రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్షన్స్ హను రాఘవపూడి కాంబినేషన్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో తెరకెక్కుతున్న ఫౌజీ మూవీ చుట్టూ ఊహించని వివాదం నెలకొంది. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోల్‌ను చూపించిన విధానంపై ఆయన మనవడు చంద్ర కుమార్ బోస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చారిత్రక దిగ్గజాలను ఫిక్సన్ స్టోరీలతో ముడిపెట్టేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాయిని తగ్గించేలా ఉన్న సీన్స్‌పై మూవీ యూనిట్ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వివాదంపై మూవీ యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన డైరెక్టుగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. టీజర్లో నేతాజీని హిట్లర్‌తో మాట్లాడుతున్నట్లు చూపిస్తూ ఫిక్షనల్ క్యారెక్టర్స్‌ను ఇంట్రడ్యూస్ చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఇలాంటి కాంట్రవర్శీ కంటెంట్‌కు సెన్సార్ పర్మిషన్ ఎలా లభించిందో విచారణ జరిపించాలని,…
Author: Lalitha
ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నయా బెదిరింపు పాలిటిక్స్‌కు తెరలేపడంపై కూటమి ప్రభుత్వం ఫైర్ అయింది. మళ్లీ తమ హవా స్టార్ట్ అయితే ‘2.O’ పాలన ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని వైసీపీ నేతలు చేస్తున్న హెచ్చరికలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఎవరు ఏ స్థాయి బెదిరింపులకు దిగినా తమ కూటమి ప్రభుత్వం దానికి 10X అంటే పదింతల రేంజ్లో తిప్పికొడుతుందని పవన్ తేల్చిచెప్పారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర సారథి పీవీఎన్ మాధవ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ కామెంట్లు చేశారు. గతంలో వైసీపీ 1.O వెర్షన్ హయాంలో జరిగిన భయాందోళనలను, హింసాత్మక రాజకీయాన్ని క్షేత్రస్థాయిలో గుండె నిబ్బరంతో ఎదుర్కొన్న హిస్టరీ తమకు ఉందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులను అయినా తట్టుకుని, ప్రజల పక్షాన నిలబడి రక్షణగా ఉండే పక్కా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో డెవలప్మెంట్ పనులు వేగంగా ముందుకు సాగుతుంటే ఓర్వలేక వైఎస్సార్సీపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికలు జరగకూడదనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీ అలజడులు సృష్టిస్తూ అబద్ధపు ప్రచారాలకు తెగబడుతోందని వారు విమర్శించారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక్కడ తన కార్యకర్తలతో అలజడులు, గొడవలు సృష్టించి, తాను మాత్రం హాయిగా బెంగళూరు వెళ్లి కూర్చోవడం జగన్‌కు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. గతంలో తాను తీవ్రవాదులకు కూడా ఇలాగే హెచ్చరికలు చేశానని గుర్తుచేసిన చంద్రబాబు.. హింసను…
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుపాను తీరం వైపు అత్యంత స్పీడ్‌గా దూసుకొస్తూ ఏపీ వాసులను భయాందోళనకు గురి చేస్తోంది. కొన్ని గంటలుగా ఇది గంటకు 20 కి.మీ వేగంతో పశ్చిమ, వాయవ్య దిశగా ప్రయాణం చేస్తూ తీవ్రతను మరింత పెంచుకుంటోంది. అక్టోబర్ 27వ తేదీన ఉదయానికి విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 220 కి.మీటర్లు, కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 240 కి.మీటర్లు, మచిలీపట్నానికి 340 కి.మీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఈ తుపాను క్రమంగా వాయవ్య దిశగా పయనించి అక్టోబర్ 28వ తేదీ, 2026 ఉదయానికి బాపట్ల – విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరాన్ని దాటనుందని వాతావరణ శాఖ అధికారులు అధికారికంగా ధ్రువీకరించింది. తీరం దాటే క్లిష్ట సమయంలో అర్నాబ్ అత్యంత బలమైన పెను తుపానుగా మారి చెంది గంటకు 125 నుంచి 135 కి.మీటర్ల వేగంతో, గరిష్టంగా 150 కి.మీటర్ల భయానక వేగంతో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉంది.…
ఆంధ్రప్రదేశ్‌ను ‘అర్నబ్’ తుపాను భయం గడగడలాడిస్తోంది. బంగాళాఖాతంలో తీవ్రరూపం దాలుస్తున్న ఈ భీకర తుపాను ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందోనని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడటమే టార్గెట్‌గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు.. తన క్యాంపు ఆఫీసు నుంచి అధికారులతో గంట గంటకూ వర్చువల్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు కీలక మార్గదర్శకాలను జారీ చేస్తున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) చెప్పిన సమాచారం ప్రకారం.. అర్నబ్ తుపాను రాబోయే 24 గంటల్లో మరిన్ని రెట్లు బలపడి, ఈ నెల 28వ తేదీన బాపట్ల , విశాఖపట్నం మధ్య ఉన్న యానాం సమీపంలో తీరాన్ని దాటే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీని ప్రభావంతో ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరుతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని అధికారులు…
టాలీవుడ్లో మోస్ట్ లవబుల్ కపుల్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేర్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతగా అలరించిందో, ఆఫ్-స్క్రీన్ రిలేషన్షిప్ పైన కూడా ఇండస్ట్రీలో ఏదోవిధంగా రకరకాల చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఇటీవలే కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న ఈ జంట తమ పర్సనల్ విషయాలును లవ్ జర్నీ గురించి కొన్నిఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నారు. అయితే ఆ షోకి సంబంధించిన చిన్న క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ .. నెటిజన్లు రకరకాలుగా విమర్శలు గుప్పించడం స్టార్ట్ చేశారు. ఈ ట్రోలింగ్‌పై తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రియాక్ట్ అయి అలాంటివారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టడానికి.. విజయ్ దేవరకొండ రష్మికతో కలిసి ఉన్న ఒక అందమైన వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. నా ప్రాణ స్నేహితురాలు, నా వైఫ్, నా లవర్.…
ఏపీ పాలిటిక్స్‌లో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో కేవలం 11 స్థానాలకే పరిమితమైన ఆ పార్టీకి, ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కలిసొస్తాయనుకుంటే అవి మరింత గట్టి దెబ్బ కొడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకా అయిన కడప జిల్లాతో పాటు పులివెందులలో అధికార కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎన్నో ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబానికి తిరుగులేని కోటగా పేరుబడ్డ పులివెందుల మున్సిపాలిటీలో.. తెలుగు దేశం పార్టీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కడ ఉన్న మొత్తం 40 మున్సిపల్ వార్డుల్లో ఏకంగా 20 స్థానాలను ఏకగ్రీవంగా తన అకౌంట్లో వేసుకుని వైసీపీ నేతలను అవాక్కయ్యేలా చేసింది. మిగిలిన 20 వార్డులతో పాటు చైర్పర్సన్ పీఠానికి ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఈ ఏకగ్రీవాల సరళి అక్కడి పొలిటికల్ ఈక్వేషన్స్‌ను పూర్తిగా మార్చేసింది. ఇక్కడ మాత్రమే కాదు..…
తమిళ చిత్రసీమ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే తారల లిస్ట్‌లోకి మరో స్టార్ హీరో చేరబోతున్నారనే వార్తలు కొన్నాళ్లుగా కోలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి.ఇలా వర్సటైల్ యాక్టర్ ధనుష్ రాజకీయ అరంగేట్రంపై రోజుకో వార్త వైరల్ అవుతుండగా, రీసెంట్గా ఆయన అభిమానుల సంఘం పేరు మార్చడంతో ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అయితే, తాజాగా మహిళా ఫ్యాన్స్‌కు ఆయన అందించిన దీపావళి బహుమతుల వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో..ఇప్పుడు సరికొత్త దుమారాన్ని రేపుతోంది. ఆదివారం చెన్నైలో ధనుష్ తన అభిమాన సంఘం అయిన నర్బణి ఇయక్కం మహిళా విభాగం సభ్యులతో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సుమారు 3,000 మందికి పైగా మహిళా ఫ్యాన్స్ హాజరయ్యారు. వారందరితో సరదాగా ముచ్చటించి, గ్రూప్ ఫొటోలు దిగిన ధనుష్.. దీపావళి కానుకగా వారందరికీ స్పెషల్‌గా తయారు చేయించిన వెండి గిన్నెలను బహుమతులుగా అందచేశారు. అయితే, ఆ వెండి బహుమతులపై బీజేపీ అధికారిక గుర్తు…
విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నెం.47’ రోజురోజుకు అంచనాలను పెంచేస్తోంది. ముందు నుంచి అత్యంత భారీ హైప్స్ క్రియేటే చేసిన ఈ మూవీ ట్రైలర్‌ను రీసెంట్గా మేకర్స్ రిలీజ్ చేయగా, అది యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోంది. వెంకటేశ్ కెరీర్లో 77వ ప్రెస్టీజియస్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు త్రివిక్రమ్ మార్క్ కౌంటర్లు, యాక్షన్ సీన్స్ నిండి ఉన్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమయిపోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ మూవీలో వెంకీ సరసన శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నారా రోహిత్ ఒక పవర్ఫుల్ పాత్రలో మెరుస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన సాంగ్స్, నేపథ్య సంగీతం ఈ సినిమాకి మెయిన్…
బుల్లితెరపై యాక్టర్ జగపతి బాబు హోస్ట్‌గా ఎంటర్టైన్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా.. టాక్ షో విజయవంతంగా రెండో సీజన్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న టాక్ షోకి రీసెంట్గా ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గెస్ట్‌గా హాజరయ్యారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను రిలీజ్ చేయగా.. అది ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో సరికొత్త జోష్‌తో కనిపించిన నారా లోకేష్ ..స్టేజ్ మీదికి రాగానే జై బాలయ్య అంటూ గట్టిగా నినాదం చేసి సందడి చేశారు. చిన్నతనంలో స్కూల్లో అందరికంటే కూడా ఎక్కువగా దెబ్బలు తిన్నాది తానొక్కడినేనంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా హీరో బాలకృష్ణ కేవలం ఒక్కరికి మాత్రమే భయపడతారనే సీక్రెట్ ఒకటి బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక షో ఎండింగ్లో ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదంటూ బాలయ్య మాస్ డైలాగ్‌ను తనదైన స్టైల్…