బాక్సాఫీస్ వద్ద తన మార్క్ కామెడీతో ఎప్పుడూ ఆకట్టుకునే యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కళ్యాణ్.. రీసెంట్గా అక్టోబర్ 9వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు మంచి ఫన్ రైడ్‌ను అందించింది. జానకిరామ్ మారెళ్ల డైరెక్షన్లో వచ్చిన ఈ ప్రొజెక్ట్‌లో మహిమా నంబియార్ కథానాయికగా నటించింది. అయితే, థియేట్రికల్ రన్ ఇలా ముగిసిందో లేదో వెంటనే ఈ మూవీ డిజిటల్ లవర్స్ కోసం సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసింది. ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఎలాంటి ముందస్తు ప్రచారం లేదా హడావుడి లేకుండా ఈ మూవీ ఈరోజు నుంచి అంటే అక్టోబర్ 30వ తేదీన స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది. కేవలం తెలుగు లాంగ్వేజ్‌లోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఇది అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్లో రాధికా…
Author: Lalitha
ప్రతిసారీ బంగాళాఖాతంలోనో లేదంటే అరేబియా సముద్రంలోనో కొత్త తుపాను రూపుదిద్దుకోగానే దానికి హుద్ హుద్, అర్నబ్, తేజ్, గతి అంటూ విచిత్రమైన పేర్లు పెట్టడం మనం చూస్తుంటాం. అసలు ఈ పేర్లు ఎవరు పెడతారు.. ఏ ప్రాతిపదికన ఈ నామకరణం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. నిజానికి సముద్రంలో పుట్టే వైపరీత్యాలకు పేర్లు పెట్టే ప్రాసెస్ వెనుక.. ఒక పెద్ద గ్లోబల్ వ్యవస్థ, పక్కాగా రూపొందించిన నిబంధనల లిస్ట్ ఉందనేది ఆసక్తికరమైన నిజం. విపత్తు సమయాల్లో టెక్నికల్ నెంబర్స్ లేదా అక్షాంశ-రేఖాంశాల కొలతల కంటే ఒక కచ్చితమైన పేరు ఉంటే ప్రజలకు అవగాహన కల్పించడానికి రేడియోలు, టీవీల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి ఈజీ అవుతుంది. అందుకే ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) నేతృత్వంలోని 13 దేశాలు కలిసి దీనిని షేర్ చేసుకుంటాయి. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, శ్రీలంక, థాయిలాండ్, సౌదీ అరేబియా,యూఏఈ,పాకిస్తాన్, ఖతార్,…
ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా నివారించడం సాధ్యపడకపోయినా సరే, లేటెస్ట్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ పోతే.. ముందస్తు రక్షణ చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టాలను కనిష్ట స్థాయికి తీసుకురావొచ్చని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అర్నబ్ తుపాను కల్పించిన తీవ్ర ఆందోళనల వల్ల గురువారం ఆయన కృష్ణా, పశ్చిమ గోదావరి,డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలను, భవిష్యత్ కార్యాచరణను సుదీర్ఘంగా వివరించారు. గతంలో వచ్చిన 1977 దివిసీమ ప్రళయంతో పాటు 1996 నాటి కోనసీమ తీవ్ర తుపానుల ఘోరాలను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాటి కఠిన అనుభవాల ఆధారంగా ఈసారి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, అగ్నిమాపక శాఖలను ముందుగానే మోహరించి, అర్ధరాత్రి సమయంలో కూడా యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచామన్నారు. నిమిష నిమిషానికి తుపాను తీవ్రతను అంచనా వేస్తూ.. కింది స్థాయికి సమాచారం చేరవేయడం…
ఏకగ్రీవాలు అయితే ఊరుకునేది లేదు. పోటీ పెట్టకపోతే సంగతి చూస్తా … ఇలా హుంకరింపులు చేస్తే పని అవదని జగన్ కి ఇప్పటికైనా అర్ధమై ఉండాలి. మనం ఎక్కడో ఉండి.. కింద కేడర్‌ను గదమాయిస్తే పనులు అవవనే సంగతి తెలిసొచ్చిందనే అనుకోవాలి. అసలు ఒక్కటి ఏకగ్రీవం అయినా ఊరుకోనన్న నాయకుడు.. ఇన్ని వేల సంఖ్యలో ఏకగ్రీవాలు అవుతుంటే బహుశా షాక్‌కు గురి అయి ఉండాలి. ఎందుకంటే ఓటమి అన్నది ఊహించిన విషయమే అయినా.. ఏకగ్రీవాలు ఈ రేంజ్లో అవడం అస్సలు ఎక్స్ పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. అందులోనూ టీడీపీ వారు కూడా.. చంద్రబాబు కూడా.. తన స్టయిల్ లోనే తనను దెబ్బ కొడతారని కూడా ఊహించి ఉండకపోవచ్చు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం కామన్. కాని ఈ స్థానిక ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఇంకా కోలుకోలేదనే విషయాన్ని మాత్రం స్పష్టంగా బయటపడింది. జగన్ మాట్లాడుతున్న గంభీరంగా పరిస్ధితి కింద లేదనే…
మేమేం తక్కువ తినలేదు.. మేం కూడా వైసీపీ అడుగుజాడల్లోనే నడుస్తామని టీడీపీ చెప్పకనే చెప్పినట్లయింది. ఒకవైపు సీఎం చంద్రబాబు సుభాషితాలు చెబుతూనే ఉన్నారు. మరోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు చేయాల్సింది చేసుకుంటూ పోతున్నారు. చివరకు చంద్రబాబే వారి దారిలోకి వచ్చినట్లున్నారు. గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ వారిని నామినేషన్లు వేయనిచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఏకగ్రీవాల విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు అర్ధమవుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తాలలో ఈ గొడవ లేదు. నామినేషన్లు ఆపినట్లు ఆరోపణలు లేవు. కాని రాయలసీమలో మాత్రం గట్టిగా వచ్చాయి. రాయలసీమలోనే వైసీపీ బలం ఉన్నది. అక్కడ కూడా అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడిపోయినా.. పర్సేంటేజీలు చూస్తే ఇక్కడే ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే రాయలసీమలో దెబ్బ కొడితే.. మళ్లీ కోలుకోకుండా చేయొచ్చనేది టీడీపీ వ్యూహంగా కనపడుతోంది. అందుకే రాయలసీమలో వైసీపీ బలంగా ఉన్న కడప, అనంతపురం, చిత్తూరు తర్వాత కర్నూలులోను గట్టిగా ఫోకస్ చేసింది టీడీపీ. ఏకగ్రీవాలు అయ్యేటట్లు…
విజయవాడలో వెరైటీ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. అక్కడ అంతా ఉత్కంఠభరితంగా ఉందని సోషల్ మీడియాలో వాయించేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్ ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పుకొస్తున్నాయి. అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారనే విషయంలో ఉత్కంఠ ఏమీ లేదు. జనసేన తరపున నిలబడ్డ వంగవీటి రాధా గెలుపు ఖాయమే అని అర్ధమవుతోంది. అయితే ఇండీ కూటమి తరపున నిలబడ్డ ఇండిపెండెంట్ అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీని అభిమానించే కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎన్ని తెచ్చుకోగలడనేదే ఉత్కంఠ అని చెప్పాలి. అవును అది కూడా జరిగే పని కాదనే లాజిక్ వినపడుతోంది. కాని ఏబీ గట్టి పోటీ ఇస్తున్నట్లు.. అసలు మలుపు తిప్పేసినట్లు తెగ చెప్పేస్తున్నారు కొందరు. వాస్తవానికి అలాంటిదేమీ జరిగే ఛాన్స్ కనపడటం లేదు. ఏ లెక్కన చూసినా రాధాదే గెలుపు అంటున్నారు. వైసీపీ పైతం ఏబీ వెంకటేశ్వరరావు గొడవలో పడి.. వారి పని కూడా వదిలేశారు. అభ్యర్ధి విషయంలోనే హ్యాండ్సప్ అయ్యారు..…
ఏపీ పాలిటిక్స్‌లో ఎన్డీఏ కూటమి ఐక్యతపై సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పొత్తు ధర్మాన్ని ఎలాంటి రెండో ఆలోచనలు లేకుండా క్షేత్రస్థాయి వరకు అందరూ పాటించాల్సిందేనని బాబు తేల్చిచెప్పారు. కూటమి అధికారిక కేండిడేట్స్‌కు వ్యతిరేకంగా బరిలోకి దిగిన రెబల్ కేండిడేట్స్‌ను ఎలాంటి ఉపేక్ష లేకుండా వెంటనే పార్టీల నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశాలను జారీ చేశారు. సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తాజా పొలిటికల్ పరిణామాలపై లోతైన చర్చ జరిగింది. ఈ భేటీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఎంతో శ్రమించి సజావుగా సీట్ల సద్దుబాటు ప్రక్రియను పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రజల్లోకి కూటమి ఐక్యతపై ఇప్పటికే సానుకూలంగా బలమైన సందేశం వెళ్తుందన్నారు. కాబట్టి ఓటర్లు వ్యక్తులను కాకుండా ఎన్డీఏ కూటమిని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందించిన సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలని కోరారు.…
అర్నబ్ తుపాను ఏపీపై విరుచుకుపడటంతో.. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలను ఈ తుపాను తీవ్రంగా దెబ్బతీసింది. వర్షాలు, ఈదురుగాలుల ధాటికి విశాఖ, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. తుపాను తీరం దాటే టైమ్‌లో గంటకు దాదాపు 135 కి.మీ వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచడంతో వేలాది విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు కూలిపోయాయి. దీంతో చాలా ప్రాంతాల్లో చీకట్లు అలుముకోగా, రోడ్లపై చెట్లు పడిపోవడంతో చాలా చోట్ల ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ స్తంభించింది. ముఖ్యంగా ఈ తుపాను వల్ల వ్యవసాయ రంగానికి భారీ నష్టం వాటిల్లింది. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో సుమారు 70 వేల హెక్టార్లలో వరి పంటతో పాటు మరో 10 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నీటి పాలవడంతో రైతన్నలు తీవ్ర వేదనకు గురవుతున్నారు. అర్నబ్ తుపాన్ పరిస్థితిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు నిరాశే మిగిలిందని విమర్శించారు. తాజాగా కొన్ని కీలక రాష్ట్రాల్లో నిర్వహించిన శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఈ పరాజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ అసలు ఎన్ని ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించిందో ఒకసారి చూసుకోవాలంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఘాటు కామెంట్లు చేశారు. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి నాలుగు పెద్ద రాష్ట్రాల్లో మొత్తం 28 శాసనమండలి స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఎప్పుడు చూసినా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసే ప్రతిపక్షాలు కోరుకున్నట్లే.. ఈ ఎన్నికలలో పోలింగ్ అంతా పక్కాగా బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జరిగిందని ఆయన…
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల పోరులో రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ తేదీలలో స్వల్ప మార్పులు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను ఫిక్స్ చేసింది. నిజానికి ముందు షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఈ పోలింగ్ ప్రక్రియకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎదురుకావడంతో.. అధికారులు ఈ డేట్స్‌ను ముందుకు జరపాల్సి వచ్చింది. నవంబర్ 3న పట్టణ స్థానిక సంస్థలు లేదా మున్సిపల్ ఎన్నికల లెక్కింపు అలాగే రిజల్డ్ వెల్లడి ప్రక్రియ భారీ స్థాయిలో జరగనుంది. ఆ రోజు పాలనా యంత్రాంగం మొత్తం కౌంటింగ్ పనుల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి…భద్రతా కారణాలు అలాగే పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. తాజాగా రిలీజ్ చేసిన రీషెడ్యూల్ ప్రకారం నవంబర్ 5న ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ , జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఒకవేళ ఏవైనా నియోజకవర్గాల్లో లేదా నిర్దిష్ట…