Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Friday, November 6
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»ఒంగోలు రాజకీయాల్లో వైసీపీ ఉనికెక్కడ?
    ఆంధ్ర ప్రదేశ్

    ఒంగోలు రాజకీయాల్లో వైసీపీ ఉనికెక్కడ?

    LalithaBy Lalitha06/11/2026Updated:06/11/2026No Comments2 Mins Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    ఒంగోలు వైసీపీ రాజకీయ పరిస్థితిపై చర్చ
    ఒంగోలు మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ రాజకీయ భవిష్యత్తుపై చర్చ.
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    పాలిటిక్స్‌లో ఎన్నికల సమయంలో కొన్ని పరాజయాలు ప్రత్యర్థి పరాక్రమాన్ని చాటి చెబితే, మరికొన్ని సొంత పార్టీలో అంతవరకూ దాగి ఉన్న అంతర్గత బలహీనతలను బట్టబయలు చేస్తాయి. ఇంకొన్ని మాత్రం పార్టీ మనుగడకు నాయకత్వం ఎంత కీలకం అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టి చెబుతాయి.

    ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రస్తుతం వైసీపీ పరిస్థితిని గమనిస్తే సరిగ్గా మూడో కోవకు చెందిన రాజకీయ దృశ్యమే ఇప్పుడు అందరి కళ్లముందు కదులుతుంది. క్షేత్రస్థాయిలో అక్కడి ప్రజల్లో తమ పార్టీకి ఇంకా బలమైన ఆదరణ ఉందని నాయకులు గొంతు చించుకుని మరీ చెబుతున్నారు. కార్యకర్తలు కూడా పార్టీ కోసం కష్టపడుతున్నామని గుండెలు బాదుకుంటున్నారు. కానీ, బ్యాలెట్ బాక్సులు తెరిచేసరికి మాత్రం ఫలితాల లెక్కలన్నీ తారుమారైపోతున్నాయి. మరి ఇక్కడ అసలు సమస్య ప్రజల్లో ఉందా? లేక చెమటోడ్చి పనిచేసే కార్యకర్తల్లోనే ఉందా? లేక పార్టీని ముందుండి నడిపించాల్సిన నాయకత్వ తీరులోనే మొత్తం లోపం ఉందా? అన్న ప్రశ్నలు రిపీటెడ్‌గా వినిపిస్తున్నాయి.

    ఒంగోలు పొలిటికల్ కాన్సీక్వెన్స్ ఇప్పుడు వైసీపీ అధిష్టానానికి కొన్ని కఠినమైన, అంతే వేడితో కూడిన ప్రశ్నలను సంధిస్తున్నాయి. ప్రజాభిమానం మెండుగా ఉందని గప్పాలు కొట్టుకోవడం కాదు, ఆ అభిమానాన్ని పోలింగ్ బూత్ వద్ద ఓట్లుగా మార్చుకోవడం కావాలి. కానీ ఇక్కడ ఈ రెండింటి మధ్య కొండంత దూరం ఉంటోంది. ఆ అంతరాన్ని పూడ్చుకోలేకపోతే మాత్రం ఎన్ని లక్షల మంది అభిమానులు వెనుక ఉన్నా రాజకీయాల్లో ప్రయోజనం మాత్రం శూన్యం.

    ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వైసీపీ పెద్దలకు ఒక పొలిటికల్ పాఠంలా మారాయి. మొత్తం 62 డివిజన్లు ఉన్న ఈ నగరపాలక సంస్థలో 3 స్థానాలు అధికార టీడీపీకి ఏకగ్రీవం కాగా, మిగిలిన 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో టీడీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోగా, వైసీపీ కేవలం 11 డివిజన్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.

    తమకు ప్రజల్లో తిరుగులేని ఆదరణ ఉందని చెప్పుకుంటున్న ఈ పార్టీ, ఆ ప్రజాదరణను ఓట్ల రూపంలో ఒడిసిపట్టుకోవడంలో ఘోరంగా ఫెయిలయింది. దీనికి తోడు ఒంగోలు రాజకీయం అనగానే గుర్తుకొచ్చే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేన గూటికి చేరిన తర్వాత అక్కడ ఈక్వేషన్స్ పూర్తిగా తలకిందులయ్యాయి. ఒక బలమైన స్థానిక నేత వెళ్లడం అంటే అతని పాత నెట్‌వర్క్, అనుచరగణం కూడా వెళ్లిపోతుంది. ఆ పెద్ద రాజకీయ శూన్యతను భర్తీ చేయడం ఎలాంటి పెద్ద పార్టీకైనా కత్తిమీద సామే. కేవలం ఒకరి కుర్చీలో మరొకరిని కూర్చోబెట్టేసినంత మాత్రాన ఆ నాయకుడికున్న కరిష్మా, జనబలం ట్రాన్స్‌ఫర్ అయిపోవు.

    అంతేకాదు ఇప్పుడు ఒంగోలు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్న చుండూరి రవిని వచ్చే సార్వత్రిక ఎన్నికల అభ్యర్థిగా ఇప్పటి నుంచే సంకేతాలు ఇవ్వడంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందరినీ కలుపుకొని వెళ్లడంలో రవి విఫలమవుతున్నారనే విమర్శలు సొంత కేడర్‌ నుంచే వినిపిస్తున్నాయి. కేవలం పార్టీ అధినేత ఆశీస్సులుంటే సరిపోదు, కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా ఆ లీడర్‌షిప్‌ను అంగీకరించాలి. అలాగే కేవలం పైస్థాయి పరిచయాలు, సామాజిక ఈక్వేషన్స్ లెక్కలతో టికెట్లు పంపిణీ చేస్తే క్షేత్రస్థాయిలో రిజల్ట్ ఎలా ఉంటాయో మొన్నటి ఫలితాలే నిదర్శనం.

    మరోవైపు, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై అక్కడి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడంలో కూడా వైసీపీ దారుణంగా ఫెయిల్ అయింది. ఇక 2025 ఫిబ్రవరిలో ఏకంగా 20 మంది కార్పొరేటర్లు జనసేన జెండా పట్టుకోవడం కూడా ఒంగోలులో వైసీపీ బలహీనతను ఎత్తిచూపింది.టోటల్‌గా ఒంగోలు రాజకీయం వైసీపీ అధినేత జగన్‌కు ఇదొక పెద్ద హెచ్చరిక వంటిదే అన్న విశ్లేషణలు తెరమీదకు వస్తున్నాయి.

    ఆంధ్రప్రదేశ్ వైసీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    రేపే పరిషత్ ఎన్నికల కౌంటింగ్..మధ్యాహ్నానికి ఎంపీటీసీ, రాత్రికి జడ్పీటీసీ ఫలితాలు

    06/11/2026

    రైతులకు సీఎం చంద్రబాబు భరోసా

    06/11/2026

    చీరాల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం.. కాంగ్రెస్ బోణీ

    06/11/2026

    సంక్రాంతి రేసులోనే మెగాస్టార్ కాకా

    06/11/2026

    ఆ ఇద్దరి హీరోలతో అందుకే నటించలేకపోయా: ఖుష్బూ

    06/11/2026

    7 కేంద్రాల్లో రీపోలింగ్.. 6 జిల్లాల్లో ఓటింగ్..

    06/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    డోన్'ట్ మిస్

    రేపే పరిషత్ ఎన్నికల కౌంటింగ్..మధ్యాహ్నానికి ఎంపీటీసీ, రాత్రికి జడ్పీటీసీ ఫలితాలు

    06/11/2026

    ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన స్థానిక పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అన్ని ఏర్పాట్లను…

    రైతులకు సీఎం చంద్రబాబు భరోసా

    06/11/2026

    చీరాల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం.. కాంగ్రెస్ బోణీ

    06/11/2026

    సంక్రాంతి రేసులోనే మెగాస్టార్ కాకా

    06/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026419 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    ఔర్ పిక్స్

    రేపే పరిషత్ ఎన్నికల కౌంటింగ్..మధ్యాహ్నానికి ఎంపీటీసీ, రాత్రికి జడ్పీటీసీ ఫలితాలు

    06/11/2026

    రైతులకు సీఎం చంద్రబాబు భరోసా

    06/11/2026

    చీరాల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం.. కాంగ్రెస్ బోణీ

    06/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.