Author: Lalitha

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్స్‌లో విజయవాడ నగర పాలక సంస్థ హిస్టరీలోనే నిలిచిపోయే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అందరి దృష్టిని ఆకర్షించిన బెజవాడ మేయర్ పీఠాన్ని జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ఘనవిజయాన్ని సాధించారు. వంగవీటి రాధా పుట్టినరోజు నాడు.. బెజవాడ నగర ప్రజలు ఆయనపై ఉన్న అపారమైన ప్రేమాభిమానాలను తమ ఓట్లతో చూపిస్తూ, రాధా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక చారిత్రాత్మక బర్త్‌డే గిఫ్ట్‌ను అందించారు. ఇక్కడ ఏబీ వెంకటేశ్వరరావు గట్టి పోటీ ఇచ్చినా కూడా వంగవీటి రాధా గ్రాండ్ విక్టరీని సాధించి ప్రత్యర్థులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగవీటి రాధా ముందు నుంచీ కూడా విజయం వైపు దూసుకెళ్లారు. కాంగ్రెస్-వామపక్షాల మద్దతుతో బరిలో దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు , వైసీపీ కేండిడేట్ రాయన భాగ్యలక్ష్మి ఈ రేసులో వెనుకబడిపోయారు . తండ్రి వంగవీటి మోహన రంగారావు వారసత్వాన్ని,బెజవాడవాసుల…

Read More

మున్సిప‌ల్ పోరులో కూట‌మిదే హ‌వా వార్ వ‌న్ సైడ్ అనిపించిన ఫ‌లితాలు కేవ‌లం మూడు మున్సిపాలిటీల్లో వైసీపీ దారుణంగా దెబ్బ తిన్న వైసీపీ 2024కి నేటికి పెద్ద తేడా క‌నిపించ‌ని వైనం కూట‌మి స‌మ‌న్వ‌యంలో స‌క్సెస్ టీడీపీ, జ‌న‌సేన కోఆర్డినేష‌న్ లో స‌క్సెస్ రెబెల్స్ ప్ర‌భావం కూడా త‌గ్గించిన పార్టీలు వైసీపీ వైఖ‌రి మారాల్సిందేనా..? భ్ర‌మ‌లు వీడి ప్రాక్టిక‌ల్ గా ఉండాల‌నే సూచ‌న‌లుస్థానిక ఎన్నిక‌లు అంటేనే అధికారంలో ఉన్న‌వారికి అనుకూలంగా ఫ‌లితాలు ఉంటాయ‌ని చ‌రిత్ర చెబుతోంది. కాని ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార కూట‌మి ఆ చ‌రిత్ర‌ను కూడా మ‌లుపు తిప్పింది. వార్ వ‌న్ సైడ్ అని అర్ధ‌మైపోయింది. అధికార కూట‌మి దూకుడు ముందు వైసీపీ బేల‌త‌నం బ‌య‌ట‌ప‌డింది. కొంద‌రు లోక‌ల్ నాయ‌కుల వ‌ల్లే కొన్ని చోట్ల అయినా వైసీపీ ప‌రువు ద‌క్కించుకుంది. కాని జ‌గ‌న్ ప్ర‌భావం గాని, జ‌గ‌న్ నాయ‌క‌త్వ ప‌టిమ గాని ఎక్క‌డా ఏ కోశాన చూపించ‌లేక‌పోయారు. ఏక‌గ్రీవాలు అయిత…

Read More

ఏపీ వ్యాప్తంగా వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి తమ తిరుగులేని జనాదరణను చాటుకుంది. ఉత్తరాంధ్ర మెయిన్ సిటీ విశాఖపట్నం నుంచి దక్షిణాన ఉన్న తిరుపతి వరకు మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కూటమి తన అకౌంట్‌లో వేసుకుని విజయకేతనాన్ని ఎగురవేసింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాగా అయిన కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో కూటమి హిస్టారికల్ విజయాన్ని నమోదు చేసింది. టీడీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి గీతాకుమారి ఏకంగా 13వేల875 ఓట్ల అపారమైన మెజార్టీతో గెలుపొంది సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశారు. ముందస్తు ఏకగ్రీవాలతో కలుపుకుని మొత్తం 37 వార్డులలో.. కూటమి ఏకంగా 34 స్థానాలను సొంతం చేసుకుని పులివెందుల కోటను కైవసం చేసుకోగా, వైసీపీ కేవలం 3 వార్డులకే పరిమితమై భంగపడింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో జనసేన పార్టీ ఘనవిజయాన్ని సాధించింది. మున్సిపల్ ఛైర్మన్‌గా…

Read More

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి, పుత్తూరు మున్సిపాలిటీలలో వైసీపీ అభ్యర్థులు చాలా చోట్ల విజయం సాధించి తమ సత్తాను చాటారు. నగరి మున్సిపాలిటీ పరిధిలోని 3, 15, 18, 23, 26, 28, 38 వార్డులను వైసీపీ అకౌంట్‌లో వేసుకోగా.. పుత్తూరు మున్సిపాలిటీలో 4, 27, 29, 36 వార్డుల్లో ఆ పార్టీ కేండిడేట్స్ ఘనవిజయాన్ని సాధించి జయకేతనం ఎగురవేశారు. పురపోరులో గెలుపొందిన కౌన్సిలర్ కేండిడేట్స్ అంతా.. మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ రోజా నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోజా విజేతలకు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా అభినందించారు. తర్వాత విలేకరులతో మాట్లాడిన రోజా, కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షాన్ని కురిపించారు. ఎన్నికల నామినేషన్ల ప్రాసెస్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా కూటమి నేతలు రౌడీయిజం, గూండాయిజంతో వైసీపీ కేండిడేట్స్ భయభ్రాంతులకు గురి చేశారని రోజా ఆరోపించారు. మూడు అధికార…

Read More

ఏపీలో అత్యంత ఉత్కంఠ రేపిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ తుది ఘట్టానికి చేరుకుంటోంది. అక్కడక్కడా చిన్నపాటి ఘర్షణలు తప్ప ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలోనే కొనసాగుతోంది. కాగా ఉదయం బ్యాలెట్ పెట్టెలు తెరిచిన నిమిషం నుంచే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు చాలా చోట్ల జయభేరి మోగిస్తూ తమ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఎఫెక్ట్ ఈ ఎన్నికల్లో పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. ముఖ్యంగా నగర పాలక సంస్థలైన కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థుల గాలి స్పష్టంగా వీస్తోంది. మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లలో.. ఇప్పటి వరకు 10 చోట్ల లెక్కింపు ఫైనల్ స్టేజ్‌కు చేరగా, ఆ 10 కార్పొరేషన్లలోనూ కూటమి అభ్యర్థులే ఆధిక్యంలో దూసుకుపోతున్న సీన్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ వైసీపీ గానీ, ఇతరుల హవా పెద్దగా కనిపించలేదు. ఇక మున్సిపాలిటీల విషయం ఒకసారి చూస్తే మొత్తం 87 పురపాలక…

Read More

తెలుగు సినీ ఇండస్ట్రీలో నయా హిస్టరీ క్రియేట్ చేసినరంగస్థలం’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద అప్పుడే ఊహించని రేంజ్‌లో బజ్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపుదిద్దుకోనున్న క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘#RC17’ నవంబర్ 1వ తేదీన చాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. రంగస్థలంలో చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన, సుకుమార్ రా మేకింగ్.. ఇండియన్ సినిమాను ఏ రేంజ్‌లో షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. కాగా మరోసారి ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ రెండో సినిమాపై టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా లవర్స్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమానికి మూవీ యూనిట్‌తో పాటు సినీ రంగానికి చెందిన కొంతమంది ప్రముఖ నిర్మాతలు హాజరయ్యారు. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, తొలి సీన్‌కు క్లాప్ కొట్టి ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. చిరంజీవి చేతుల…

Read More

ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో పులివెందుల నియోజకవర్గంలో పాలిటిక్స్ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత గడ్డ పులివెందులలో నిర్వహించిన ర్యాలీలో ఊహించని ఘటనా వికాసం చోటు చేసుకుంది. పోలింగ్ సరళిని పరిశీలిస్తూ అలాగే పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపడానికి జగన్ పులివెందుల వీధుల్లో ర్యాలీగా వెళ్తుండగా.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు, సీబీఐ అప్రూవర్‌గా మారిన దస్తగిరి హఠాత్తుగా కాన్వాయ్‌కు ఎదురుపడ్డాడు. దస్తగిరి డైరెక్ట్‌గా కాన్వాయ్ ముందుకు రావడమే కాకుండా.. సొంత బాబాయ్ వివేకాను చంపించి తమ జీవితాలను నాశనం చేశావ్ అంటూ పబ్లిక్‌గా గట్టిగా కేకలు వేశాడు. ఈ అనూహ్య పరిణామంతో వెహికల్‌లో ఉన్న జగన్‌తో పాటు వైసీపీ నాయకులు, భద్రతా సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దస్తగిరి జగన్ వాహనం వైపు మరింత ముందుకు వెళ్లడానికి ప్రయత్నించగా, అలర్ట్ అయిన పోలీసులు,…

Read More

ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో అధికారులు చేసిన చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ఎత్తున గందరగోళానికి దారి తీసింది. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్‌లో ప్రింటింగ్ సిబ్బంది చేసిన మిస్టేక్ వల్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బ్యాలెట్ పేపర్‌లో కాంగ్రెస్ కేండిడేట్ పేరు పక్కన వైసీపీ గుర్తును, వైసీపీ కేండిడేట్ పేరు పక్కన కాంగ్రెస్ హస్తం గుర్తును ప్రింట్ చేశారు. ఓటింగ్ మొదలైన కాసేపట్లోనే ఈ విషయాన్ని గమనించిన కేండిడేట్స్, ఏజెంట్లు తీవ్ర నిరసన తెలపడంతో అధికారులు హుటాహుటిన అక్కడ జరుగుతున్న పోలింగ్‌ను నిలిపివేశారు. తర్వాత కొత్త బ్యాలెట్ పేపర్లను అత్యంత వేగంగా సిద్ధం చేసి గంట ఆలస్యంగా తిరిగి ఓటింగ్‌ను ప్రారంభించారు. పోలింగ్‌కు ఉదయం ఎంత సమయం బ్రేక్ పడిందో అంతే సమయాన్ని సాయంత్రం పూట అదనంగా కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఈ తారుమారుపై వైసీపీ నాయకులు సంచలన అనుమానాలు వ్యక్తం చేయగా, కేవలం…

Read More

ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో కొన్నిచోట్ల పొలిటికల్ వేడి తీవ్రస్థాయికి చేరింది. ముఖ్యంగా కడప జిల్లాతో పాటు పులివెందులలోని కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికార టీడీపీ, వైసీపీ ఏజెంట్లు ఒకరినొకరు ఎదుర్కొనడంతో అక్కడ ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలింగ్ కేంద్రాల లోపలికి వైసీపీ ఏజెంట్లను వెళ్లకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని, తమపై దౌర్జన్యానికి దిగి మొబైల్ ఫోన్లను పగలగొట్టడమే కాకుండా చొక్కాలు కూడా చింపేశారని వైఎస్పార్సీపీ ఏజెంట్లు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. దీంతో రెండు వర్గాల నుంచీ వైపులా మాటల యుద్ధం కాస్తా ముదిరి తోపులాటకు దారితీయడంతో పోలింగ్ ప్రాసెస్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఈ ఉద్రిక్త పరిస్థితితో మిగిలిన ఓటర్లు ఆందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన భద్రతా దళాలు, లోకల్ పోలీసులు వేగంగా స్పందించి ఘర్షణ జరుగుతున్న పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకున్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలను…

Read More

ఏపీలో కొద్ది రోజులుగా హోరాహోరీగా సాగిన స్థానిక సంస్థల పోరులో శబ్ద కాలుష్యానికి తెరపడింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి ఈరోజు సాయంత్రం వరకూ విస్తృతంగా సాగిన మైకుల హోరు, ర్యాలీలు, బహిరంగ సభల సందడి.. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి క్లోజ్ అయింది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారాన్ని ఆపేయాలన్న ఆదేశాలతో నాయకుల ప్రచార హోరుకు, మైకుల సౌండ్‌కు ఎండ్ కార్డ్ పడింది. కాగా, ఓటింగ్ ప్రాసెస్ మొదలుకాక ముందే అధికార టీడీపీ,జనసేన,బీజేపీ ఎన్డీఏ కూటమి తన హవా చాటుకుంది. ఏపీ వ్యాప్తంగా ఏకంగా 17 మున్సిపల్ ఛైర్మన్ పీఠాలను అధికార కూటమి అకౌంట్‌లో వేసుకుంది. దీనిలో టీడీపీ 15 స్థానాలు గెలుచుకోగా, జనసేన, బీజేపీ తలో స్థానాన్ని సాధించాయి. ముఖ్యంగా కడప జిల్లాలోనే 6 పట్టణ స్థానిక సంస్థలు ఏకగ్రీవం కావడం హాట్ టాపిక్ అయింది. దాంతో పాటు పిడుగురాళ్ల,…

Read More