రియేటర్లకు తగిన గుర్తింపు కానీ,ఫైనాన్సియల్ కాంపన్సేషన్ కానీ లభించడం లేదు. ఈ దోపిడీకి చెక్ పెడుతూ ఇండోనేషియా గవర్నమెంట్ చారిత్రాత్మక డెసిషన్ తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. తమ దేశంలో ప్రతిపాదిస్తున్న కొత్త కాపీరైట్ నిబంధనల ప్రకారం.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఏమైనా సరే తమ సైట్లలో న్యూస్ కంపెనీల కంటెంట్‌ను ప్రదర్శించినా లేదా ఏఐ మోడళ్లకు…
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన జ్ఞాపకాలతో రాసిన బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్.. పుస్తకం ద్వారా గాంధీ కుటుంబంలో జరిగిన కొన్ని దిగ్భ్రాంతికరమైన విధి విలాసాలను పంచుకున్నారు. నవంబర్ 10వ తేదీన రిలీజైన బిలాంగింగ్ పుస్తకంలో 1970ల నాటి విల్లింగ్డన్ క్రెసెంట్ నివాసంలో.. జరిగిన ఒక విచిత్ర సంఘటనను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ పైలట్‌గా వ్యవహరిస్తూ పాలిటిక్స్‌కు దూరంగా ఉండగా, సంజయ్ గాంధీ ప్రధాన నాయకుడిగా ఉండేవారు. అయితే ఒక హస్త సాముద్రికుడు వచ్చి సంజయ్ కాకుండా రాజీవ్ గాంధీనే దేశ ప్రధానమంత్రి అవుతారని గట్టిగా చెప్పినట్టు సోనియా వివరించారు. ఆ తర్వాత 1980లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో కన్నుమూయడం, 1984లో ఇందిరా గాంధీ దారుణ హత్యకు గురికావడం వరుసగా జరిగాయి. ఆ విషాదాల వెంట వెంటనే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించక తప్పలేదు. రాజీవ్ రాజకీయాల్లోకి…
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మరోసారి ఎన్నికల హీట్‌తో వేడెక్కాయి. రాష్ట్రంలో వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఈరోజు అధికారిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే సంబంధిత పురపాలక ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ వివరాలు నామినేషన్ల స్వీకరణ: నవంబర్ 14 నుంచి 16 వరకునామినేషన్ల పరిశీలన: నవంబర్ 17ఉపసంహరణకు గడువు: నవంబర్ 19పోలింగ్ తేదీ: నవంబర్ 26 (ఉదయం 7:00 నుంచి సాయంత్రం 5:00 వరకు)ఓట్ల లెక్కింపు & ఫలితాలు: నవంబర్ 30 గతంలో వార్డుల పునర్విభజనలో తలెత్తిన సమస్యలు, కొన్ని న్యాయపరమైన వివాదాలు , రిజర్వేషన్ల అంశాల కారణంగా 4 నగరపాలక సంస్థలతో పాటు 19…
సీనియర్ స్టార్ హీరోల కుటుంబాల నుంచే కాకుండా, బిజినెస్, పొలిటికల్ వర్గాల వారసులు కూడా టాలీవుడ్లో హీరోలుగా సత్తా చాటడానికి వస్తున్నారు. ఆ కోవలోనే లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా పరిచయమైన అనకాపల్లి మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. సంధ్య వశిష్ఠ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో తారక్ పొన్నప్ప మెయిన్ విలన్‌గా కనిపించారు. ఖగేశ్ తమ్మినేని దర్శకత్వం వహించిన అనకాపల్లి సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సాధారణ గవర్నమెంట్ ఉద్యోగి సాంబశివరావు (నక్కిన త్రినాథరావు), జయంతి ఒక్కగానొక్క కొడుకు సూర్య (విక్రమ్ సహదేవ్)తో ప్రశాంతంగా సాగిపోయే ఆ ఫ్యామిలీ. తాము ఊళ్లో ధైర్యంగా బ్రతకాలంటే రౌడీ షీటర్ ‘బుల్లెట్’ (తారక్ పొన్నప్ప) అండదండలు కావాలని సూర్య అనుకుంటాడు . అలా బుల్లెట్ గ్యాంగ్‌లో చేరిన సూర్య, విలన్ అక్రమాల్లో భాగమవుతాడు. అదే సమయంలో అమృత (సంధ్య వశిష్ఠ)ను సూర్య ప్రేమిస్తాడు. కానీ అమృత మాత్రం…
దేశంలోని రైతులు, చిన్న వ్యాపారులకు ఊరట కలిగించేలా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్(Union Cabinet ) బుధవారం చాలా కీలక నిర్ణయాలకు ఆమోదముద్రన వేసింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మొత్తం రూ.77,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేబినెట్ సమ్మతి తెలిపింది. పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ భారం దేశీయంగా రైతులపై పడకుండా మోదీ ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. ప్రస్తుత రబీ పంటల సాగు కోసం ఎరువుల సబ్సిడీ రూపంలో ఏకంగా రూ.62,370 కోట్లు కేటాయించడానికి ఆమోదాన్ని తెలిపింది. గత 2025-26 రబీ సీజన్‌తో పోలిస్తే ఇది 64 శాతం కేటాయింపు ఎక్కువ కావడం విశేషం. ఈ సబ్సిడీ 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని కేంద్ర కేబినెట్ (Union Cabinet ) నిర్ణయించింది.…
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో కొత్త శకం మొదలైంది. వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాను ముందుగా ప్రకటించినట్లుగానే నవంబర్ 11న నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రారంభించారు. పరివర్తన రాజనీతి పార్టీ (Parivarthan Rajaneethi Party) పేరుతో ఈ కొత్త రాజకీయ ప్రస్థానాన్ని చేపట్టిన ఆయన.. ఉదయం 11 గంటల 11 నిమిషాల శుభ ముహూర్తాన తమ పరివర్తన రాజనీతి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుపు, కాషాయ రంగుల మేళవింపుతో మధ్యలో ధర్మచక్రం గుర్తుతో రూపొందించిన ఈ పార్టీ జెండా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పార్టీ ఆవిర్భావ వేదికపై మాట్లాడిన విజయసాయిరెడ్డి ..ఏపీలో దశాబ్దాలుగా సాగుతున్న వారసత్వ పాలిటిక్స్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును ఎన్నో ఏళ్లుగా కేవలం రెండే రెండు కుటుంబాలే శాసిస్తున్నాయని, ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం రాష్ట్రంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కొడుకే సీఎం కావాలా?…
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద ఊరట లభించింది. కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ జగన్ప నమోదైన కేసులో తర్వాత తీసుకోబోయే చర్యలు అన్నింటినీ నిలుపుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ సమయంలో పులివెందులలో ఓటు వేయడానికి వెళ్లిన వైఎస్ జగన్, పోలింగ్ కేంద్రాల్లోకి వైసీపీ ఏజెంట్లను పోలీసులు అనుమతించడం లేదని ఆరోపించారు. దీనికి నిరసనగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కొంతమంది అనుచరులతో కలసి పులివెందుల మున్సిపల్ ఆఫీసు ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నాను చేపట్టారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగానే ఎటువంటి అనుమతి లేకుండా అలా నిరసన తెలపడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంటూ ఎంఈవో రఫిక్ కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును…