మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ రిలీజ్ డేట్‌కు సంబంధించి కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందంటూ రూమర్స్ స్ప్రెడ్ అవడంతో.. మెగా అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే, ఈ నిరాధారమైన వదంతులకు రచయిత కోన వెంకట్ తనదైన శైలిలో చురకలు వేస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ కోన వెంకట్ సోషల్ మీడియా వేదికగా ఒక ఘాటైన ప్రకటనను రిలీజ్ చేశారు. మూవీపై వస్తున్న అన్ని రూమర్లకు ఇక్కడితో సెలవు. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నామని ఆశపడే వారిని ఇప్పుడు నిరాశపరుస్తున్నందుకు క్షమించాలి. మేము పక్కా ప్లానింగ్‌తో జనవరి 13వ తేదీన థియేటర్లలో ల్యాండ్ అవుతున్నాం. ఈ సంక్రాంతి పండుక్కి ‘కాకా’ రాకతో అసలైన జాతర మొదలవుతుందంటూ కావాల్సినంత క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మూవీ పోస్ట్ పోన్ అవుతుందని వస్తున్న అన్ని అనుమానాలు ఒక్కసారిగా పటాపంచలయ్యాయి.
మాస్ డైరెక్టర్ బాబీ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో అనశ్వర రాజన్, నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ మూవీన ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో మూవీ యూనిట్ ఒకే సమయంలో షూటింగ్, డబ్బింగ్ పనులను చాలా ఫాస్ట్‌గా పూర్తి చేస్తోంది. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక మేకింగ్ వీడియోను కూడా మేకర్స్ పంచుకున్నారు.
మరోవైపు, రాబోయే సంక్రాంతి రేసు బాక్సాఫీస్ వద్ద అత్యంత పోటీగా మారబోతోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న సినిమా జనవరి 12న రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. దీనికి తోడు రజినీకాంత్ ‘ధర్మన్’ మూవీ కూడా పండుగ బరిలోనే ఉంది. ఈ విధమైన భారీ పోటీ ఉన్నా కూడా మెగాస్టార్ చిరంజీవి జనవరి 13నే వస్తున్నారనే విషయాన్ని టీమ్ కన్ఫమ్ చేయడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణం అప్పుడే వేడెక్కింది.
