ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల పాలిటిక్స్ మరోసారి ఆసక్తికరంగా మారనున్నాయి. ఇటీవల పోలింగ్ ప్రాసెస్ పూర్తయిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కీలక పదవులను భర్తీకి ఏపీ ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది. డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్పర్సన్ల ఎలక్షన్ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అఫీషియల్ షెడ్యూల్‌ను ప్రకటించారు. దీంతో ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో పొలిటికల్ సమీకరణాలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు ఏపీలోని నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు లేదా నగర పంచాయతీలకు సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్‌ను ఎస్ఈసీ ప్రకటించింది. నవంబర్ 26 వ తేదీ గురువారం ఆయా స్థానిక సంస్థల్లో పోలింగ్ పూర్తయింది. ఈ ఓట్ల లెక్కింపు నవంబర్ 30వ తేదీన నిర్వహించి, అదే రోజు రిజల్ట్స్ వెల్లడించనున్నారు. ఫలితాల తర్వాత ఆయా సంస్థల్లో కీలక పదవుల కోసం పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.…
Author: Lalitha
పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో వార్ వన్ సైడ్… గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అలా లేని పరిస్ధితి. తొలి విడత పంచాయతీల్లో దాదాపు 1100 మంది వైసీపీ మద్దతుదారులు సర్పంచులుగా ఎన్నికైన వైనం. పార్టీ గుర్తులతో జరిగిన ఎన్నికల్లో కూటమి హవా చూపిస్తే.. పార్టీ గుర్తులు లేని చోట అంత లేకపోవడం దేనికి సంకేతం? చాలా చోట్ల అపశృతులు… అసంతృప్తులు ఉన్నా పొత్తులు ఫలించాయి. కాని పంచాయతీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధం లేదు.. పార్టీలకు సంబంధం లేదు.. గుర్తులు లేనే లేవు… అక్కడ మాత్రం వైసీపీ మరీ దారుణంగా దెబ్బ తినకుండా కాస్త బెటర్ గానే దాని మద్దతుదారులు గెలిచినట్లు ఇప్పటికే వైసీపీ మీడియా గట్టిగానే సౌండ్ చేస్తోంది. దీని నుంచి కూటమి నాయకులు తెలుసుకోవాల్సినదేంటి? రాష్ట్రంలో కూటమిపై వ్యతిరేకత లేదు.. కూటమి అధినేతలపై వ్యతిరేకత లేదు.. ప్రభుత్వంపై అసంతృప్తి తప్పితే వ్యతిరేకత లేదు.. కాని ఎమ్మెల్యేలపై మాత్రం విపరీతమైన అసంతృప్తి,…
ఏపీలో సార్వత్రిక ఎలక్షన్ నుంచి మొదలైన కూటమి విజయ పరంపర ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటుతోంది. తాజాగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చూపిన హవానే ఇప్పుడు పంచాయతీ పోరులో కూడా స్పష్టంగా కనిపించింది. ఏపీలో 3 దశల్లో నిర్వహిస్తున్న పంచాయతీ పోరులో భాగంగా, నవంబర్ 26వ తేదీన జరిగిన తొలి విడత పోలింగ్ ఫలితాలు సాయంత్రానికి కొన్ని చోట్ల రాత్రికి వెలువడ్డాయి. ఈ పల్లె పోరు ఫలితాల్లో అధికార టీడీపీ మద్దతుదారులు అద్భుత విజయాన్ని సాధించి గ్రామీణ ప్రాంతాలపై.. తమకున్న పట్టును మరోసారి నిరూపించుకున్నారు. మొత్తం ఫస్ట్ స్టేజిలో 3,949 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా, దానిలో ఏకంగా 760 పంచాయతీలు ఏకగ్రీవంగా ముగిశాయి. ఇక మిగిలిన 3,189 సర్పంచ్ పదవుల కోసం తీవ్ర పోటీ మధ్య నవంబర్ 26వ తేదీ గురువారం ఉదయం నుంచి పోలింగ్ సాగింది. సాయంత్రం ఓట్ల…
రాజ్యాంగ సవరణ బిల్లుల అంశం రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారబోతోంది. నవంబరు 30వ తేదీ నుంచి మొదలయ్యే సభలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే లోక్‌సభలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఈ బిల్లును ఆమోదింపజేసుకోవడం ఎన్డీయేకు సాధారణ విషయం కాదన్న వాదన వినిపిస్తోంది. లోక్‌సభ సభ్యుల సంఖ్య ప్రస్తుతం 540 కాగా, రాజ్యాంగ సవరణ చట్టం నిబంధనల ప్రకారం ఓటింగ్‌లో పాల్గొనే వారిలో 2/3 వంతు అంటే కనీసం 360 మంది సభ్యుల ఆమోదం కావాలి. ప్రస్తుతమున్న లెక్కల ప్రకారం చూస్తే ఎన్డీయే పక్షాన 320 మంది ఎంపీలు ఉన్నారు. ఈ సమయంలో ఈ బిల్లు గట్టెక్కాలంటే కనీసం మరో 40 మంది సభ్యుల సపోర్ట్ కూటమికి అత్యవసరంగా మారింది. ఈ సవాలును దాటడానికి ప్రభుత్వం ముందు 3 ప్రధాన సమీకరణలు కనిపిస్తున్నాయి. డీఎంకే, ఎన్సీపీ-ఎస్పీ,…
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ (Belonging) బుక్ తర్వాత భారత రాజకీయాలలో రోజుకో వార్త హాట్ టాపిక్‌గా మారుతోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్య వెనుక ఉన్న భద్రతా లోపాలపై ఆయన కుమారుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా, ప్రియాంకలతో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. తన తండ్రి భద్రతను ఉద్దేశపూర్వకంగానే తగ్గించారని, ఆ దారుణం జరగడానికి పరోక్షంగా వారి మార్గాన్ని సుగమం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. రాజీవ్ గాంధీని టార్గెట్‌గా చేసుకుని హంతకులు దాడి చేయడానికి అప్పట్లో ఉన్న భద్రతా వ్యవస్థల సడలింపే ప్రధాన కారణమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఒక దేశ మాజీ ప్రధానికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్‌ను హఠాత్తుగా తొలగించడం వెనుక ఉన్న అసలు కారణాలేమిటో ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన…
బంగారం ధరల పెరుగుదల, రుణ అర్హత మెరుగుపడటం వంటి రీజన్స్‌తో దేశంలో గోల్డ్ లోన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. రెండేళ్ల కాలంలో బంగారు రుణాల పోర్ట్‌ఫోలియో సుమారు రెట్టింపు స్థాయికి చేరుకుని రూ. 15.6 లక్షల కోట్లకు ఎగబాకినట్లు క్రెడిట్ సమాచార సంస్థ నివేదికలు వెల్లడించాయి. బంగారం విలువ పెరగడంతో తక్కువ గోల్డ్‌పై కూడా ఎక్కువ రుణం పొందే అవకాశం కస్టమర్లకు లభించింది. మరోవైపు, బలమైన తనఖా ఆస్తి ఉండటంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఈ రంగంలో లోన్స్‌ను జారీ చేయడానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నాయి. నివేదికల ప్రకారం, క్రియాశీలక గోల్డ్ రుణాల సంఖ్య 10.3 శాతం వరకూ పెరిగింది. ముఖ్యంగా రూ. 2.5 లక్షలకు మించిన రుణాల వాటా మొత్తం పోర్ట్‌ఫోలియోలో సుమారు సగానికి చేరుకుంది. గతంలో ఇది 36.4 శాతంగా ఉండేది. ప్రభుత్వ రంగ రుణదాతలు ఈ మార్కెట్లో సుమారు 60 శాతం వాటాతో అగ్రగామిగా నిలిచారు. మొత్తం…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల సర్దుబాటు రోజురోజుకు రచ్చకెక్కుతోంది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి విడత చర్చలు ఫలించకపోవడంతో, రెండోసారి జరిపిన చర్చల్లో కూడా ఒక క్లియర్ ఏకాభిప్రాయం కుదరలేదు. స్టార్టింగ్‌లో 181 స్థానాలు డిమాండ్ చేసిన కాంగ్రెస్, కొంత వెనక్కి తగ్గి 130 స్థానాలతో కూడిన లిస్ట్‌ను ఎస్పీ లీడర్స్ ముందుంచింది. అయితే, కాంగ్రెస్ ప్రతిపాదనపై రియాక్ట్ అయిన ఎస్పీ, కేవలం 26 అసెంబ్లీ సీట్లను ఆఫర్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించినట్లు పార్టీ ప్రతినిధి రాజీవ్ రాయ్ వెల్లడించారు. 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 2 సీట్లు, రెండో స్థానంలో నిలిచిన 4 స్థానాలతో పాటు మరో 20 నియోజకవర్గాలను దీనిలో చేర్చినట్లు తెలిపారు. అయితే, ఎస్పీ ప్రతిపాదించిన 26 సీట్ల ఆఫర్‌పై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ…
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వింటర్ సమావేశాలు డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 15 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సెషన్లో ఏపీ ప్రభుత్వం అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తున్న పెట్టుబడుల రక్షణ చట్టం (ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్) బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఇది ఒక కీలక అడుగుగా నిలవబోతోంది. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు పొలిటికల్ ఈక్వేషన్స్, ప్రభుత్వ మార్పులతో సంబంధం లేకుండా చట్టబద్ధమైన రక్షణ కల్పించడమే ఈ చట్టం మెయిన్ టార్గెట్. గతంలో కూటమి ప్రభుత్వాలు మారినప్పుడు.. ఇండస్ట్రీలకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపుల విషయంలో సడన్ పాలసీ మార్పులు జరిగి ఇన్వెస్టర్లు ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా, ఇన్వెస్టర్స్‌కు దీర్ఘకాలిక భరోసా ఇచ్చేలా ఈ బిల్లును తీర్చిదిద్దుతున్నారు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి చట్టాన్ని రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే…
ఫ్యూచర్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టంను సరికొత్తగా మార్చే దిశగా చైనా మరో క్రేజీ ప్రయోగాన్ని చేపట్టింది. విమానాల్లా రన్‌వేపై పరిగెత్తాల్సిన అవసరమేమీ లేకుండా, హెలికాప్టర్ లాగే గాల్లోకి లేచి ప్రయాణించగల ఫ్లయింగ్ కారును చైనా సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించింది. దేశంలోని చాంగ్షాలో జరిగిన ఈ ప్రయోగంలో, అచ్చం సాధారణ కాంపాక్ట్ కారు సైజులో నున్న ఈ ఫ్లయింగ్ కారు ఒకే చోట నిలబడి డైరెక్టుగా పైకి లేవడం, గాల్లో కొంతసేపు నిలకడగా ఉండటం (హోవరింగ్), అలాగే అనుకున్న ప్రదేశంలో సేఫ్‌గా కిందకు దిగడం వంటి విన్యాసాలను ప్రదర్శించింది. ఈ సరికొత్త టెక్నాలజీకి సంబంధించిన వివరాలను భారతదేశంలో ఉన్న చైనా రాయబారి జు ఫెయిహాంగ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. రోడ్డుపై ఉన్న వెహికల్ ఎలాంటి రన్‌వే సాయం లేకుండా డైరెక్టుగా గాల్లోకి లేచిన దృశ్యాలను ఈ వీడియోలో స్పష్టంగా చూపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ ఫ్లయింగ్ కారు టేకాఫ్ బరువు 280 కిలోలు…
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలో మిత్రపక్షాలైన జనసేన, టీడీపీ మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పక్కన పెట్టి, వైసీపీ సభ్యుల సాయంతో వైస్ ఛైర్మన్ పదవిని జనసేన దక్కించుకోవడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. నవంబర్ 24వ తేదీ సోమవారం జరిగిన ఎన్నికల్లో జనసేన కౌన్సిలర్ కళ్యాణ చక్రవర్తి, టీడీపీ అభ్యర్థి కొమ్మిన వెంకటేశ్వరరావుపై గెలుపొందారు. ఈ పరిణామాలకు ముందు జనసేనకు చెందిన మున్సిపల్ ఛైర్పర్సన్ మురాల జ్యోతితో పాటు 32 మంది వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నిర్వహించిన వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో నాలుగో వార్డు కౌన్సిలర్ కళ్యాణ చక్రవర్తికి 18 ఓట్లు దక్కగా, టీడీపీ అభ్యర్థికి 13 ఓట్లు మాత్రమే వచ్చాయి. కళ్యాణ చక్రవర్తి విజయంలో జనసేన పార్టీకి చెందిన 15 మందితో పాటు బీజేపీకి చెందిన ఒకరు, వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇటీవల…