ఏపీలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఘట్టం ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాఖలైన నామినేషన్ల స్క్రూటినీని పూర్తి చేసిన అధికారులు, సరైన పేపర్స్ సబ్మిట్ చేసిన కేండిడేట్స్ తుది వివరాలను వెల్లడించారు. 28 జిల్లాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన పరిశీలన తర్వాత స్థానిక సంస్థల సమరంలో ఏ పార్టీ నుంచి ఎంతమంది రేసులో ఉన్నారో అనే దానిపై క్లారిటీ వచ్చింది. మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాల కోసం వచ్చిన 51వేల902 నామినేషన్లలో 46వేల045 కేండిడేట్స్ అప్లికేషన్లు నిబంధనలకు కట్టుబడి ఉన్నట్లు తేలింది. టెక్నికల్ రీజన్స్ వల్ల 5వేల857 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఎంపీటీసీ బరిలో టీడీపీ తరఫున 19వేల 760 మంది, వైసీపీ నుంచి 17వేల726 మంది, జనసేన నుంచి 4వేల330 మంది, బీజేపీ నుంచి 1 ,049 మంది కేండిడేట్స్ నిలిచారు. వీరితో పాటు 2,012 మంది ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నారు. మరోవైపు…
Author: Sai Durga
ఎలక్షన్స్ టైమ్‌లో సొంత పార్టీ నేతలే తలనొప్పిగా మారితే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలనే విషయంలో టీడీపీ చాలా క్లారిటీగా ఉందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ కూటమి పొత్తులను కూడా లెక్కచేయకుండా సొంత గూటిలోనే కుమ్ములాటలకు తెరలేపిన ఏడుమందిని టీడీపీ వేటు వేసింది. పార్టీ నిర్ణయాలను ధిక్కరించి రెబల్స్‌గా పోటీకి దిగిన వారితో పాటు వారికి వెనుక ఉండి నడిపిస్తున్న వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని ఈ సస్పెన్షన్ ద్వారా హైకమాండ్ అందరికీ మెసేజ్ పంపింది. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడిగానే బరిలోకి దిగుతున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని డివిజన్లను మిత్రపక్షాలకు కేటాయించడం కామన్. అయితే ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న లోకల్ లీడర్స్‌కు కొన్ని చోట్ల సీట్లు దక్కకపోవడంతో అసంతృప్తి వెళ్లగక్కింది. అధిష్ఠానం బుజ్జగింపులను కూడా లెక్కచేయకుండా బరిలో నిలిచిన కాకొల్లు మహేంద్రనాథ్ (బాబీ), కొమ్మినేని సురేశ్, మాదాల…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు లోకల్ పోరు రచ్చ రంబోలాగా మారింది. నిన్నటి వరకూ సోషల్ మీడియాకే పరిమితమైన పొలిటికల్ హీట్, ఇప్పుడు నామినేషన్ల రూపంలో సునామీలా విరుచుకుపడింది. ఏపీ వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు పోటెత్తారు. రికార్డు స్థాయిలో దాఖలైన ఈ నామినేషన్ల లెక్కలను చూస్తుంటే, ఏపీలో గ్రౌండ్ లెవెల్ హీట్ ఏ స్థాయిలో అర్థమైపోతోంది. ఏపీలోని 28 జిల్లాల పరిధిలో ఉన్న 9వేల829 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఏకంగా 51వేల902 నామినేషన్లు పోలవ్వడం సాధారణ విషయం కాదు. ఇక 659 జెడ్పీటీసీ స్థానాల కోసం 5,724 మంది పోటీలోకి దిగి తమ లక్‌ను పరీక్షించుకోవడానికి సై అంటున్నారు. ఇక నామినేషన్ల చివరి రోజైతే ఏకంగా 3,315 జెడ్పీటీసీ, 25,016 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు క్యూ కట్టి మరీ పత్రాలు సమర్పించారు. ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థులు ఏకంగా 22వేల13 నామినేషన్లు వేయగా, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్…
భారతీయ సినిమా రేంజ్‌ను మరో మెట్టు ఎక్కించడానికి డార్లింగ్ ప్రభాస్ సరికొత్త పీరియాడిక్ వార్ యాక్షన్ విజువల్ ఫీస్ట్‌తో వస్తున్నారు . హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రెస్టీజియస్ మూవీ ‘ఫైల్ నెం.25 : ఫౌజీ’ నుంచి ఒరిజినల్ గ్లింప్స్ తాజాగా రిలీజ్ కాగా, అందులోని గ్రాండియర్ చూసి మూవీ లవర్స్ ఫిదా అయిపోతున్నారు. రెండు శతాబ్దాల నాటి భారత స్వాతంత్య్ర పోరాట పరిస్థితులను చాలా నేచురల్‌గా, కళ్లు చెదిరే విజువల్స్‌తో పిక్చరైజ్ చేసిన తీరు సోషల్ మీడియాలో మైండ్ బ్లాకింగ్ వ్యూస్‌ను సాధిస్తోంది. ఈ గ్లింప్స్‌లో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి స్టోరీ లైన్‌ను ఎంచుకోవడం మెయిన్ ప్లస్ పాయింట్ అయింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ ఫేస్ టు ఫేస్ మాట్లాడే సీన్ ..స్టోరీలోని తీవ్రతను ఎలివేట్ చేసింది. భారత దేశంపై హిట్లర్ చేసిన కామెంట్లకు నేతాజీ ఇచ్చిన కౌంటర్ సీన్ థియేటర్లలో విజిల్స్ వేయించేలా…
కడప రాజకీయం అంటేనే ఒక రేంజ్లో పొలిటికల్ హీట్ ఉంటుంది. ఇక లోకల్ బాడీ ఎన్నికల నామినేషన్ల రచ్చ మొదలయ్యాక పులివెందులలో ఆ కాక మరింత పెరిగింది. ప్రశాంతంగా సాగాల్సిన నామినేషన్ల ప్రాసెస్ కాస్తా ఉద్రిక్తతల మధ్య సాగుతుండటంతో, లా అండ్ ఆర్డర్ కాపాడాలనే ప్లాన్‌తో ఖాకీలు రంగంలోకి దిగారు. దీనిలో భాగంగా పులివెందుల అర్బన్ సీఐ ఏకంగా.. కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి నివాసానికి వెళ్లి అఫీషియల్‌గా నోటీసులు చేతిలో పెట్టడం ఇప్పుడు టోటల్ డిస్ట్రిక్ట్‌లో సంచలనంగా మారింది. ఎలక్షన్ సమయంలో ఎవరూ పరిమితులు దాటకుండా ఉండటానికి బీఎన్ఎస్ సెక్షన్ 163, అలానే పోలీస్ యాక్ట్ సెక్షన్ 30ని పట్టణమంతా కూడా అప్లై చేస్తున్నట్లు ఆ నోటీసులో స్పష్టం చేశారు. ఈ రూల్స్ ప్రకారం ఎన్నికల సమయంలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా వీధుల్లోకి వచ్చి ర్యాలీలు చేసినా, మైకులు పెట్టి సభలు నిర్వహించినా చూస్తూ ఊరుకోమని పోలీసులు…
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఫ్యామిలీలో సాగుతున్న రచ్చ ఇప్పుడు పోలీసు కేసులతో మరోసారి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆయన కోడలు మేఘన, ఆమె తండ్రి కృష్ణ కలిసి ప్రయాణిస్తున్న కారును ఇటీవల ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఇది కేవలం అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదని, తమ ప్రాణాలను తీయడానికి జోగి రమేశ్ ప్లాన్ చేసిన కుట్ర అయి ఉండొచ్చని అనుమానిస్తూ మేఘన తండ్రి కృష్ణ పోలీసులను ఆశ్రయించడమే ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్టోబర్ 15వ తేదీన విజయవాడ నుంచి తెలంగాణలోని కోదాడకు మేఘన, ఆమె తండ్రి కారులో బయలుదేరారు. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వీరి కారును బలంగా ఢీకొట్టడంతో కారు పాక్షికంగా దెబ్బతింది. అయితే ఇది సాధారణ ప్రమాదం లాగా కనిపిస్తున్నా కూడా…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు . తన పర్సనల్ లైఫ్‌ను ఎప్పుడూ చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేసే తేజ.. త్వరలోనే పెళ్లి పీటలెక్కిబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. నవంబర్‌లో ఎంగేజ్మెంట్ జరగనుండగా, డిసెంబర్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి (Arranged Marriage) అని, తన తల్లిదండ్రులే సంబంధం ఖరారు చేశారని తేజ తెలిపాడు. ఎప్పుడూ సింప్లిసిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చే తేజ.. ఈ వేడుకను కూడా చాలా సింపుల్‌గా, కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్యే నిర్వహించనున్నాడు.అయితే ఉదయ్‌పూర్‌లో పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాడు. తనకు కాబోయే భార్యకు సినీ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని, ఆమె టెక్నాలజీ సెక్టార్లో ఉంటూ తండ్రితో కలిసి వర్క్ చేస్తోందని తేజ వెల్లడించాడు. అమెరికాలో పెరిగిన ఆమెకు గ్లామర్ వరల్డ్ గురించి…
ఏపీలోని కడప జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా వాతావరణం రోజురోజుకు హీటెక్కుతుంది. స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతున్న కీలక సమయంలో, వైసీపీ (YSRCP) ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు కొంతమంది ఆ పార్టీ అగ్రనేతలను పోలీసులు తమ అదుపులోకి తీసుకోవడం ఏపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కడప నగరంలోని వైసీపీ జిల్లా ఆఫీసు వద్ద ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మేయర్ పాకా సురేశ్‌ను పోలీసులు అకస్మాత్తుగా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని భారీ భద్రత మధ్య పులివెందులకు తీసుకువెళ్లి, అవినాష్‌రెడ్డిని ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. అక్టోబర్ 21 వ తేదీ బుధవారం నామినేషన్లు వేసే సమయంలో చోటు చేసుకున్న దాడి ఘటనలతో కడప పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లా అండ్ ఆర్డర్‌ను…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు అంటే అక్టోబర్ 22న అస్వస్థతకు గురి కావడం పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబసభ్యులు వెంటనే కాకినాడలోని ఫేమస్ ట్రస్ట్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. యనమల అనారోగ్యం పాలయ్యారనే న్యూస్ తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. యనమల కుటుంబసభ్యులతో పాటు ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లతో ఫోన్లో మాట్లాడి,ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు మాజీ మంత్రి యనమల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ, ఎప్పటికప్పుడు తనకు అప్డేట్స్ ఇవ్వాలని పార్టీ ముఖ్య నేతలను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ ఎంపీ సానా సతీశ్ కాకినాడలోని ఆస్పత్రికి చేరుకున్నారు.అక్కడ యనమల ఆరోగ్య పరిస్థితిని, వైద్యులు అందిస్తున్న ట్రీట్మెంట్ను…
ఏపీ రాజకీయాలలో ఊహించని, అత్యంత ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. అధికారిక హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉండటానికి ఎప్పుడూ ప్రాధాన్యమిచ్చే ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరోసారి తన మార్కు సింప్లిసిటీని చూపిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రొటోకాల్ ప్రకారం తన వెంట రావాల్సిన సైరన్ల కాన్వాయ్‌ను, కట్టుదిట్టమైన పోలీసు భద్రతను, సిబ్బందిని పూర్తిగా పక్కన పెట్టేసి, అత్యంత సాధారణ వ్యక్తిలా డైరెక్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే.. పవన్ ఇలా వెళ్లి సీఎంను కలవడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయలేకపోయిన కేండిడేట్స్ నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి.. వారికి మరొక 48 గంటల సమయమిచ్చే అంశాన్ని రివ్యూ చేయాలని ఏపీ ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) సుప్రీంకోర్టు సూచించింది. కాగా…