Author: Lalitha

మూడేళ్ల కిందట రిలీజైన జైలర్ సినిమాతో అప్పట్లో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేసి, థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ మరోసారి ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. అప్పట్లో క్రియేట్ చేసిన ఆ మ్యాజిక్‌ను ..ఈ సీక్వెల్ ఇప్పుడు రిపీట్ చేసిందా లేదా అనే క్యూరియాసిటీ ప్రతీ సినీ అభిమానిలోనూ ఉంది. స్టోరీ విషయానికి వస్తే, తన కొడుకును కోల్పోయిన తర్వాత ఓ సూపర్ మార్కెట్‌లో పని చేసుకుంటూ ఉండే ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్)లైఫ్‌లోకి మరోసారి గ్యాంగ్ వార్ గండం వచ్చిపడుతుంది. ఫస్ట్ పార్ట్‌లో చనిపోయిన విలన్.. వర్మ వెనుక ఉన్న బడా స్మగ్లింగ్ మాఫియా ముఠాలన్నీ అసలు హంతకుడిని వెతుకుతూ జైలర్‌ను టార్గెట్ చేస్తాయి. గోవా సెంటర్‌గా నడిచే నేర సామ్రాజ్య వారసులు బోధి కల్పక్ (ఎస్‌జే సూర్య), కాంతా కల్పక్ (విద్యాబాలన్) తో జైలర్ ఎలా పోటీ పడ్డాడు..…

Read More

బాలీవుడ్ నటుడు, అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చారు. అక్టోబర్ 28వ తేదీ లోగా భారతదేశాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ ఆయనకు అత్యవసర నోటీసులు జారీ చేసింది. భారత పౌరుడు కాకపోయినా కూడా ఇక్కడి రాజకీయ నిరసనల్లో చురుగ్గా పాల్గొని.. చట్ట ఉల్లంఘనకు పాల్పడినందుకు గాను ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ పోలీసుల నిర్ణయంతో బి-టౌన్ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.ఇటీవల ముంబైలోని చారిత్రాత్మక ఆగస్టు క్రాంతి మైదాన్‌లో ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా.. కాక్‌రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆయనతో పాటు నటి లేఖా వాషింగ్టన్, ఇతర కజిన్స్ కూడా ఈ ఆందోళనలో కనిపించారు.ఆ సమయంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ఇమ్రాన్‌తో సహా సుమారు 4 వందల మందిని కస్టడీలోకి తీసుకుని వ్యాన్‌లో స్టేషన్‌కు తరలించి..కొద్దిసేపటి తర్వాత…

Read More

స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్‌ను పెంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సుదీర్ఘమైన ఎన్నికల క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ముందుగా పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలయింది. అక్టోబర్ 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ, 19వ తేదీన పరిశీలన, 21వ తేదీన ఉపసంహరణ ప్రాసెస్ ముగిశాక, అక్టోబర్ 28న మున్సిపల్ పోలింగ్ నిర్వహించి అక్టోబర్ 30న ఫలితాలు ప్రకటిస్తారు. ఆ వెంటనే నవంబర్ 3వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిపి నవంబర్ 5 వ తేదీన కౌంటింగ్ చేపడతారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో రసవత్తరంగా, ఊహించని వేడిని పుట్టిస్తూ సాగే గ్రామ పంచాయతీ ఎన్నికలను నవంబర్ 26వ తేదీ, నవంబర్ 29వ తేదీ అలాగే డిసెంబర్ 2వ తేదీల్లో మూడు విడతలుగా నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికల్లో…

Read More

ఆ 23 చోట్ల తప్ప ఏపీ వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్: కోర్టు కేసులు, డీలిమిటేషన్ ఆలస్యం వల్ల శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లు సహా 23 స్థానిక సంస్థల్లో ఎన్నికలను ఎస్‌ఈసీ తాత్కాలికంగా వాయిదా వేసింది.ఏపీలో మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, పరిషత్, పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది.100 అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలకు నోటిఫికేషన్: 10 నగర పంచాయతీలు, 77 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ నెల 28న మున్సిపల్ ఎన్నికలు, 30న ఫలితాలు: నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం అక్టోబర్ 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు.నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు: పరిషత్ పోరుకు సంబంధించి నవంబర్ 3న పోలింగ్ జరుగుతుంది.నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు: లెక్కింపు పూర్తి చేసి విజేతలను ప్రకటిస్తారు.నవంబర్ 26న గ్రామ పంచాయతీ ఎన్నికలు (తొలి దశ): మొదటి విడత పంచాయతీ…

Read More

వంగ‌వీటి రంగాకు ఎంత ఇమేజ్ ఉందంటే .. చ‌నిపోయిన 38 ఏళ్ల‌కు కూడా కొడుకు, కూతురికి ఉప‌యోగ‌ప‌డేంత ఉంది. మార్గాల్లో త‌ప్పు ఒప్పులు ఎన్ని ఉన్నా రంగా జ‌నం కోస‌మే ప‌ని చేశారు. అందుకే ఆయ‌న‌కు అంత ఇమేజ్. ఎన్ని వ్యాపారాలు చేసినా.. ఎంత అవినీతి చేసినా.. ప్ర‌జ‌ల్లో నిల‌బ‌డాలంటే నాయ‌కుడు ఆ ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాలి. త‌న సంగ‌తి ఎలా ఉన్నా.. త‌న ముందుకు వ‌చ్చి క‌ష్టం చెప్పుకునేవాడికి సాయం చేయాలి.. విలువ ఇవ్వాలి. అది లేక‌పోతే ఆ నాయ‌కుడు క‌నుమ‌రుగైపోతాడు. రంగా మాత్రం ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి రాత్రి ప‌డుకునేవ‌ర‌కు జ‌నంతో ఉంటూ.. జ‌నం క‌ష్టాలు వింటూ ఉండేవాడు. చ‌ట్ట‌వ్య‌తిరేక‌మైనా స‌రే .. న్యాయం చేయ‌టానికి చూసేవాడు. అప్ప‌ట్లో చ‌ట్టాన్ని, పోలీసుల‌క‌న్నా రంగానే ఎక్కువ‌గా న‌మ్ముకునేవారు జ‌నం. అందుకే అన్న రాధా క‌న్నా, ప్ర‌త్య‌ర్ధులు నెహ్రూ కుటుంబం క‌న్నా కూడా రంగాకే జ‌నం మ‌ద్ద‌తు ఎక్కువ‌.…

Read More

ఓపెన్‌ఏఐ ఆఫీస్‌లో హైటెక్ డ్రామా బయటపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్‌లో నెంబర్ వన్‌గా వరల్డ్ వైడ్ దూసుకుపోతున్న ఓపెన్‌ఏఐ డెవలప్‌మెంట్స్‌పై కన్నేసిన ఒక ఇంజనీర్ వేసిన మాస్టర్ ప్లాన్‌ను.. ఎఫ్‌బీఐ టెక్నాలజీ సాయంతోనే తిప్పి కొట్టింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓపెన్‌ఏఐ మెయిన్ బోర్డు రూమ్‌లో సీక్రెట్‌గా ఆడియో రికార్డర్ పెట్టినట్లు రుజువు అయింది. దీంతో అబ్దుల్‌రహమాన్ అల్ఫోజాన్ అనే సౌదీ జాతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ అధికారులు ఫ్యూచర్ ప్లాన్స్, కోడింగ్ గురించి మాట్లాడే కాన్ఫరెన్స్‌ హాల్‌లోని టీవీకి రికార్డర్ కనెక్ట్ చేసి, దానిపై టాయిలెట్ పేపర్ వేసి జాగ్రత్తగా దాచిన విషయాన్ని ఆఫీస్ స్టాఫ్ చాలా తెలివిగా కనిపెట్టడంతో ఈ మ్యాటర్ బయటకు వచ్చింది. అయితే ఓపెన్‌ఏఐ టీమ్ తమ ఓన్ ఏఐ మోడల్స్ హెల్ప్‌తోనే ఈ కేస్‌ను సాల్వ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సిస్టమ్ ఇన్‌పుట్స్, సెక్యూరిటీ డేటాను ఏఐతో అనలైజ్ చేసి..ముందుగా అనుమానితుడిని ట్రాక్…

Read More

బుల్లితెరపై కొద్ది నెలల క్రితం నయా ట్రెండ్‌ను క్రియేట్ చేసిన జయమ్ము నిశ్చయమ్మురా.. విత్ జగపతి టాక్ షో రెండో సీజన్ మళ్లీ గ్రాండ్‌గా షురూ కాబోతోంది. ప్రతి ఎపిసోడ్‌లో సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ గురించి, రేర్‌గా బయటకు వచ్చే జ్ఞాపకాలను బయటకు తీస్తూ..ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని పంచడం ఈ షో స్పెషాలిటీ. నాగార్జున, శ్రీలీలతో ముగిసిన ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌లో మాత్రం నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చి రచ్చ లేపడానికి రెడీ అవబోతోంది. హోస్ట్ జగపతిబాబు అడిగే ట్రెండీ అండ్ ఫ్రెండ్లీ క్వశ్చన్స్‌కి సాయి పల్లవి చెప్పే సిన్సియర్ ఆన్సర్స్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటాయని నిర్వాహకులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.ముఖ్యంగా రామాయణ చిత్రంలో సీత రోల్‌ను సాయి పల్లవి పోషిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఆమెపైన ఉండే క్రేజ్.. అమితమైన ప్రేమ మరింతగా పెరిగిపోయాయి. ప్రేక్షకులు మా సీత అని…

Read More

ఆత్మకూరు పట్టణ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సారథ్యంలో అభివృద్ధి చేసిన వాయుపుత్ర మార్గ్ బైపాస్ రహదారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అమరావతి నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వర్చువల్‌గా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రూ.8.91 కోట్లతో నాలుగు వరుసల రహదారి అభివృద్ధి జాతీయ రహదారి-67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు రూ.8.91 కోట్ల వ్యయంతో ఈ రహదారిని అభివృద్ధి చేశారు. గతంలో రెండు వరుసలుగా ఉన్న రహదారిని ఆధునిక సదుపాయాలతో నాలుగు వరుసల రహదారిగా తీర్చిదిద్దారు. రహదారి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయడంతో పాటు సెంట్రల్ లైటింగ్, సుందరీకరణ, మెరుగైన రహదారి సదుపాయాలను కల్పించారు. ఈ అభివృద్ధితో పట్టణంలో రహదారి సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రాకపోకలకు అవకాశం ఏర్పడనుంది. బైపాస్ రహదారి అభివృద్ధిపై…

Read More

ఏపీ పొలిటికల్ కేపిటల్ అని అంతా పిలుచుకునే సాగరతీరం.. విశాఖపట్నం ఇప్పుడు మరోసారి రాజకీయంగా వేడెక్కింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ఎలక్షన్ నగారా మోగడంతో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవడానికి మెయిన్ పార్టీలు పొలిటికల్ స్ట్రాటజీలకు పదును పెడుతున్నాయి. ఈసారి మేయర్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయిస్తూ రిజర్వేషన్ ఫిక్స్ చేయడంతో పోటీ వాతావరణం ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ రెండు పక్షాల అధినేతలు గెలుపు గుర్రాలను పోటీలోకి దించడానికి సామాజిక సమీకరణాలపై బిజీబిజీగా లెక్కలు వేస్తున్నారు. దీంతో విశాఖ టాప్ లీడర్ల సర్కిల్స్‌లోనూ, సోషల్ మీడియా వేదికగానూ మేయర్ అభ్యర్థుల పేర్లు మార్మోగిపోతున్నాయి. అధికార కూటమి వైపు చూస్తే టీడీపీ నుంచి కొన్ని ఊహించని పేర్లు తెరపైకి వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు, విశాఖ ఎంపీ శ్రీభరత్ భార్య నందమూరి తేజస్విని పేరు బలంగా వినిపిస్తుండటం విశేషం. దీంతో పాటు ఏపీ…

Read More

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న జల రవాణా సంబంధాలు మరోసారి ఇప్పుడు అత్యున్నత స్థాయి చర్చలకు వేదికగా మారుతున్నాయి. దీనిలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఈ ప్రత్యేక పర్యటనలో భాగంగా ఈరోజు విజయవాడకు రాబోతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆంధ్రప్రదేశ్‌కు రావడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పర్యటన రెండు రాష్ట్రాల పొలిటికల్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధానంగా తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు చెన్నై తాగునీటి అవసరాల కోసం రిలీజ్ చేయాల్సిన కృష్ణా జలాల వాటా, ప్రస్తుతం నీటి సరఫరాలో ఎదురవుతున్న టెక్నికల్ సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడితో విజయ్ సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు గోదావరి,కృష్ణా, కావేరి నదుల అనుసంధానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జలాశయాల నిర్మాణాలపై ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ భేటీ సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్…

Read More