సినిమాల్లో విలన్లను కూడా గడగడలాడించే నటసింహం నందమూరి బాలకృష్ణ రియల్ లైఫ్‌లో ఒకరి విషయంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గుతారని జగపతిబాబు టాక్ షోలో మంత్రి నారా లోకేష్(Nara Lokesh) చెప్పుకొచ్చారు. బాలయ్య కూతురు, నారా లోకేష్ సతీమణి బ్రహ్మణి అంటే భయపడతారని చెబుతూ ఫ్యామిలీ మ్యాటర్స్ రివీల్ చేశారు.
అందరికీ ఆయన బాలయ్య బాబు, కానీ తనకు మాత్రం ముద్దుల మావయ్య అని చెప్పిన లోకేష్.. బ్రహ్మణి గనుక పుట్టింటికి భోజనానికి వస్తే బాలకృష్ణ తనకిష్టమైన వంటకాలేవీ తినలేరని షోలో నవ్వులు పూయించారు. కేవలం కుటుంబ విశేషాలే కాకుండా తన చదువు, బిజినెస్ జర్నీకి సంబంధించిన ఎన్నో మధుర జ్ఞాపకాలను లోకేష్ ఈ వేదికగా షేర్ చేసుకున్నారు.
చిన్నప్పుడు జూబ్లీహిల్స్‌లోని విద్యాభవన్‌లో బ్యాక్‌బెంచర్‌గా తిరుగుతూ బాగా అల్లరి చేసేవాడినని, కానీ చదవడం కంటే క్రికెట్ అంటేనే తనకు చాలా ఇష్టమని నారా లోకేష్(Nara Lokesh) గుర్తు చేసుకున్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి చేసిన అల్లర్లు, అప్పట్లో టీచర్లు నేర్పిన క్రమశిక్షణే తన లైఫ్‌కి పునాది అయ్యాయని చెప్పారు. ఆ తర్వాత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన డేస్‌ను, సింగపూర్ పీఎం ఆఫీస్‌తో సహా కొన్ని కార్పొరేట్ సంస్థల్లో పని చేసిన అనుభవాలను వివరించారు.
అమెరికా నుంచి తిరిగి వచ్చి హెరిటేజ్ బాధ్యతలను చేపట్టిన ఫస్ట్ ఇయర్ తీవ్ర నష్టాలు చవిచూసినా, పట్టుదలతో పెరుగును చిన్న ప్యాకెట్లలో అందించే సరికొత్త మార్కెటింగ్ ఐడియాతో కంపెనీని విజయవంతంగా లాభాల బాట పట్టించినట్లు గర్వంగా వివరించారు. ఇక ఎంత బిజీగా ఉన్నా ప్రతి సండే తన కుమారుడు దేవాన్ష్‌తో మాత్రమే టైమ్ గడుపుతానని, స్కూల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్స్‌కు తాను కచ్చితంగా హాజరవుతానని తెలిపారు. పాలిటిక్స్‌లో ఎంతటి బిజీ షెడ్యూల్ ఉన్నా కుటుంబానికి, పిల్లల పెంపకానికి తగినంత ఇంపార్టెన్స్ ఇస్తానని లోకేష్ చెప్పారు.
అలాగే 2023లో చంద్రబాబు అరెస్ట్ టైమ్‌లో ఎదురైన భావోద్వేగ క్షణాలతో పాటు కష్టకాలంలో సోదరుడు పవన్ కళ్యాణ్ అందించిన మద్దతును జగపతిబాబుతో చెబుతూ నారా లోకేష్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు పర్సనల్ లైఫ్‌లోని సరదా సంఘటనలు, ఎమోషనల్ మూమెంట్స్‌ను లోకేష్ పంచుకున్న తీరు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది.
