Author: Lalitha

మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ రిలీజ్ డేట్‌కు సంబంధించి కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందంటూ రూమర్స్ స్ప్రెడ్ అవడంతో.. మెగా అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే, ఈ నిరాధారమైన వదంతులకు రచయిత కోన వెంకట్ తనదైన శైలిలో చురకలు వేస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ కోన వెంకట్ సోషల్ మీడియా వేదికగా ఒక ఘాటైన ప్రకటనను రిలీజ్ చేశారు. మూవీపై వస్తున్న అన్ని రూమర్లకు ఇక్కడితో సెలవు. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నామని ఆశపడే వారిని ఇప్పుడు నిరాశపరుస్తున్నందుకు క్షమించాలి. మేము పక్కా ప్లానింగ్‌తో జనవరి 13వ తేదీన థియేటర్లలో ల్యాండ్ అవుతున్నాం. ఈ సంక్రాంతి పండుక్కి ‘కాకా’ రాకతో అసలైన జాతర మొదలవుతుందంటూ కావాల్సినంత క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మూవీ పోస్ట్ పోన్ అవుతుందని వస్తున్న అన్ని అనుమానాలు ఒక్కసారిగా పటాపంచలయ్యాయి.…

Read More

పాలిటిక్స్‌లో ఎన్నికల సమయంలో కొన్ని పరాజయాలు ప్రత్యర్థి పరాక్రమాన్ని చాటి చెబితే, మరికొన్ని సొంత పార్టీలో అంతవరకూ దాగి ఉన్న అంతర్గత బలహీనతలను బట్టబయలు చేస్తాయి. ఇంకొన్ని మాత్రం పార్టీ మనుగడకు నాయకత్వం ఎంత కీలకం అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టి చెబుతాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రస్తుతం వైసీపీ పరిస్థితిని గమనిస్తే సరిగ్గా మూడో కోవకు చెందిన రాజకీయ దృశ్యమే ఇప్పుడు అందరి కళ్లముందు కదులుతుంది. క్షేత్రస్థాయిలో అక్కడి ప్రజల్లో తమ పార్టీకి ఇంకా బలమైన ఆదరణ ఉందని నాయకులు గొంతు చించుకుని మరీ చెబుతున్నారు. కార్యకర్తలు కూడా పార్టీ కోసం కష్టపడుతున్నామని గుండెలు బాదుకుంటున్నారు. కానీ, బ్యాలెట్ బాక్సులు తెరిచేసరికి మాత్రం ఫలితాల లెక్కలన్నీ తారుమారైపోతున్నాయి. మరి ఇక్కడ అసలు సమస్య ప్రజల్లో ఉందా? లేక చెమటోడ్చి పనిచేసే కార్యకర్తల్లోనే ఉందా? లేక పార్టీని ముందుండి నడిపించాల్సిన నాయకత్వ తీరులోనే మొత్తం లోపం ఉందా? అన్న ప్రశ్నలు రిపీటెడ్‌గా…

Read More

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నేషనల్ జట్టు తరఫున తన ఇంటర్నేషనల్ కెరీర్‌కు ముగింపు పలికారు. పోర్చుగల్ జెర్సీలో 23 ఏళ్ల పాటు సాగిన తన అద్భుత ప్రస్థానానికి గుడ్ బై చెబుతున్నట్లు సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో ద్వారా వెల్లడించారు. పోర్చుగల్ కోసం తన శక్తినంతా ధారపోశాననే హ్యాపీనెస్‌తోనే మైదానాన్ని వీడుతున్నానని, తనకు ఎంతో స్పెషల్ అయిన 7వ నెంబర్ జెర్సీ.. ఇకపై రాబోయే కొత్త తరం ఆటగాళ్ల సొంతమవుతుందని ఎమోషనల్‌గా చెప్పారు. 2003లో కజకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ గేమ్‌లో అరంగేట్రం చేసిన రొనాల్డో, పోర్చుగల్ టీమ్‌నను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్రను పోషించారు. తన కెరీర్‌లో 2016 యూరో కప్‌తో పాటు 2019, 2025 లలో రెండుసార్లు నేషన్స్ లీగ్ టైటిల్స్‌ను పోర్చుగల్‌కు అందించారు. జాతీయ జట్టు తరఫున ఎక్కువగా 234 మ్యాచ్‌లు ఆడి, 146 గోల్స్ చేసిన ఆటగాడిగా…

Read More

రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న విషయం కొన్ని నెలలుగా వినిపిస్తోంది. సొంతంగా ప్రాంతీయ పార్టీని స్థాపించడానికి వేగంగా సన్నాహాలు చేసుకుంటున్న విజయసాయి..నవంబర్ 11వ తేదీన జరిగే పార్టీ ప్రారంభోత్సవానికి ముందే గ్రౌండ్ వర్క్‌ను వేగవంతం చేశారు. దానిలో భాగంగానే తన రాజకీయ ప్రస్థానాన్ని, భావజాలాన్ని వివరిస్తూ ఒక సన్నాహక గీతాన్ని రిలీజ్ చేయడంతో రాజకీయా వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ అధినాయకత్వంతో విభేదాలు రావడం, పార్టీ పదవులకు కూడా స్వస్తి చెప్పడం వంటి పరిణామాలు శరవేగంగా జరిగాయి. తర్వాత జాతీయ పార్టీలలో ఆ తర్వాత స్థానిక పొత్తులలో చేరతారని ప్రచారం జరిగినా కూడా ఆ ఊహాగానాలన్నింటికీ కూడా ఆయన స్వస్తి చెప్పి తాను స్వయంగా ఒక పొలిటికల్ ఫోరమ్ సృష్టిస్తున్నట్లు విజయసాయిరెడ్డి తేల్చిచెప్పేశారు. కొత్త పార్టీ కోసం డేట్ టైమ్‌ ఫిక్స్ చేసి మరీ రెడీ…

Read More

తెలుగు రాష్ట్రాల్లో వానల ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. మొన్న అర్నబ్ తుపాన్, తర్వాత మురసు తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఏపీ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రైతాంగానికి భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల నుంచి ఇంకా కోలుకోకముందే, తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) లేటెస్ట్ వెదర్ బులెటిన్‌లో హెచ్చరించింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. తూర్పు తెలంగాణ, దానికి ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర ప్రాంతాలలో కొనసాగిన అల్పపీడనం బలహీనపడినా కూడా, దాని ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 – 4.5 కి.మీ ఎత్తులో ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే…

Read More

భారీ తారాగణంతో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో వచ్చిన రామాయణం ఫస్ట్ పార్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, పబ్లిక్‌లోనూ బాగా హాట్ టాపిక్‌గా మారింది. ఒక హిస్టారికల్ అండ్ ఆధ్యాత్మిక కలబోసిన మహోన్నత కథను ఈ తరం వారికి సాంకేతికతకు యాడ్ చేసి చెప్పడంలో దర్శకుడు నితీశ్ తివారీ చేసిన ప్రయత్నం చాలామంది ప్రశంసలు అందుకుంటోంది. కథ పరంగా అందరికీ తెలిసిన విషయాలే అయినా సరే, దర్శకుడు కథనాన్ని నడిపిన తీరే ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీలో డైరెక్టర్‌ దానిని బాగానే క్యాచ్ చేశాడని చెప్పొచ్చు. అయోధ్యలో శ్రీరాముడి బాల్యం, కైకేయి వరాల వల్ల చోటుచేసుకున్న పరిణామాలు, సీతారాముల అరణ్యవాస ఘట్టాల వరకు ఈ మూవీలో ఆకట్టుకునేలా మలిచారు. ముఖ్యంగా విరామానికి ముందు వచ్చే కీలక పరిణామాలు రెండో భాగంపై విపరీతమైన ఆసక్తిని పెంచుతాయి. సినిమాకు రణబీర్ కపూర్, యశ్ నటన మెయిన్ పిల్లర్లుగా నిలిచాయి. రాముడి పాత్రలోని ధర్మనిష్ఠను తనలో…

Read More

పాలిటిక్స్‌లో గెలుపు అనేది కేవలం సంబరం కాదు, అది రాజకీయంలో భాగం మాత్రమే. అలాగే ఓటమి అనేది కూడా ఓ ముగింపు కాదు, పదునైన లెసన్. కానీ, ఎజెండా ఏదైనా కావొచ్చు పోరాటం ఎక్కడైనా కావొచ్చు.. ఓడిపోయిన ప్రతీసారీ అది ప్రత్యర్థుల కుట్రలగానో, అధికార పార్టీ ప్రలోభాల గానో అలాగే వ్యవస్థలోని లోపాలను సాకుగా చూపించకూడదు. ఇంకా చెప్పాలంటే సొంత ఇంట్లో మండుతున్న చిచ్చును పట్టించుకోకపోతే దాన్ని రాజకీయ విశ్లేషణ అని కూడా అనలేం. అది కేవలం కళ్ల ముందు జరుగుతున్న నిజాల నుంచి పారిపోవడమే. ప్రస్తుత వైసీపీ రాజకీయ గమనాన్ని జాగ్రత్తగా గమనిస్తే సరిగ్గా ఇలాంటి అంతర్మథనమే తెర మీదకు వస్తుంది. పుర ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడం ఆ పార్టీకి ఒక ఎత్తయితే, అసలు ఆ పరాజయానికి మూలాలు ఎక్కడున్నాయో బేరీజు వేసుకోలేకపోవడం మరో పెద్ద వ్యూహాత్మక లోపంగా కనిపిస్తోంది. అవతలివారు బలంగా ఉన్నారని ఒప్పుకోవచ్చు, అధికారంలో ఉన్నవారికి ఎప్పుడూ…

Read More

పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని నెలలుగా ఉద్భవించిన అత్యంత పవర్ ఫుల్ అయిన సూపర్ ఎల్‌నినో.. భారత్‌తో పాటు దాదాపు 90 దేశాలపై మరింతగా తీవ్ర ప్రభావాన్ని చూపించడానికి సిద్ధమవుతోంది. ఈ వాతావరణ మార్పుల కారణంగా దేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మూడు ప్రధాన రకాల విపత్తులు సంభవించే అవకాశముంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రుతుపవనాల వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం, చలికాలంలో కూడా సాధారణం కంటే ఎక్కువ టెంపరేచర్లు నమోదు కావడం అలాగే వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయి ఆహార భద్రత ప్రమాదంలో పడటం వంటి సవాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్నాయి. ఈ ఎల్‌నినో విపత్తు వల్ల ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పంటలపై ప్రతికూల ప్రభావం పడింది. వర్షాలు టైమ్‌కు కురవకపోవడంతో చాలా చోట్ల పంటలు ఎండిపోయాయి. డిసెంబర్, జనవరి మాసాల్లో సాధారణంగా తీవ్రమైన చలి ఉండాల్సిన సమయం కానీ ఈసారి ఉష్ణోగ్రతలు పెరగనుండటంతో రాబోయే రబీ పంటలు…

Read More

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చి కొన్ని గంటలు గడిచిపోయినా రాజకీయ వర్గాల్లో రసవత్తర చర్చకు మాత్రం ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. కూటమి క్లీన్ స్వీప్ చేసినా కొన్ని ప్రాంతాల్లో రెబల్స్, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. పొత్తుల సద్దుబాటులో భాగంగా సీట్లు దక్కని అసంతృప్త నేతలు కొంతమంది బరిలో దిగి ఊహించని విజయాలను నమోదు చేశారు. మెయిన్‌గా కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో జనసేన రెబల్ కేండిడేట్ క్రియేట్ చేసిన సంచలనం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆదోని చైర్‌పర్సన్ స్థానం కూటమి సీట్ల కేటాయింపులో భాగంగా టీడీపీకి దక్కడంతో నాగమణిని తెలుగుదేశం పార్టీ బరిలో నిలిపింది. దీంతో జనసేన ఆదోని ఇన్‌చార్జి మల్లప్ప నాయకర్ తన భార్య స్వప్న మల్లప్ప నాయకర్‌ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దించారు. అలా ఉత్కంఠభరితంగా సాగిన మున్సిపల్ పోరులో స్వప్న ఏకంగా చైర్‌పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకుని…

Read More

వంగ‌వీటి కెర‌టం మ‌ళ్లీ ఎగ‌సిప‌డింది. వంగ‌వీటి రంగా వార‌సుడు రాధా విజ‌య‌వాడ మేయ‌ర్ గా గెలిచారు. అస‌లు రాధాను అభ్య‌ర్ధిగా, అది కూడా జ‌న‌సేన అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించిన‌ప్పుడే గెలుపు ఫిక్స్ అయిపోయింది. త‌ర్వాత సోష‌ల్ మీడియా హ‌డావుడితో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఇబ్బంది పెట్టొచ్చ‌నే అంచ‌నాలు వ‌చ్చాయి గాని.. అవ‌న్నీ సోష‌ల్ మీడియాకే ప‌రిమితం అయ్యాయి. ప‌డాల్సిన ఓట్లు రాధాకు ఇంకా ఉన్నాయి. కాని అవి పోలింగ్ రోజు ఓటింగ్ త‌గ్గినప్పుడే రావ‌ని అర్ధ‌మైంది. అందుకు వంగ‌వీటి కులం కార‌ణం కావొచ్చు.. లేదా రాధాపై వారికున్న అభిప్రాయం వ‌ల్ల కావొచ్చు.. అందుకే పోలింగ్ శాతం త‌గ్గింది. కూట‌మి ఓట్ల‌న్నీ ప‌డుంటే ఈ రోజు మెజారిటీ ఇంకా ఎక్కువ ఉండేది అన‌డంలో సందేహం లేదు. ఏమైనా ఇది వంగ‌వీటి రాధ‌కు మ‌రో ఛాన్స్. ఒక‌ప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్పుడు అంత పేరు రాలేదు. పైగా రంగాతో పోల్చుకుని కాస్త నిరాశ‌ప‌డ్డ విష‌యం వాస్త‌వం. కాని త‌ర్వాత…

Read More