బంగాళాఖాతంలో కదులుతున్న అక్వాన్ తుపాను తాజాగా ఏపీ తీరప్రాంత ప్రజలను తీవ్రంగా వణికించడానికి సిద్ధం అయింది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ ద్రోణి మరింత వేగంగా బలపడుతోంది. ఇది బుధవారం అంటే నవంబర్ 18 వ తేదీకి తీవ్ర తుపానుగా, నవంబర్ 19 గురువారానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ తుపాను నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ , యానాం తీర ప్రాంతాల మధ్య ఎక్కడో ఒకచోట నేలను తాకే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 670 కిలోమీటర్లు దూరంలో, చెన్నైకి 590 కి.మీ. దూరంలో ఉన్న అక్వాన్, నెమ్మదిగా వాయవ్య దిశగా అడుగులు వేస్తోంది. అయితే తీరం దాటే టైమ్‌కి దీని విశ్వరూపం కనిపించనుందని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో తీరప్రాంతంలో గంటకు 120 – 130 కి.మీ. వేగంతో భీకరమైన…
Author: Lalitha
పాలిటిక్స్‌లో సైద్ధాంతిక విభేదాలు, విమర్శలు, ప్రతివిమర్శలు చాలా కామన్. కానీ, ఒక ఇంట్లోని శుభకార్యానికి సంబంధించి శుభలేఖను అందించే సంప్రదాయాన్ని కూడా రాజకీయ రొచ్చులోకి లాగడం, ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వల్గర్ కథనాలు రాయడం ఏమాత్రం సమర్థనీయం కాదనే చర్చ ఏపీ వ్యాప్తంగా నడుస్తోంది. తాజాగా తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. అయితే, దీనిని అడ్డుపెట్టుకుని వైసీపీకి చెందిన న్యూస్ పేపర్లో వచ్చిన కథనంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎంతో ఆవేదనతో, తీవ్ర ఆగ్రహంతో రియాక్ట్ అయ్యారు. ఒక వైపు సొంత చెల్లిగా, మరోవైపు ఒక సొసైటీలో ఉన్న ఆడబిడ్డగా తనకు జరిగిన అవమానాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఘాటుగా కామెంట్ల చేశారు. తన బిడ్డ పెళ్లికి ఒక పెద్దమనిషిని, తండ్రి వయసున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలవడం రాజకీయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆత్మీయంగా వెళ్లి…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్రలకు ప్రత్యేకమైన చరిత్ర ఉందన్న విషయం తెలిసిందే . ప్రజల మధ్యకు వెళ్లడం, వారి సమస్యలను దగ్గర నుంచి వినడం, పార్టీకి కొత్త ఊపిరి తీసుకురావడం.. ఇలా ఒక లీడర్ పొలిటికల్ ఫ్యూచర్‌ను మార్చగల శక్తి పాదయాత్రకు ఉందన్నది ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత లోకేష్, వైఎస్ జగన్,షర్మిల చేపట్టిన పాదయాత్రలు అందుకు ఉదాహరణలుగా నిలిచాయి. ఇలా కొద్దిరోజులుగా జగన్ పాదయాత్ర చర్చలోకి వస్తుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే కూడా చాలా ముందుగానే జగన్ జనంలోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. 2027 చివరి 3 నెలల్లో ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర స్టార్ట్ చేస్తానని గతంలోనే జగన్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ముందు మార్చి.. మార్చి 2027 నుంచే పాదయాత్ర మొదలు పెట్టే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీని కోసం రూట్ మ్యాప్…
ఒకప్పుడు శోభన్ బాబు తెరపై కనిపిస్తే చాలు.. థియేటర్లలో అభిమానుల కేరింతలు వినిపించేవి. ఆయన నవ్వు, హెయిర్‌స్టైల్, హుందాతనం చూసి అభిమానించే వాళ్లు లక్షల్లో ఉండేవారు. మెయిన్‌గా మహిళా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అందుకే తెలుగు ప్రేక్షకులు ఆయనను ప్రేమగా ఆంధ్రుల అందగాడు, సోగ్గాడు అని పిలుచుకునేవారు. కానీ ఒక స్టేజ్‌లో అదే స్టార్డమ్కు దూరంగా ఉండాలని శోభన్ బాబు నిర్ణయించుకున్నారు. సినిమాలకు స్వస్తి చెప్పారు. మీడియా కంటికి కనిపించడం తగ్గించారు. చివరి రోజుల్లో కుటుంబ సభ్యులకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. ఇంతటి పేరు, అభిమానాన్ని సంపాదించుకున్న నటుడు ఒక్కసారిగా ఇలా ఎందుకు మారిపోయారు? ఏజ్ పెరగడం ఆయన నిర్ణయంపై ప్రభావం చూపిందా? లేక అందరికీ భిన్నంగా తన జీవితాన్ని తానే నడిపించుకోవాలనుకున్నారా? శోభన్ బాబు జీవితంలోని ఈ ఆసక్తికరమైన కోణాలను తెలుసుకుందాం. సాధారణ కుటుంబం నుంచి వెండితెరపై వెలిగిన అందాల హీరో శోభన్ బాబు…
దొంగతనం చేయాలంటే చీకటిని ఎంచుకుంటారు.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటారు. కానీ బీహార్‌లో కొందరు మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన దారిని ఎంచుకున్నారు. పోలీసులకు భయపడుతూ దాక్కోవాల్సిన అవసరం లేకుండా.. ఏకంగా తామే పోలీసుల అవతారం ఎత్తారు. అంతటితో ఆగకుండా ఒక నకిలీ పోలీస్ స్టేషన్(Fake police station)ను కూడా ఏర్పాటు చేశారు. అందులో డీఎస్పీ, ఇన్స్పెక్టర్, కానిస్టేబుళ్ల హోదాలతో సిబ్బందిని నియమించుకున్నారు. నిజమైన పోలీస్ స్టేషన్‌ను తలపించేలా సెటప్, కుర్చీలు, యూనిఫామ్‌లు, కంప్లైంట్లు తీసుకునే సిస్టంను సిద్ధం చేశారు. ఇలా సుమారు 8 నెలల పాటు సాగిన ఈ నకిలీ పోలీస్ స్టేషన్(Fake police station) వ్యవహారం చివరకు అసలు పోలీసుల దృష్టికి రావడంతో బట్టబయలైంది. హోటల్లోనే పోలీస్ స్టేషన్ ఏర్పాటు.. ఈ విచిత్రమైన ఘటన బీహార్‌లోని బంకా (Banka) ఏరియాలో వెలుగుచూసింది. సాధారణంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ అనుమతులు, అధికారుల నియామకాలు, అధికారిక భవనం వంటి ఎన్నో…
ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా పడుతూ వస్తున్న పట్టణ స్థానిక సంస్థల (ULB) ఎలక్షన్స్‌కు రూట్ క్లియర్ అయింది. ఏపీలోని పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎలక్షన్స్ నిర్వహణకు స్టేట్ ఎన్నికల సంఘం (SEC) పూర్తిగా రెడీ అయింది. నవంబరు 12వ తేదీ గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మీడియా సమావేశంలో అఫీషియల్‌గా ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించనున్నారు. ఈ షెడ్యూల్ వెలువడటంతోనే కొన్ని పట్టణాల్లో వెంటనే ఎన్నికల మోడల్ కోడ్ అమల్లోకి రాబోతోంది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 123 అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండగా, 100 సంస్థలకు ఇప్పటికే ఎలక్షన్ ప్రాసెస్ ముగిసింది. మిగిలిన 4 కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు, 4 నగర పంచాయతీలకు సంబంధించి హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో ముందు విడుదల చేసిన సాధారణ నోటిఫికేషన్లో వీటికి చోటు లభించలేదు. ప్రస్తుతం న్యాయపరమైన అడ్డంకులు పూర్తిగా తొలగిపోవడంతో పాటు వార్డుల…
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన లైఫ్‌ను బేస్ చేసుకుని రాసిన ఆత్మకథ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం ఆధారంగా తెలుగులో ఓ ప్రెస్టీజియస్ మూవీని తెరకెక్కిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో జగ్గారెడ్డి ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. ఇందిరా గాంధీ కోడలిగానే కాకుండా.. రాజీవ్ గాంధీ భార్యగా అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తల్లిగా సోనియా సాగించిన పర్సనల్ లైఫ్ జర్నీతో పాటు ఎదుర్కొన్న ఎన్నో రాజకీయ సవాళ్లను ఈ సోనియా బయోపిక్(Sonia Gandhi Biopic ) ద్వారా ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. ఇండియన్ పాలిటిక్స్‌లో సోనియా గాంధీ వహించిన పాత్ర చారిత్రాత్మకమైనదని, ఆమెది అత్యంత విజయవంతమైన, త్యాగపూరితమైన పొలిటికల్ జీవితమని జగ్గారెడ్డి కొనియాడారు. ప్రధానమంత్రి అయ్యే గొప్ప…
బుల్లితెరపై ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఓటీటీ ప్రపంచాన్ని ఏలడానికి మెగావర్స్(Megaverse) పేరుతో సిద్ధమవుతున్నారన్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి మెగావర్స్ స్పెషల్ షోను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండటంతో.. మెగాభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి సినీ పయనం మాత్రమే కాకుండా ఆయన లైఫ్‌లోని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఎవరికీ తెలీని రహస్యాలను ఈ షో ద్వారా బయటపెట్టనున్నారు. మెగావర్స్(Megaverse) షో కోసం సెలక్ట్ చేసిన గెస్ట్‌ల లిస్ట్ కూడా అంతే గ్రాండ్‌గా ఉంది. షో స్టార్టింగ్ ఎపిసోడ్‌లోనే విశ్వనటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య సాగిన సంభాషణలు, పాతకాలపు జ్ఞాపకాలు ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ను ఇవ్వడం గ్యారంటీ అని మేకర్స్ భావిస్తున్నారు. మరో ఎపిసోడ్‌ను…
ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ బాడీ పోరుకు మళ్లీ తెరలేచింది. సుదీర్ఘకాలంగా వివిధ న్యాయపరమైన వివాదాలు, కోర్టు స్టేల వల్ల పెండింగ్‌లో పడిపోయిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల(Urban Local Body Elections)ను నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) సమాయత్తమవుతోంది. కోర్టు సమస్యలు తొలగిపోవడంతో ఏపీలోని 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించడానికి కసరత్తు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా నవంబర్ 26వ తేదీన ఓటింగ్ నిర్వహించాలని ప్రాథమికంగా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై నవంబర్ 13వ తేదీన అధికారిక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల (Municipal elections) పోరులో ఏపీలోని కొన్ని కీలక నగరాలు, ప్రధాన పట్టణాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థలకు (Corporations) ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు ఆముదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప,…
ఇండియన్ చలనచిత్ర రంగాన సరికొత్త హిస్టరీ ఆవిష్కృతమవుతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యున్నత టెక్నికల్ ప్రమాణాలతో తెరకెక్కిన పౌరాణిక కావ్య అపురూపచిత్రం రామాయణం మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా రిలీజైన ఈ సినిమా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణను పొందుతూ ఊహించని విధంగా వసూళ్ల రికార్డులను తిరగరాస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మూవీ రిలీజైన కేవలం ఆరు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ. 800 కోట్ల గ్రాస్ మార్క్‌ను సునాయసంగా దాటేసి రికార్డుల వేటను కొనసాగిస్తూనే ఉంది. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలతో పాటు నార్త్ ఇండియాలో కూడా ఈ పిక్చర్‌కు థియేటర్ల వద్ద జనాలు బ్రహ్మరథాన్ని పడుతున్నారు. వీకెండ్స్‌లోనే కాకుండా వీక్ డేస్‌లో కూడా హౌస్‌ఫుల్ బోర్డులతో చిన్నాపెద్ద లేకుండా థియేటర్లు కళకళలాడుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి మొదటి 6 రోజుల్లోనే రూ. 440.45 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది.…