పాత తరం జ్ఞాపకాలను తట్టిలేపేలా గోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతోంది. 26 ఏళ్ల తర్వాత ఈ బ్రాండ్ తిరిగి వస్తుండటంతో, ఒకప్పటి ఆరెంజ్ డ్రింక్ లవర్స్ ఆసక్తి పెరిగింది. ఈసారి మారుతున్న టేస్ట్‌కు తగ్గట్టుగా లో షుగర్ లేదా షుగర్ ఫ్రీ వేరియంట్లలో దీన్ని తీసుకురావడానికి కోకా కోలా కసరత్తు చేస్తోంది. అంతేకాదు, గోల్డ్ స్పాట్‌కు విపరీతమైన గుర్తింపు తెచ్చిన ..ది జింగ్ థింగ్ ట్యాగ్‌లైన్‌ను కూడా మళ్లీ వాడాలని భావిస్తోంది. ఈ రీ-లాంచ్ వేళ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతోంది. క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఫోటోను ముద్రించి ఉన్న గోల్డ్ స్పాట్ క్యాన్‌ను ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో గోల్డ్ స్పాట్‌కు ధోనీనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారేమో అనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ధోనీ ఈ బ్రాండ్‌తో యాడ్ అయితే , రీ-ఎంట్రీకి…
Author: Lalitha
ఇండియన్ సినీ హిస్టరీలో రామాయణ: పార్ట్ 1 ఒక రికార్డు వేటతో దూసుకుపోతోంది. మూవీ రిలీజైన 19వ రోజుకే ప్రపంచవ్యాప్తంగా రూ.1,700 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపిస్తోంది. రణ్‌బీర్ కపూర్, యశ్‌ల అద్భుత పెర్ఫార్మెన్స్ ఆడియన్స్‌కు మంచి కిక్ ఇస్తోంది. మూడో వారాంతంలో థియేటర్ల వద్ద మంచి జోరు చూపినా, మూడో సోమవారం కావడంతో కలెక్షన్లలో కొంత స్లోడౌన్ కనిపించింది. ట్రేడ్ లెక్కల ప్రకారం విడుదలైన 19వ రోజున అన్ని లాంగ్వేజ్‌లో కలిపి రూ.12.70 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. నవంబర్ 22వ తేదీ ఆదివారం రూ.35.60 కోట్లు రాబట్టగా, నవంబర్ 22 వ తేదీ సోమవారానికి 64.3 శాతం డ్రాప్ నమోదైంది. అయినా సరే, ఇండియాలో ఇప్పటివరకు రూ.955.45 కోట్ల నెట్ కలెక్షన్లతో వెయ్యి కోట్ల క్లబ్‌కు కేవలం రూ.44.55 కోట్ల దూరంలోనే నిలిచింది. భారత్ గ్రాస్ రూ.1,141.65 కోట్లు కాగా,…
రాజకీయాల్లో అనుభవం లేకపోయినా.. తండ్రి ఇమేజ్ సాయంతో సీఎం అవటమే కాక.. ఐదేళ్ల పాటు వన్ సైడ్ రూలింగ్ చూపించిన వైఎస్ జన్మోహన్ రెడ్డికి అసలైన పరీక్షా కాలం మొదలైనట్లే. జైలు జీవితం, గెలుపు దగ్గరి దాకా వెళ్లి ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న జగన్ కు ఇప్పుడే అసలైన్ టెస్టింగ్ టైమ్. ఈ టెస్టులో పాసవుతాడో.. ఫెయిలవుతాడో అనేది 2029 ఎన్నికల ముందే తెలిసేది. కాని ఇప్పటి నుంచే ఆ ఎన్నికల కోసం ఎత్తులు పై ఎత్తులు మొదలైపోయాయి. జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేసి బలం పెంచుకోవాలని చూస్తుంటే… ఇటు అధికార కూటమి మాత్రం జగన్ కుర్చీ సపోర్టుగా ఉన్నవాటిని ఒక్కొక్కటిగా కూల్చడం మొదలెట్టింది. చివరకు జగన్ ను పడేస్తారా.. లేక జగన్ పుంజుకుని వీరిని పడేస్తారా అనేది మనం 2029 ఎన్నికల తెర మీదే చూడాలి. ఆట అయితే స్టార్ట్ అయింది. కూటమి…
వీడెవడండీ బాబూ అనుకునేలా చేస్తున్నాడు. ఏం జీవితం భయ్యా.. ఇలా అల్లాడిస్తున్నాడేంటి అని షాకయ్యేలా చేస్తున్నాడు. ఓ మై గేమ్ అనుకునేలా చేశాడు త్రిగుణ్ ఇప్పటివరకు. బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి విన్నర్ ఎవరో ఆడియెన్స్ ఫిక్స్ అయిపోయారు. బిగ్ బాస్ ను సైతం ఫిక్స్ చేసినట్లే కనపడుతున్నాడు. ఆట ఎటు నుంచి ఎటు వెళుతుంది.. ఎవరి బటన్ నొక్కితే ఎవరు ఎటు వైపు తిరుగుతారు.. ఈక్వేషన్ ఎలా స్టార్ట్ చేయాలి.. ఎలా ఎండ్ చేయాలి.. చివరకు కావాల్సిన రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలో చేసి మరీ చూపిస్తున్నాడు. బిగ్ బాస్ చూడటం అంటే టైమ్ వేస్ట్ అనుకునేవాళ్లు ఆ ఎపిసోడ్లు చూస్తే ఫిదా అయిపోతారు. నిజంగానే ఇది పర్సనాలిటీ షో విత్ సైకలాజికల్ గేమ్. యాక్చువల్ గా బిగ్ బాస్ వ్యాపారం చేసినా.. ఈ కాన్సెప్ట్ పుట్టింది.. ఏ మనిషి ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అవుతాడు.. గేమ్ కోసం తన…
ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ సెగను రాజేస్తున్నాయి. రెండో విడత నామినేషన్ల స్వీకరణ ఘట్టం కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారుతోంది. మెయిన్‌గా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలో సర్పంచ్ కేండిడేట్స్ నామినేషన్ల వ్యవహారం పెద్ద రాజకీయ వివాదానికి దారి తీసింది. ఆంకాలమ్మగూడూరు సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేయడానికి వైసీపీ అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ అత్యున్నత నాయస్థానం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా, క్షేత్రస్థాయిలో పోలీసులు హైకోర్టు ఆదేశాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేండిడేట్స్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి సెంటర్స్‌కు వెళుతుంటే కొంతమంది కావాలనే అడ్డుకుంటున్నారని, మూడు రోజులుగా నామినేషన్ సెంటర్‌లోకి కూడా వెళ్లకుండా రకరకాల ఆటంకాలను కలిగిస్తున్నారని సర్పంచ్ కేండిడేట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా సరే స్థానిక పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా నామినేషన్ల స్వీకరణలో…
కొన్ని మూవీలు భారీ ట్విస్టులతో ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తాయి. మరికొన్ని మాత్రం సాధారణమైన స్టోరీ లైన్‌తోనే మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తాయి. ఆకాశంలో ఒక తార(Aakasamlo Oka Tara) మూవీ.. రెండో కోవకు చెందినది. ఒక అమ్మాయి ఆకాశాన్ని అందుకోవాలనే కల, ఆ డ్రీమ్‌ను నిజం చేయడానికి ఆమెకు అండగా నిలిచే వ్యక్తి ప్రయాణమే ఈ చిత్రానికి మెయిన్ స్ట్రెంత్. దుల్కర్ సల్మాన్ యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలు మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కృష్ణ (దుల్కర్ సల్మాన్), కల్పన (సాత్విక వీరవల్లి)ని పెళ్లి చేసుకుంటాడు. వివాహం తర్వాత కల్పన ఏజ్ కేవలం 16 సంవత్సరాలని తెలుసుకుని కృష్ణ షాక్ అవుతాడు. చిన్నప్పటి నుంచి చదువుకోవాలని, ఫ్యూచర్‌లో వ్యోమగామి కావాలని కలలు కనే కల్పనకు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అడ్డంకిగా మారతాయి. ఆమె తండ్రి తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేయడంతో ఆమె ఆశలన్నీ ఎగిరిపోతాయి. అయితే కల్పనలోని ప్రతిభను గుర్తించిన కృష్ణ, ఆమె డ్రీమ్‌ను…
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుపాను అక్వాన్ తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 13 కి.మీ. వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం ఇది కళింగపట్నంకు 320 కి.మీ, నరసాపురంకు 390 కి.మీ, గోపాల్‌పూర్‌కు 410 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రారంభంలో నెల్లూరు, తుని మధ్య తీరం దాటుతుందని అంచనా వేసినా కూడా, వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల తన దిశను మార్చుకుంది. రేపు మధ్యాహ్నానికి ఇది ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీరాన్ని దాటే ఛాన్స్ ఉందని అధికారులు స్పష్టం చేశారు.తుపాను తీరం దాటే క్లిష్ట సమయంలో గంటకు 90 – 100 కి.మీ, గరిష్ఠంగా 110 కి.మీ. వేగంతో వీచగల బలమైన ఈదురుగాలులు విరుచుకుపడతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.…
మూవీ లవర్స్‌కు సినిమా చూడటమంటే కేవలం స్క్రీన్ వైపు చూసి అభిమాన నటుల యాక్షన్‌ను చూడటం మాత్రమే కాదు.. అదొక పండుగ వాతావరణం. అలాంటి గ్రాండ్ ఎక్స్‌పీరియన్స్‌ను డబుల్ చేయడానికి హైదరాబాద్ వాసుల కోసం ఏఎంబీ విక్టరీ సినిమాస్ సిద్ధమైంది. సిటీలోని మూవీ గోయర్స్‌ను గూస్‌బంప్స్ తెప్పించడానికి 11 ఏళ్ల తర్వాత ఐమ్యాక్స్ లేజర్ ప్రొజెక్షన్ స్క్రీన్‌ను హైదరాబాద్‌కి రీ-ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి మాస్ అండ్ క్లాస్ హబ్‌లో మహేశ్ బాబు, వెంకటేశ్ ప్రాజెక్ట్‌గా ఈ ఐమ్యాక్స్ రావడం వల్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. అఫీషియల్ వివరాల ప్రకారం ఈ ఐమ్యాక్స్ స్క్రీన్‌ను ప్రారంభించడానికి పక్కా డేట్‌ను లాక్ చేసే పనిలో యాజమాన్యం ఉంది. ప్రస్తుతం లభిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే.. హాలీవుడ్ విజువల్ వండర్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘డ్యూన్: పార్ట్ త్రీ’ (Dune: Part Three) మూవీతో ఈ ఐమ్యాక్స్ లేజర్ స్క్రీన్‌ను గ్రాండ్‌గా…
లవ్‌లో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండటం అవసరం. మరీ ముఖ్యంగా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు కూడా పక్కనే నిలబడి వారికి ధైర్యం చెప్పే వ్యక్తి దొరకడం నిజమైన అదృష్టం.డైరెక్టర్ తరుణ్ భాస్కర్ జీవితంలో ఈషా రెబ్బ అలాంటి తోడుగా నిలిచిందని తరుణ్ భాస్కర్ తల్లి, నటి గీతా భాస్కర్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ప్రేమలో ఉన్నారనే వార్తలు టాలీవుడ్ సర్కిల్‌లో కొంతకాలంగా రౌండ్లు కొడుతున్నాయి. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఈషాతో కలిసి దిగిన ఫోటోను తరుణ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీరిద్దరి ప్రేమ బంధంపై క్లారిటీ వచ్చింది. అతి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, నవంబర్ 19వ తేదీన రిలీజ్ కానున్న ఈ నగరానికి ఏమైంది సీక్వెల్.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తరుణ్ భాస్కర్ తల్లి గీతా…
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతుంటే ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా వింటారో.. చిరు మాటల్లో ఏదైనా కొత్త సినిమా విషయం బయటపడితే అంతకంటే ఎక్కువగా చర్చించుకుంటారు. ఎందుకంటే మెగాస్టార్ సరదాగా చెప్పే చిన్న మాట కూడా కొన్నిసార్లు రాబోయే సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. అలా మరోసారి చిరంజీవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈసారి ఆయన మాటల్లో చిక్కుకున్నది ‘కాకా’ సినిమాలో అనస్వర రాజన్ పోషిస్తున్న పాత్ర కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో ‘కాకా’ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఆడియన్స్‌ను అలరించడంతో..ఇప్పుడు ఈ కొత్త సినిమాపైన కూడా భారీగా అంచనాలు పెరిగాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటి అనస్వర రాజన్ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనుంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉండబోతోందనే విషయంపై ఇప్పటివరకు…