Author: Lalitha

అనంతపురంలో మరోసారి పొలిటికల్ హీట్‌ పెరిగిపోయింది. పాలిటిక్స్‌లో టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తనదైన శైలిలో మరోసారి ప్రకంపనలను సృష్టించారు. జిల్లా కేంద్రంలో జేసీ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలను, ప్రస్తుత ఫలితాలతో పోలుస్తూ ఆయన ఈ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. వైసీపీ వైఖరిని ఎండగడుతూ ఫ్లెక్సీలపై కళ్లు దొబ్బాయా? అంటూ సంధించిన ప్రశ్నలు అనంతపురం రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను టార్గెట్ చేసిన జేసీ.. మీకు కళ్లు, చెవులు పనిచేస్తే ఈ ఫలితాలను చూడండంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఫ్లెక్సీల ఆవిష్కరణ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar…

Read More

సినిమాల్లో విలన్లను కూడా గడగడలాడించే నటసింహం నందమూరి బాలకృష్ణ రియల్ లైఫ్‌లో ఒకరి విషయంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గుతారని జగపతిబాబు టాక్ షోలో మంత్రి నారా లోకేష్(Nara Lokesh) చెప్పుకొచ్చారు. బాలయ్య కూతురు, నారా లోకేష్ సతీమణి బ్రహ్మణి అంటే భయపడతారని చెబుతూ ఫ్యామిలీ మ్యాటర్స్ రివీల్ చేశారు. అందరికీ ఆయన బాలయ్య బాబు, కానీ తనకు మాత్రం ముద్దుల మావయ్య అని చెప్పిన లోకేష్.. బ్రహ్మణి గనుక పుట్టింటికి భోజనానికి వస్తే బాలకృష్ణ తనకిష్టమైన వంటకాలేవీ తినలేరని షోలో నవ్వులు పూయించారు. కేవలం కుటుంబ విశేషాలే కాకుండా తన చదువు, బిజినెస్ జర్నీకి సంబంధించిన ఎన్నో మధుర జ్ఞాపకాలను లోకేష్ ఈ వేదికగా షేర్ చేసుకున్నారు. చిన్నప్పుడు జూబ్లీహిల్స్‌లోని విద్యాభవన్‌లో బ్యాక్‌బెంచర్‌గా తిరుగుతూ బాగా అల్లరి చేసేవాడినని, కానీ చదవడం కంటే క్రికెట్ అంటేనే తనకు చాలా ఇష్టమని నారా లోకేష్(Nara Lokesh) గుర్తు చేసుకున్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి…

Read More

ఏపీలో ఇటీవల ముగిసిన లోకల్ బాడీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి సాధించిన ఘన విజయంపై రెండు వర్గాల మధ్య డైలాగ్ వార్ రోజురోజుకూ ముదురుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఫుల్‌గా ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఏకంగా.. రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు అనే హ్యాష్‌ట్యాగ్‌తో జగన్ చేసిన పోస్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదంటూ వైఎస్ జగన్(YS Jagan) ఘాటు వ్యాఖ్యలు చేశారు. అచ్చం గొర్రెతోలు కప్పుకున్న తోడేలులాగే చంద్రబాబు వ్యవహారం ఉందంటూ తీవ్ర పదజాలాన్ని వాడుతూ విమర్శలు గుప్పించారు. గడచిన ఎలక్షన్ టైమ్‌లో ప్రజాస్వామ్య…

Read More

సినిమా రంగంలో ప్రయోగాత్మక కథాంశాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ నటించిన మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ మూవీ రణబాలి(Ranabali) ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేయడానికి రెడీ అయింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ భారీ బడ్జెట్ మూవీని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించారు.బ్రిటీష్ వలస పాలన కాలం రోజుల అణచివేతకు వ్యతిరేకంగా 19వ శతాబ్దంలో సాగిన చారిత్రక పోరాటాన్ని ఆధారంగా చేసుకుని ఈమూవీని రూపొందించారు. కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్స్‌తో ఈ కథను తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మించిన రణబాలి(Ranabali) చిత్రానికి టీ-సిరీస్ సమర్పకుడిగా వ్యవహరించింది. ఈ మూవీలో మరో ప్రధాన ఆకర్షణగా హాలీవుడ్ ప్రముఖ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ ఇంపార్టెంట్ రోల్‌లో నటించడం విశేషం. థియేటర్లలో ఆడియన్స్‌ను కట్టిపడేసిన ఈ విజువల్ వండర్, ఇప్పుడు డిజిటల్ వేదికపై తన జోరు చూపించడానికి…

Read More

దీపావళి పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పెషల్‌గా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.దీనిపై ఇద్దరు నేతలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా మనమంతా ఈ దీపావళి పండుగను ఘనంగా జరుపుకొంటామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మనం వెలిగించే దీపం మన ఇంటికి మాత్రమే కాదని, సమాజానికీ వెలుగునివ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి కుటుంబంలో సుఖశాంతులతో పాటు సిరిసంపదలు వెల్లి విరియాలని అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు చిగురించాలని సీఎం కోరుకున్నారు. ఐకమత్యం, పరస్పర సహకారంతో అందరూ ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోవైపు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రజలకు దీపావళి హృదయపూర్వక శుభాకాంక్షలను తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా ప్రజల జీవితాల్లోని చీకట్లను తొలగించి, బతుకుల్లో కొత్త వెలుగులను నింపే లక్ష్యంతో తెలంగాణ…

Read More

ఏపీ వ్యాప్తంగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్ ( Parishad Election Results) పొలిటికల్ వర్గాల్లో ఊహించని స్థాయిలో వేడి పుట్టించింది. ఎక్కడ చూసినా హోరాహోరీ పోరు, ఉత్కంఠ రేపే మలుపులు, కొన్నిచోట్ల కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు తేలడం కనిపించింది. మరికొన్ని ప్రాంతాల్లో రీకౌంటింగ్ రచ్చ, పోలీసులతో తోపులాటల మధ్య పరిషత్ ఫలితాలు సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీశాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు జడ్పీటీసీ స్థానంలో టీడీపీ విజయబావుటా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఇక్కడ ఘన విజయాన్ని సాధించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా పరిటాల అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. ఇక వైఎస్సార్ జిల్లాలో చాలామంది దృష్టిని ఆకర్షించిన వైసీపీ కంచుకోట పులివెందుల జడ్పీటీసీ స్థానంలో.. టీడీపీ అభ్యర్థి ఏకంగా 1,463 ఓట్ల మెజార్టీతో సంచలన విజయాన్ని సాధించడం జగన్ వర్గీయులకు…

Read More

ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే గెలిచిన అభ్యర్థి పేరు వినడానికి ఊరంతా ఉత్కంఠగా ఎదురుచూసింది. ఎన్నికల అధికారులు ఫలితాన్ని ప్రకటించగానే మామూలుగా అయితే విజయోత్సవ సంబరాలు మిన్నంటాలి. కానీ అక్కడ మాత్రం ఎలాంటి సంతోషం కూడా లేదు. కనీసం బాణాసంచా కాల్చడానికి కూడా ఎవరికీ మనస్కరించలేదు. తాను పోటీ చేసిన స్థానంలో ప్రజలంతా తనను నమ్మి ఓట్లేసి గెలిపించినా.. ఆ విజయం తాలూకా ఆనంద క్షణాలను ఆస్వాదించడానికి ఆ అభ్యర్థి భౌతికంగా ఈ లోకంలో లేకుండాపోవడంతో ఇప్పుడు స్థానికులను కన్నీటిపర్యంతం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని ధుమంతునిగూడెం గ్రామానికి చెందిన గారపాటి దివ్య (28) జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ కేండిడేట్‌గా బరిలోకి దిగారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, ఊరి డెవలప్మెంట్‌కి నిత్యం కష్టపడే దివ్య.. ప్రచారంలో కూడా అంతో చురుగ్గా పాల్గొన్నారు. అయితే కౌంటింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందే ఆమె ఊహించని విధంగా గుండెపోటుకు గురై…

Read More

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన స్థానిక పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. నవంబర్ 5వ తేదీన జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా సగటున 70.02 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారికంగా ప్రకటించారు. విశాఖ జిల్లాలో అత్యధికంగా 82.51 శాతం ఓటింగ్ ఎంటర్ కాగా, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 62.01 శాతం నమోదు అయింది. కాగా, ఏకగ్రీవాలు పోను మిగిలిన 582 జడ్పీటీసీ, 7767 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి టెన్షన్‌కు తెరపడే సమయం ఆసన్నమైంది. శనివారం ఉదయం సరిగ్గా 8 గంటలకు ఏపీ వ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన 365 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రాసెస్ మొదలుకానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత, అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరుస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్లను వేరు చేసి నిర్దేశిత ట్రేలలో ఉంచుతారు.…

Read More

సెక్రటేరియట్‌లో ఉన్నత స్థాయి సమీక్షలు, అధికారులతో టెలీ కాన్ఫరెన్సులకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్టుగా పొలాలలోకి కూడా అడుగుపెట్టారు. ఇటీవల తుపాను సృష్టించిన బీభత్సంతో భారీగా నష్టపోయిన రైతన్నలను ఓదార్చడానికి, పంట బోదెలపై నడుస్తూ క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. నష్టపోయిన పంటలను చూసి కన్నీరుమున్నీరవుతున్నరైతులకు తానున్నానంటూ బాబు ధైర్యం చెప్పారు. బురదమయమైన పొలాల్లో తిరుగుతూ నిజ పరిస్థితులను గమనిస్తూ జరిగిన నష్టాన్ని స్వయంగా అంచనా వేసి యంత్రాంగాన్ని పరుగెత్తించారు. నిజానికి తుపాను హెచ్చరికలు వెలువడిన అక్టోబరు 27వ తేదీ నుంచే విపత్తు నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించారు. అర్నబ్, మురసు వంటి వరస తుపానుల టైమ్‌లో రాత్రిపూట కూడా మేల్కొని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, ఉన్నతాధికారులతో మినిట్ టు మినిట్ అప్ డేట్స్ తెలుసుకుంటూ ఆయా ప్రాంతాల పరిస్థితులపైన ఆరా తీశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పునరావాస…

Read More

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల కౌంటింగ్‌లో బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా కూటమి పార్టీల ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో, చీరాలలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుని తమ సత్తా చాటడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మురుసు తుపాను ఎఫెక్ట్‌తో చీరాలలో భారీ వర్షాలు కురవడంతో నవంబర్ 3వ తేదీన జరగాల్సిన చీరాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఎన్నికల కమిషన్ శుక్రవారానికి పోస్ట్‌పోన్ వేసింది. ఈరోజు జరిగిన కౌంటింగ్‌లో ప్రారంభం నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్టార్టింగ్‌లోనే 25వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించి అకౌంట్ తెరవగా, అక్కడ బీజేపీ సెకండ్ స్థానంలో, వైసీపీ మూడో స్థానంలో నిలిచాయి. వార్డుల వారీగా వెలువడిన ఫైనల్ రిజల్ట్ సరళిని పరిశీలిస్తే టీడీపీ తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంది. మొత్తం ఫలితాలను ఒకసారి చూస్తే టీడీపీ…

Read More