ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్ హీట్ తారాస్థాయికి చేరింది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక మున్సిపాలిటీలతో పాటు మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో నవంబర్ 1వ తేదీన జరగనున్న పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
ఈరోజు మార్నింగ్ నుంచే నిర్దేశిత డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు.. అవసరమైన ఎలక్షన్ సామగ్రిని అందజేస్తున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పక్కా ప్లాన్‌ను రూపొందించారు. కాగా రేపు పోలింగ్ ముగిసిన తర్వాత నవంబర్ 2వ తేదీన అవసరమైన చోట రీ-పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 3వ తేదీన ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలను రిలీజ్ చేయనున్నారు.
ఈ దఫా మున్సిపల్ పోరులో మొత్తం 6,669 మంది కేండిడేట్స్ తమ లక్‌ను పరీక్షించుకుంటున్నారు. వీరి కోసం ఏపీ వ్యాప్తంగా 4వేల372 పోలింగ్ కేంద్రాలను రెడీ చేశారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటానికి 36వేల351 మంది పోలీసు బలగాలతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా 671 సెంటర్స్‌ను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 1,233 సెంటర్లను సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా కంటిన్యూగా నిఘా ఉంచడంతో పాటు అదనపు పోలీసు బలగాలను మోహరిస్తున్నారు.
మరోవైపు ఏపీలో ఎన్నికల ప్రాసెస్‌ను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయడమే టార్గెట్ అని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసినా, లేదా గొడవలు క్రియేట్ చేయడానకి ప్రయత్నించినా ఎవరినీ విడిచిపెట్టబోమని, కఠిన చట్టపరమైన చర్యలు తప్పవంటూ డీజీపీ వార్నింగ్ ఇచ్చారు.
