Author: Sai Durga

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎలక్షన్ రిజల్ట్స్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయదుందుభి మోగించిన విషయం తెలిసిందే . విశాఖ నగర మేయర్ పీఠాన్ని కూటమి సంపూర్ణంగా కైవసం చేసుకుంది. కూటమి తరఫున బరిలోకి దిగిన మేయర్ కేండిడేట్ ముక్కా శ్రావణి ఏకంగా 2.44 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు. మొత్తం 120 వార్డులలో టీడీపీ 64, జనసేన 26, బీజేపీ 8 డివిజన్లలో విజయం సాధించడంతో కూటమి బలం 98కి చేరింది. మరోవైపు వైసీపీ కేవలం 13 స్థానాలకే పరిమితమవ్వగా, సీపీఎం ఒక స్థానంలో, ఇండిపెండెంట్లు 8 వార్డుల్లో విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత ఓ ఆసక్తికరమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పెదనాన్న అయిన కాకి గోవింద రెడ్డి ఈ ఎన్నికల్లో రెబల్ కేండిడేట్‌గా పోటీ చేయడమే…

Read More

వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో మరోసారి పొలిటికల్ హీట్ తీవ్ర స్థాయికి చేరింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా.. కొన్ని గ్రామాల్లో వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం దాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటింగ్ ప్రారంభమైన కాసేపటికే కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద రెండు వర్గాల కార్యకర్తలు ఒకరితో ఒకరు తలపడటంతో పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పులివెందుల మండలంలోని ఆర్. తుమ్మలపల్లి గ్రామంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మధ్య మొదలైన వాగ్వాదం క్షణాల్లోనే ఘర్షణకు దారితీసింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకోవడంతో కృష్ణారెడ్డి అనే వైసీపీ కార్యకర్త గాయపడ్డారు. మరోవైపు లింగాల మండలం పార్నపల్లెలోని పోలింగ్ ఏజెంట్ల నియామకంపైన వివాదం చెలరేగింది. తమ ఏజెంట్లు ఎవరినీ కూడా పోలింగ్ కేంద్రంలోకి రానివ్వడం లేదంటూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుంటున్న ఎంపీ…

Read More

సినీ ఇండస్ట్రీలో ఏ భాషలోనైనా సరే, తమకు నటనలో ఛాన్స్ ఇచ్చి గుర్తింపును అందించిన ఇండస్ట్రీని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు తెలుగు సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్లు చేయడం హాట్ టాపిక్‌గా మారుతోంది. స్టార్టింగ్‌లో ఇక్కడ అవకాశాలు అందుకుని, భారీ పారితోషికాలు తీసుకున్న తర్వాత టాలీవుడ్‌ను చులకన చేస్తూ మాట్లాడటంపై తెలుగు ఆడియన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి, ముఖ్యంగా కమర్షియల్ హీరోయిన్ల పాత్రలపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగులో నటీనటులకు సరైన ఇంపార్టెన్స్ ఉండదని.. కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటారనేలా ఆమె కామెంట్లపై పరిశ్రమ వర్గాలు మండిపడ్డాయి. ఇప్పటికే నిర్మాత ఎస్కేఎన్ దీనిపై రియాక్టవ్వగా తాజాగా ఆర్‌ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్ కూడా రాధికా ఆప్టేకు మాస్ కౌంటర్ ఇచ్చారు.…

Read More

బడా ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న రామాయణం మూవీ రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యష్ కాంబోలో రూపొందిన ఈ విజువల్ వండర్ నవంబర్ 5 వ తేదీ గురువారం నాడు ఆడియన్స్ ముందుకు రానుంది. దసరా పండుగకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడం, సుమారు 15 డేస్ ప్రిపరేషన్ టైమ్ దొరకడం ఈ సినిమాకు అతిపెద్ద బిజినెస్ అడ్వాంటేజ్‌గా మారింది. మొదట్లో స్లోగా సాగిన టికెట్ల అమ్మకాలు రిలీజ్ టైమ్ దగ్గరపడే కొద్దీ ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అయితే ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో డిస్ట్రిబ్యూటర్ అయిన ధర్మ ప్రొడక్షన్స్ థియేటర్ల యజమానులతో ఎక్కువ షేర్ మార్జిన్ కోసం చర్చలు జరపడం వల్ల కొన్ని సెంటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ లేట్ అయ్యాయి. గత శుక్రవారం ఈ అగ్రిమెంట్ సమస్య క్లియర్ అవడంతో.. ఒకేసారి థియేటర్ల సంఖ్యను పెంచారు. దాంతో మంగళవారానికి దేశవ్యాప్తంగా…

Read More

ఏపీలో తాజాగా విడుదలైన ఏపీ మున్సిపల్ పోరు ఫలితాలు.. రాబోయే 2029 సార్వత్రిక సమరానికి పక్కా ముందస్తు ట్రైలర్‌ను చూపించేశాయన్న టాక్ నడుస్తోంది. ఉమ్మడి రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ కంచుకోటల గోడలు ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయా అనే సందేహాలకు ఈ ట్రెండ్ మరింత బలాన్నిస్తుంది. పల్లెల్లో కుల, వర్గ సమీకరణాలు వర్కవుట్ అయినా కూడా.. పట్టణ ఓటర్ల మైండ్‌సెట్ ఎప్పుడూ ట్రెండ్ సెట్టర్‌గానే ఉంటుంది. ఆ ట్రెండ్‌ను పట్టుకోవడంలో టీడీపీ,జనసేన,బీజేపీ త్రిముఖ కూటమి పూర్తి విజయాన్ని సాధించిందని పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టిగానే చర్చ నడుస్తోంది. ఒకప్పుడు వైసీపీకి తిరుగులేని అడ్డాగా ఉన్న రాయలసీమ గడ్డపై ఈసారి కూటమి సేన జెండా గట్టిగానే పాతింది. బేతంచెర్ల, నందికొట్కూరు వంటి ఒకటి రెండు చోట్ల వైసీపీ పరువు నిలుపుకున్నా, మిగిలిన ఉమ్మడి కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో కూటమి క్రియేట్ చేసిన సునామీ మామూలుగా లేదు. అనంతపురంలో లోకల్ సమీకరణాల వల్ల కొద్దిపాటి డ్యామేజ్ జరిగినా…

Read More

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంచుకోట కోట అయిన పులివెందుల మున్సిపాలిటీలో ఓట్ల కౌంటింగ్ ఆపాలంటూ వైఎస్సార్సీపీ చేసిన చివరి ప్రయత్నానికి ఏపీ హైకోర్టు చెక్ పెట్టింది. పులివెందుల మున్సిపల్ ఎలక్షన్స్‌లో రిగ్గింగ్ జరిగిందని, అక్కడ అన్ని వార్డుల్లోనూ మళ్లీ ఓటింగ్ జరిపిన తర్వాతే కౌంటింగ్ చేపట్టాలని వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీల అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. నవంబర్ 3 వ తేదీ మంగళవారం ఉదయం న్యాయమూర్తి జస్టిస్ ఎం. కిరణ్మయి బెంచ్ వెలువరించిన ఈ కీలక తీర్పుతో పులివెందులలో రసవత్తరంగా మారిన పురపోరు ఫలితాల లెక్కింపునకు అడ్డంకులు పూర్తిగా తొలగిపోయినట్లు అయింది. పోలింగ్ రోజు అధికార పార్టీ బూత్ ఆక్రమణలకు పాల్పడిందని, తమ వద్ద ఉన్న ప్రూఫ్స్ బట్టి మొత్తం రీపోలింగ్ వేయాలని వైఎస్సార్సీపీ తరఫు న్యాయవాదులు కోర్టులో గట్టిగా పోరాడినా కూడా ఫలితం లేకుండా…

Read More

ఏపీలో మున్సిపల్ పోరుకు సంబంధించిన అసలు ఘట్టానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏపీవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో పురపాలక పోరుకి ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముందుగా 100 పట్టణ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినా నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల తర్వాత ఏకంగా 8 పురపాలికలు, నగర పంచాయతీల్లో ఛైర్‌పర్సన్‌తో పాటు వార్డులన్నీ ఏకగ్రీవం అయ్యాయి. దీంతో నవంబర్ 1న 92 పట్టణ స్థానిక సంస్థల్లోనే పోలింగ్ ప్రాసెస్ సాగనుంది. మొత్తంగా చూస్తే 13 నగరపాలక సంస్థలతో సహా 79 మున్సిపాలిటీలు అలాగే నగర పంచాయతీల పరిధిలోని 2వేల382 స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీనిలో కార్పొరేటర్, ఛైర్‌పర్సన్, మేయర్, కౌన్సిలర్ పోస్టులకు సంబంధించి 6,669 మంది అభ్యర్థులు తమ ఫ్యూచర్‌ను తేల్చుకోవడానికి బరిలో ఉన్నారు. శనివారం ఉదయం నుంచే పోలింగ్ సిబ్బంది సంబంధిత ఆఫీసుల నుంచి ఈవీఎంలు, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని తీసుకుని తమకు కేటాయించిన…

Read More

ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్ హీట్ తారాస్థాయికి చేరింది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక మున్సిపాలిటీలతో పాటు మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో నవంబర్ 1వ తేదీన జరగనున్న పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈరోజు మార్నింగ్ నుంచే నిర్దేశిత డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు.. అవసరమైన ఎలక్షన్ సామగ్రిని అందజేస్తున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పక్కా ప్లాన్‌ను రూపొందించారు. కాగా రేపు పోలింగ్ ముగిసిన తర్వాత నవంబర్ 2వ తేదీన అవసరమైన చోట రీ-పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 3వ తేదీన ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. ఈ దఫా మున్సిపల్ పోరులో మొత్తం 6,669 మంది కేండిడేట్స్ తమ లక్‌ను పరీక్షించుకుంటున్నారు. వీరి కోసం ఏపీ వ్యాప్తంగా 4వేల372…

Read More

హీరోయిన సమంత ప్రజెంట్ తన లైఫ్‌లో మధురమైన ఘట్టాన్ని ఆస్వాదిస్తున్నారు. అతిత్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సామ్, నైంత్ మంత్ ప్రెగ్నెన్సీలోనూ తన హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపించడం లేదు. తాజాగా తొమ్మిదో నెలలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని గుర్తు చేసిన సమంత.. తన ప్రెగ్నెన్సీ తొలి రోజుల నుంచి ఇప్పటివరకు సాగిన వర్కౌట్ల ప్రయాణాన్ని ఒక వీడియో రూపంలో ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘#9. ది ఫైనల్ ల్యాప్’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సమంత ప్రెగ్నెంట్ అయిన ఫస్ట్ మంత్ నుంచి వరుసగా తొమ్మిదో నెల వరకు తాను చేసిన వ్యాయామాలను చూపించారు. అయితే ఇందులో తొమ్మిదో నెల బేబీ బంప్‌తో ఉన్న సామ్ బరువైన డంబెల్ పట్టుకుని వెయిటెడ్ స్క్వాట్స్ చేస్తున్న క్లిప్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గర్భధారణ టైమ్‌లో బాడీ ఇచ్చే సూచనలను బట్టి…

Read More

వైఎస్సార్ ఫ్యామిలీలో కొంతకాలంగా సాగుతున్న ఆస్తుల వివాదం ఇప్పుడు మరో ఊహించని మలుపు తిరిగింది. బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ఆస్తి హక్కుల విషయంలో కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన సోదరి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డికి మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహాన్ని ఆమె తండ్రి వైఎస్‌ఆర్ ఎంతో ఇష్టంగా తిరిగిన ఆ యలహంక ప్యాలెస్‌లోనే అట్టహాసంగా నిర్వహించాలని షర్మిల అనుకున్నారు. కానీ ఆ భవనం తనదేనంటూ జగన్ పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వివాదం కాస్తా వివాహ వేదిక రగడగా మారింది. కాగా ఈ పరిణామాలన్నింటిపై షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ భావోద్వేగానికి లోనవుతూ ట్వీట్ చేశారు. ఎక్స్ (Twitter) వేదికగా షర్మిల రాసుకొస్తూ, నాది కాని దానికోసం ఆశపడే నీచ మనస్తత్వం నాది కాదని..…

Read More