ఒకప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చాయంటే గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేయాలంటే అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగేవారు. గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చేవారు. రోడ్లు వేయిస్తామని, తాగునీటి సమస్య తీర్చేస్తామని, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నించేవారు. కానీ ఇప్పుడు కొన్ని గ్రామాల్లో పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ప్రజలు తమకు ఓటు వేయాలని అడగడం కంటే.. తమను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామానికి ఎంత మేలు చేస్తామో చెప్పే పరిస్థితి వచ్చింది. ఒకరు కోటిన్నర రూపాయలు ఖర్చు చేస్తానంటుంటే..మరో అభ్యర్థి కోటి రూపాయల విలువైన భూమిని దానం చేస్తానంటున్నారు. ఇంకోచోట మాత్రం సర్పంచ్ అభ్యర్థిని ఓటుతో కాదు.. అదృష్టంతో సెలక్ట్ చేయాలనే ఆలోచన తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సమయంలో జరుగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. గ్రామ సమస్యలకు పరిష్కారం చూపిస్తే చాలు.. రూ.1.5 కోట్లు సిద్ధం…
Author: Sai Durga
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రామ్‌లీలా మైదానంలో ఇకపై నిరసనలు, ప్రదర్శనలు, బహిరంగ సభలు నిర్వహించడం మరింత కఠినతరం కాబోతోంది. ప్రజా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ ఢిల్లీ పోలీసులు ఒక ప్రామాణిక నిర్వహణ విధానం ముసాయిదాను రూపొందించారు. ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపిన ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ రాగానే కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం రామ్‌లీలా మైదానంలో జరిగే ఏ కార్యక్రమానికి అయినా గరిష్ఠంగా 50,000 మంది మాత్రమే హాజరయ్యేలా పరిమితిని విధించారు. మైదానం సామర్థ్యం ఉన్నా కూడా సభ స్వభావం, భద్రతా అవసరాలను బట్టి ఎంత మందిని అనుమతించాలి అనేది సంబంధిత అధికారి మాత్రమే డిసైడ్ చేస్తారు. అంతేకాకుండా సభల సమయాన్ని కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంటే కేవలం ఏడు గంటల వ్యవధికి మాత్రమే సభా సమయాన్ని పరిమితం…
వెండితెరపై కనిపించే నవ్వు వెనుక ఎన్ని కన్నీళ్లు దాగి ఉంటాయో బయట ప్రపంచానికి తెలియదు. కెమెరా ముందు అందంగా కనిపించే నటీనటుల జీవితాల్లోనూ ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. పేరు, ప్రఖ్యాతులు, అభిమానుల ప్రేమ ఉన్నంత మాత్రాన వారి జీవితాలు ఎప్పుడూ పూలబాటలా సాగిపోవు. కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు, కుటుంబ పరిస్థితులు, సమాజం నుంచి ఎదురయ్యే వివక్ష వారిని తీవ్రంగా కుంగదీస్తాయి. అలాంటి ఎన్నో అనుభవాలను ఎదుర్కొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సుహాసిని జీవితం కూడా అలాంటిదే. కెమెరా వెనుక సహాయకురాలిగా మొదలైన ఆమె ప్రయాణం.. దక్షిణ భారతదేశం గర్వించే నటిగా, దర్శకురాలిగా, రచయిత్రిగా ఎదిగే వరకు సాగింది. అయితే ఈ విజయాల వెనుక చిన్నతనంలో ఎదురైన అనారోగ్యం, వ్యక్తిగత పోరాటాలు, ఎన్నో సవాళ్లు ఉన్నాయి. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జననం సుహాసిని 1961 ఆగస్టు 15న తమిళనాడులోని పరమకుడిలో జన్మించారు. ఆమె తండ్రి చారు హాసన్, తల్లి…
వెండితెరపై హీరోలు వేసే స్టెప్పులకు ప్రేక్షకులు ఈలలు వేస్తారు. కానీ ఆ స్టెప్పుల వెనుక ఉండే కొరియోగ్రాఫర్ కష్టం మాత్రం చాలాసార్లు తెర వెనుకే ఉండిపోతుంది. ఒకప్పుడు దక్షిణాది సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసి, స్టార్ హీరోలతో అద్భుతమైన నృత్యాలు చేయించిన ఓ దిగ్గజం జీవితం చివరి రోజుల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటే.. అది నిజంగా బాధాకరమే. వందలాది సినిమాలు, ఎన్నో విజయవంతమైన పాటలు, జాతీయ స్థాయి గుర్తింపు.. ఇవన్నీ ఉన్నా చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఆయనను వెంటాడాయి. ఆయనే ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్. మగధీర సినిమాలోని ‘ధీర ధీర’ పాటతో జాతీయ అవార్డును అందుకున్న ఆయన, దొంగ దొంగది సినిమాలోని ‘మన్మథ రాజా’ పాటతో యువతను ఉర్రూతలూగించారు. అరుంధతి సినిమాలో ‘భూం భూం భుజంగం’ పాటకు అద్భుతమైన నృత్యరీతులను అందించారు. కొరియోగ్రాఫర్‌గానే కాకుండా నటుడిగా, టెలివిజన్ డాన్స్ షోల న్యాయనిర్ణేతగా కూడా…
ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు ఓటర్లంతా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాన్ని అధికారులు చెప్పారు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిరా గుర్తు వేసే విధానంలో పెద్ద మార్పు చేశారు. ఇప్పటివరకు సాధారణంగా ఏ ఎన్నికలలో అయినా ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు వేస్తుండగా.. ఈసారి మాత్రం చిటికెన వేలికి వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇంతకీ ఈ మార్పు ఎందుకు తీసుకొచ్చారు? ఏయే తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి? చూపుడు వేలికి బదులుగా చిటికెన వేలికి గుర్తు ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తును వేశారు. ఆ గుర్తు కొంతమంది వేళ్లపై ఇంకా కనిపించే అవకాశం ఉండటంతో గ్రామ పంచాయతీ ఎన్నికలలో అదే వేలికి మళ్లీ సిరా వేస్తే గందరగోళం తలెత్తొచ్చని ఎన్నికల సంఘం భావించింది. ఈ సమస్యను నివారించడానికి ఎడమ చేతి…
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తొలి విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోసం నవంబర్ 13న అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడంతో, ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ వేడి ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. ఇన్నాళ్లూ సర్పంచ్ సీటుపై కన్నేసి కాచుకుని కూర్చున్న ఆశావహులతో పాటు.. వార్డు మెంబర్‌గా గెలవాలని భావిస్తున్న యువ నాయకులు అప్పుడే గ్రౌండ్ లెవెల్లో పావులు కదపడం మొదలుపెట్టారు. ఈ నామినేషన్ల పర్వం నవంబర్ 15వ తేదీ ఉదయం నుంచి ప్రారంభమై నవంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. దాఖలైన నామినేషన్ పత్రాలను అధికారులు నవంబర్ 18వ తేదీన క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ ఏవైనా టెక్నికల్ కారణాలతో నామినేషన్ రిజెక్ట్ అయితే, దానికి సంబంధించి అప్పీల్ చేసుకోవడానికి నవంబర్ 19, 20 తేదీల్లో వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత నామినేషన్ల వెనక్కి తీసుకోవడానికి (విత్‌డ్రా) నవంబర్ 21 ఆఖరి తేదీగా నిర్ణయించారు. అదే…
ఒకప్పుడు థియేటర్ల ముందు హీరోల భారీ కటౌట్లు చూసి మురిసిపోయిన ఓ యువకుడు.. ఏదో ఒకరోజు తన ఫొటో కూడా అలాంటి పోస్టర్లపై కనిపించాలని కలలు కన్నాడు. ఆ కల కోసం చిన్న మెకానిక్ షెడ్లో పనిచేశాడు. క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వచ్చిన ఉద్యోగ అవకాశాలను కూడా పక్కనపెట్టి సినిమాల వైపు అడుగులు వేశాడు. చివరకు తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. కానీ జీవితంలో ఎన్నో కష్టాలను దాటుకుని స్టార్‌గా ఎదిగిన శ్రీహరి ప్రయాణం విషాదకరంగా ముగిసింది. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. ఆయన మరణం తర్వాత భార్య డిస్కో శాంతి చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఆ షూటింగ్‌కు వెళ్లకుండా ఉండి ఉంటే తన భర్త ప్రాణాలతో ఉండేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. పోస్టర్ల ముందు మొదలైన కల తెలుగు ప్రేక్షకులకు రియల్ స్టార్‌గా…
సినిమాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ చూస్తే అభిమానులకు పూనకాలు వస్తాయి. ఆయన నడక, మాట తీరు, సిగరెట్ గాల్లోకి విసిరి నోటితో పట్టుకునే ప్రత్యేక శైలి.. ఇలా ప్రతి విషయంలోనూ రజనీకాంత్‌ది ఒక ప్రత్యేకమైన ముద్ర. తెరపై ఆయన కనిపిస్తే చాలు థియేటర్లు ఈలలు, చప్పట్లతో మారుమోగిపోతాయి. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయనను అభిమానులు ప్రేమగా ‘తలైవా’ అని పిలుచుకుంటారు. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు ఆయన జీవితం ఎన్నో కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులతో నిండిపోయింది. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఒకప్పుడు కుటుంబాన్ని పోషించడానికి చిన్న చిన్న పనులు చేసిన వ్యక్తి.. ఆ తర్వాత బస్ కండక్టర్‌గా పనిచేశారు. అక్కడి నుంచి నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగుపెట్టి, భారతీయ సినీ చరిత్రలోనే ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సాధారణ కుటుంబంలో పుట్టిన ఒక యువకుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడిగా ఎదిగారు బెంగళూరులో…
ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే చాలు.. థియేటర్లలో అభిమానుల సందడి కనిపించేది. తనదైన నటన, పవర్ఫుల్ డైలాగులతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. డాక్టర్‌గా స్థిరపడాల్సిన వ్యక్తి అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. కానీ కెరీర్లో మంచి స్థాయికి చేరుకున్న తర్వాత వరుస వివాదాలు, రాజకీయ విమర్శలు, ఆర్థిక ఇబ్బందులు ఆయన ప్రయాణాన్ని మార్చేశాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఏర్పడిన విభేదాలు అప్పట్లో టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆయనే హీరో రాజశేఖర్. ఆయన భార్య జీవిత కూడా నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వీరిద్దరి సినీ ప్రయాణంలో ఎదురైన వివాదాల గురించి దర్శకుడు సముద్ర ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అసలు రాజశేఖర్ కెరీర్లో ఏం జరిగింది? ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న హీరోకు తర్వాత అవకాశాలు ఎందుకు తగ్గాయి? చిరంజీవితో విభేదాలు, సినిమాల నిర్మాణంలో ఎదురైన ఆర్థిక సమస్యలు…
ఒకప్పుడు ఆయన పేరు వింటేనే ఆడియన్స్ భయపడేవారు. తెరపై కనిపిస్తే చాలు.. హీరోలకు కూడా చెమటలు పట్టాల్సిందే. ఆయన కళ్లు చూస్తేనే ఎదుటివారికి వణుకు పుట్టేది. ఒక్క డైలాగ్‌తో థియేటర్లను హోరెత్తించేవారు. కానీ విచిత్రం ఏమిటంటే.. తెరపై అంత క్రూరంగా కనిపించిన ఆ నటుడు నిజ జీవితంలో మాత్రం ఎంతో సున్నితమైన మనసున్న వ్యక్తి. ఎదుటివారి కష్టం చూస్తే తట్టుకోలేక సహాయం చేసే మనస్తత్వం ఆయనది. అలాంటి వ్యక్తి జీవితంలో చివరి రోజులు మాత్రం ఎన్నో కష్టాలతో గడిచాయి. ఒకప్పుడు వందల సినిమాల్లో నటించి, స్టార్ విలన్‌గా వెలుగొందిన గంగసాని రామిరెడ్డి.. చివరికి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు? తనను నమ్మినవారే దూరమయ్యారా? జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన రామిరెడ్డి సినీ పరిశ్రమలో అగ్ర విలన్‌గా ఎలా ఎదిగారనేది చాలామందికి తెలీదు. పేదరికం నుంచి జర్నలిజం వరకు.. 1959 జనవరి 2న చిత్తూరు జిల్లాలోని ఓబులంపల్లి గ్రామంలో ఒక సాధారణ…