Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Sunday, November 8
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్‌లో హైలైట్స్
    ఆంధ్ర ప్రదేశ్

    జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్‌లో హైలైట్స్

    LalithaBy Lalitha07/11/2026No Comments2 Mins Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీ వ్యాప్తంగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్ ( Parishad Election Results) పొలిటికల్ వర్గాల్లో ఊహించని స్థాయిలో వేడి పుట్టించింది. ఎక్కడ చూసినా హోరాహోరీ పోరు, ఉత్కంఠ రేపే మలుపులు, కొన్నిచోట్ల కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు తేలడం కనిపించింది. మరికొన్ని ప్రాంతాల్లో రీకౌంటింగ్ రచ్చ, పోలీసులతో తోపులాటల మధ్య పరిషత్ ఫలితాలు సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీశాయి.

    ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు జడ్పీటీసీ స్థానంలో టీడీపీ విజయబావుటా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఇక్కడ ఘన విజయాన్ని సాధించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా పరిటాల అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. ఇక వైఎస్సార్ జిల్లాలో చాలామంది దృష్టిని ఆకర్షించిన వైసీపీ కంచుకోట పులివెందుల జడ్పీటీసీ స్థానంలో.. టీడీపీ అభ్యర్థి ఏకంగా 1,463 ఓట్ల మెజార్టీతో సంచలన విజయాన్ని సాధించడం జగన్ వర్గీయులకు కోలుకోలేని దెబ్బగా మిగిలింది.

    అటు పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి జెడ్పీటీసీ ఎన్నికల లెక్కింపులో పరాకాష్ట స్థాయి ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కొల్లి అరుణ కుమారి కేవలం ఒక్క ఓటు తేడాతోనే విజయం సాధించారు. రిజల్ట్‌పై అనుమానంతో వైసీపీ శ్రేణులు రీకౌంటింగ్ కోరగా, అధికారులు మళ్లీ లెక్కించినా కూడా చివరకు అప్పుడు కూడా అదే ఒక్క ఓటు ఆధిక్యంతో అరుణ కుమారి విజయం ఖరారైంది.

    అలాగే కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మాత్రం ఒకే ఫ్యామిలీలో డబుల్ ధమాకా సీన్ కనిపించింది. ప్రత్తిపాడు-2 నుంచి యాళ్ల జగదీష్ (1,336 మెజారిటీ), ప్రత్తిపాడు-3 నుంచి ఆయన సతీమణి యాళ్ల మంగాదేవి (1,138 మెజారిటీ) ఎంపీటీసీలుగా గెలిచి రికార్డు విజయాన్ని నమోదు చేశారు.

    కృష్ణా జిల్లా గన్నవరం జెడ్పీటీసీ స్థానంలో మాత్రం వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు అనగాని రవి (వైసీపీ) 137 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఈ కౌంటింగ్‌పై అనుమానాలు ఉన్నాయంటూ కూటమి నేతలు రీకౌంటింగ్ కోసం పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అధికారులు ముందస్తుగా తలుపులు మూసివేశారు. అలాగే తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో అవకతవకలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసనకు దిగగా, పోలీసులతో తోపులాట చోటుచేసుకుంది.

    విజయనగరం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్ ( Parishad Election Results)వల్ల బొత్స ఫ్యామిలీలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తెర్లాంలో బొత్స చిన్న శీను కుమార్తె మజ్జి సిరి సహస్ర, గరివిడిలో కోడలు పూజిత ఆధిక్యంలో నిలవగా.. బొండపల్లిలో కుమార్తె అనూష పరాజయం పాలయ్యింది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా క్రిష్ణగిరి జెడ్పీటీసీ స్థానంలో ప్రధాన పార్టీల హేమాహేమీలను తట్టుకుని ఇండిపెండెంట్ కేండిడేట్ శ్రీరాములు అనూహ్య విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

    ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలు
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    ప్రజలకు చంద్రబాబు,రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు

    07/11/2026

    మరణం తర్వాత ఎంపీటీసీగా గెలిచిన జనసేన అభ్యర్థి

    07/11/2026

    పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ధనుష్

    07/11/2026

    రామ్ చరణ్ ఆర్‌సీ 17 రేసులో ఇద్దరు హీరోయిన్స్..

    07/11/2026

    రేపే పరిషత్ ఎన్నికల కౌంటింగ్..మధ్యాహ్నానికి ఎంపీటీసీ, రాత్రికి జడ్పీటీసీ ఫలితాలు

    06/11/2026

    రైతులకు సీఎం చంద్రబాబు భరోసా

    06/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    డోన్'ట్ మిస్

    ప్రజలకు చంద్రబాబు,రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు

    07/11/2026

    దీపావళి పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పెషల్‌గా దీపావళి…

    జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్‌లో హైలైట్స్

    07/11/2026

    మరణం తర్వాత ఎంపీటీసీగా గెలిచిన జనసేన అభ్యర్థి

    07/11/2026

    పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ధనుష్

    07/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    ఔర్ పిక్స్

    ప్రజలకు చంద్రబాబు,రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు

    07/11/2026

    జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజల్ట్‌లో హైలైట్స్

    07/11/2026

    మరణం తర్వాత ఎంపీటీసీగా గెలిచిన జనసేన అభ్యర్థి

    07/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.