దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా హీట్‌ను రాజేసాయి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ పనితీరును తప్పుబడుతూ ప్రతిపక్ష ఇండియా కూటమి తాజాగా మరో ప్రజా పోరాటానికి తెరతీసింది. గతంలో మాక్ పార్లమెంట్‌గా ప్రచారంలోకి వచ్చిన ఈ హై-వోల్టేజ్ నిరసన కార్యక్రమానికి తాజాగా జన మహాభియోగ్‌గా పేరు మార్చారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసమే వేదికగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఈ నిరసన సభ హోరెత్తబోతోంది. ఈ సభకు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించనుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దేశవ్యాప్తంగా సుమారు 13.5 కోట్ల మంది పౌరుల ఓట్లను లిస్ట్ నుంచి అన్యాయంగా తొలగించారని, ఎన్నికల సిస్టంను స్వతంత్రతను దెబ్బతీస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓటర్ల లిస్ట్ సవరణ పేరుతో జరుగుతున్న అక్రమాలను, ప్రజాస్వామ్య హక్కుల కాలరాస్తున్నారన్న విషయాన్ని ఈ వేదిక…
Author: Sai Durga
నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ తర్వాత సుమారు రెండు దశాబ్దాల గ్యాప్ తీసుకొని విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆదర్శ కుటుంబం: హౌజ్ నెంబర్ 47. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా, నారా రోహిత్, సత్య, నివేతా పేతురాజ్ కీలక పాత్రలతో నటించగా.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడటంతో ఆడియన్స్ ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న టాక్ ప్రకారం.. ఈ మూవీ కేవలం ప్రశాంతమైన ఫ్యామిలీ డ్రామా మాత్రమే కాదని, దీనిలో క్రైమ్, హెవీ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఫుల్‌గా ఉన్నాయని తెలుస్తోంది. ఫస్టాఫ్‌లో కమెడియన్ సత్య కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ వన్ లైనర్స్ బాగా పేలాయని…
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతున్న సమయంలో..ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఘట్టం ఈరోజు ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రజాస్వామ్య బదిలీలో భాగస్వాములయ్యే ఛాన్స్ కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కీలక ప్రక్రియ వరుసగా 2 రోజుల పాటు కొనసాగనుంది. ఎన్నికల రోజున ఓటింగ్ కేంద్రాల్లో డైరెక్టుగా ఓటు వేయలేని అత్యవసర సేవల సిబ్బంది, పోలింగ్ విధుల్లో పాల్గొనే వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న అర్హులైన ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అధికారులు ఈ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకుండా అక్టోబర్ 29 అలాగే అక్టోబర్ 30 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ సమయాన్ని నిర్ణయించారు. పోలింగ్ అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా ప్రతి వార్డు పరిధిలో ఒక రిటర్నింగ్…
ఏపీలో వేడెక్కిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లాలో ఏకగ్రీవాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా గుంతకల్లు నియోజకవర్గంలో అధికార కూటమి కేండిడేట్స్ ఏకపక్ష ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ విజయదుందుభి మోగించారు. స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వ్యూహాత్మక ఆధ్వర్యంలో టీడీపీ, కూటమి వర్గాలు గుంతకల్లు ప్రాంతాన్ని కంప్లీట్‌గా క్లీన్ స్వీప్ చేశాయి. ఇప్పటికే గుత్తి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ పదవితో సహా ఏకంగా 27 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. తాజాగా అదే జోరును జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేశారు. గుత్తి, గుంతకల్లు, పామిడి మండలాల పరిధిలోని అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను వందకు వంద శాతం కూటమి తమ అకౌంట్లో వేసుకుంది. గుత్తి జడ్పీటీసీగా నల్లబోతుల స్వాతి, గుంతకల్లు జడ్పీటీసీగా డి. గీత, అలాగే పామిడి జడ్పీటీసీగా పల్లె శ్రీనివాసులు ఎన్నికైనట్లు అఫీషియల్ ప్రకటన వెలువడింది. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి , జడ్పీ సీఈఓ విజయలక్ష్మి వారికి…
ఏపీలో మున్సిపల్ ఎలక్షన్ పోలింగ్ డేట్ మారడంతో ఉద్యోగుల సెలవు దినంపై కార్మిక శాఖ అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లోని వివిధ షాపులు, వాణిజ్య సంస్థలు , ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు నవంబర్ 1న శాలరీతో కూడిన సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం తాజాగా జీవోను జారీ చేసింది. నిజానికి ఈ పోలింగ్‌ను మొదట అక్టోబర్ 28న జరపాలని భావించినా , అనివార్య కారణాల వల్ల ఆ డేట్‌ని నవంబర్ 1కి మార్చడంతో సెలవు విషయంలో కూడా మరోసారి కొత్తగా ఆదేశాలు వెలువడ్డాయి. ఏపీలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు , నగర పంచాయతీల పరిధిలో ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా జరగనున్నాయి. ప్రతీ కార్మికుడు, ఉద్యోగి ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ ప్రజాస్వామ్య హక్కును నూటికి నూరు శాతం వినియోగించుకుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ కమిషనర్…
తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తనదైన స్టైల్‌తో ఊపేసిన టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అని తెలిసిందే. హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణ పవర్, బోల్డ్ క్వశ్చన్స్, సరదా మ్యానరిజమ్స్ ఈ ఈవెంట్‌ను ఓటీటీలోనే బిగ్గెస్ట్ ట్రెండ్ సెట్టర్‌గా నిలబెట్టాయి. ఇప్పటికే నాలుగు సక్సెస్‌ఫుల్ సీజన్లను పూర్తి చేసుకున్న ఈ టాక్ షో.. ఇప్పుడు ఐదో సీజన్‌తో మరింత లార్జర్ దేన్ లైఫ్ కాన్సెప్ట్‌తో గ్రాండ్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. సీజన్ 5 ఓపెనింగ్ ఎపిసోడ్‌కే టాలీవుడ్‌లో నెవర్ బిఫోర్ అనేలా సెన్సేషన్ కాంబినేషన్‌ను వేదికపైకి తీసుకురాబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమను ఏలుతున్న ఇద్దరు టాప్‌హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్య… వృత్తిపరంగా తీవ్రమైన పోటీ ఉన్నా కూడా, వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు ఎంతో గౌరవం, ప్రేమ ప్రదర్శించుకుంటూ ఉంటారు. అలాంటి వీరిద్దరూ ఐదో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ద్వారా ఒకే టాక్…
బంగాళాఖాతంలో బలపడిన అర్నబ్ తుపాను ముప్పుతో ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరం అలర్ట్ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను ఎఫెక్ట్.. ఉత్తర కోస్తాపై చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో సముద్రమంతా అల్లకల్లోలంగా మారనుంది. అలాగే కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి,కాకినాడ, ఏలూరు, జిల్లాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ నుంచి కుంభృష్టి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 115 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో.. కోస్తాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ తుపాను యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని, ఒకవేళ దిశ మారితే మాత్రం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు తుపాన్ పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు…
దేశవ్యాప్తంగా నమ్మకం, ప్యూరిటీ, నాణ్యత అంటూ భారీ యాడ్స్‌తో కోట్లాది మంది కస్టమర్లను ఆకట్టుకునే పెద్ద బ్రాండ్ల నిజస్వరూపం తాజాగా బయటపడింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఉన్న మలబార్ గోల్డ్ షోరూమ్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు జ్యువెలరీ షోరూంలలో సంచలనం సృష్టిస్తోంది. పెద్ద బ్రాండ్లనే గుడ్డిగా నమ్మి మోసపోతున్నామా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. బిలాస్‌పూర్‌లోని మలబార్ గోల్డ్ షోరూమ్‌కి వెళ్లిన ఒక వ్యక్తి, తన దగ్గరున్న పాత 22 క్యారెట్ల HUID హాల్‌మార్క్ బ్రాస్‌లెట్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుని కొత్తగా జ్యువెలరీ తీసుకుందాం అనుకున్నాడు. అక్కడి సిబ్బంది దాన్ని XRF ప్యూరిటీ టెస్టింగ్ మెషీన్‌లో పెట్టి టెస్ట్ చేసి అది కూడా ఏకంగా మూడుసార్లు టెస్ట్ చేసి కూడా అది కేవలం 20 క్యారెట్ మాత్రమేనని చెప్పారు. అంతేకాదు ఆ బ్రాస్‌లెట్‌పై హాల్‌మార్కే లేదని వాదించారు. దీంతో అనుమానం వచ్చిన కస్టమర్ ఆ బ్రాస్‌లెట్ అమ్మిన లోకల్ జ్యువెలర్‌ను అక్కడికి…
ఏపీలో త్వరలో జరగనున్న లోకల్ బాడీ సమరానికి కూటమి ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఎన్నికల్లో ఘనవిజయమే మెయిన్ టార్గెట్‌గా ప్రణాళికలు రచిస్తున్న టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రజాప్రతినిధులు, మెయిన్ లీడర్స్‌తో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి.. చెప్పాం-చేస్తున్నాం అనే నినాదంతో గడపగడపకూ తీసుకెళ్లాలని బాబు పిలుపునిచ్చారు. 2024 ఎలక్షన్స్‌లో ప్రజలు ఇచ్చిన హిస్టారికల్ తీర్పుతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని సీఎం గుర్తు చేశారు. గడిచిన పాలనలోని అరాచకాలను విసిగివేసారిన ప్రజలంతా ఆ ఎన్నికలలో ప్రతిపక్షాన్ని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని కామెంట్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ సంక్షేమాన్ని పరుగులు తీస్తున్నామని, ఈ మంచి పనులను ప్రతీ ఓటరుకు వివరించాల్సిన బాధ్యత ప్రతీ నాయకుడిపైన ఉందన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎప్పుడూ కూడా కూటమి కట్టుబాటును గట్టిగా పాటించాలని…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రాసెస్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్న సమయంలో.. పల్నాడు జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. చిలకలూరిపేట పురపాలిక మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికలో వైఎస్ఆర్సీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ తరఫున ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా రేసులో ఉన్న కారెమూన్ షేక్.. అనూహ్యంగా టీడీపీ కండువా కప్పుకోవడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 25 వతేదీ ఆదివారం సాయంత్రమే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్‌ను అఫీషియల్‌గా విడుదల చేసింది. అయితే ఆ లిస్ట్ వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే కారెమూన్ షేక్ తన భర్త యూసుఫ్ అలీతో కలిసి.. పసుపు కండువా కప్పుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో దంపతులిద్దరూ కూడా కూటమిలో చేరారు. చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానానికి జనసేన తరఫున తోట రాజరాజేశ్వరి బరిలో నిలబడగా.. వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడ్డ కారెమూన్…