కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన జ్ఞాపకాలతో రాసిన బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్.. పుస్తకం ద్వారా గాంధీ కుటుంబంలో జరిగిన కొన్ని దిగ్భ్రాంతికరమైన విధి విలాసాలను పంచుకున్నారు. నవంబర్ 10వ తేదీన రిలీజైన బిలాంగింగ్ పుస్తకంలో 1970ల నాటి విల్లింగ్డన్ క్రెసెంట్ నివాసంలో.. జరిగిన ఒక విచిత్ర సంఘటనను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఆ సమయంలో రాజీవ్ గాంధీ పైలట్‌గా వ్యవహరిస్తూ పాలిటిక్స్‌కు దూరంగా ఉండగా, సంజయ్ గాంధీ ప్రధాన నాయకుడిగా ఉండేవారు. అయితే ఒక హస్త సాముద్రికుడు వచ్చి సంజయ్ కాకుండా రాజీవ్ గాంధీనే దేశ ప్రధానమంత్రి అవుతారని గట్టిగా చెప్పినట్టు సోనియా వివరించారు.
ఆ తర్వాత 1980లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో కన్నుమూయడం, 1984లో ఇందిరా గాంధీ దారుణ హత్యకు గురికావడం వరుసగా జరిగాయి. ఆ విషాదాల వెంట వెంటనే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించక తప్పలేదు. రాజీవ్ రాజకీయాల్లోకి రావొద్దని తాను ఎంతగానో వేడుకున్నా కూడా.. బాధ్యతల స్వీకరణ సమయంలో తనను ఎలాగూ చంపేస్తారని రాజీవ్ తనతో అన్న మాటలు సోనియా గాంధీని ఆందోళనకు గురి చేసాయి.
అలాగే 1985లో రాజీవ్ పుట్టినరోజు నాడే పంజాబ్ అకాలీ నేత హర్చంద్ సింగ్ లాంగోవాల్ హత్యకు.. గురి కావడం ఒక అపశకునంగా అనిపించిందని సోనియా గాంధీ రాశారు. 1990లో 10 జన్‌పథ్ నివాసానికి మారే టైమ్‌లో అది అచ్చిరాదని కొందరు హెచ్చరించినా, మూఢనమ్మకాలపై విశ్వాసం లేకపోవడంతో అక్కడికే వెళ్లామని వివరించారు.
కానీ జన్‌పథ్ నివాసానికి మారిన కేవలం 15 నెలల వ్యవధిలోనే 1991 మేలో రాజీవ్ గాంధీ దారుణంగా హత్యకు గురయ్యారు. ఒక జ్యోతిష్యుడి మాటల నుంచి మొదలైన ఈ వరుస పరిణామాలు ..తమ లైఫ్‌లో ఎలాంటి తీరని విషాదాన్ని నింపాయో సోనియా గాంధీ ఈ బిలాంగింగ్ పుస్తకంలో ఎంతో భావోద్వేగంతో ఆవిష్కరించారు.
