లోకల్ బాడీ సమరంలో నామినేషన్ల స్క్రూటినీ ప్రాసెస్‌లో అభ్యర్థులకు గట్టి షాక్‌లను ఇచ్చింది. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను పాటించకపోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఓటు హక్కు లేకపోవడం వల్ల ఎంతోమంది ఆశావహుల పోటీ కలలు కల్లలు అయిపోయాయి. ఎలక్షన్స్ రూల్స్ ప్రకారం జడ్పీటీసీకి పోటీ చేసే కేండిడేట్స్‌కు 2026 జనవరి 1వ తేదీ నాటికి గ్రామీణ పరిధిలోనే ఓటు ఉండాలి. కానీ, ఈ నిబంధనలు పాటించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 10 మంది జడ్పీటీసీ ఆశావహుల నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్స్ పక్కన పెట్టేశారు. వీరిలో ఆరుగురు జనసేన, ఇద్దరు టీడీపీ, మరొక ఇద్దరు వైసీపీకి చెందినవారు ఉన్నారు. వైసీపీకి చెందిన మరో ఇద్దరు అభ్యర్థులకు మినిమం ఏజ్ 21 ఏళ్లు లేకపోవడం, ప్రభుత్వ రేషన్ డీలర్‌గా బాధ్యతల్లో ఉండటంతో వారి దరఖాస్తులను తిరస్కరించారు. ఈ నామినేషన్ల తిరస్కరణల జాబితాలో ప్రముఖ రాజకీయ కుటుంబాల వారసులు ఉండటం విశేషం. బొత్స సత్యనారాయణ…
Author: Lalitha
కొడంగల్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కావాలి ఆనందం, ఉపాధ్యాయుడి కుమారుడు కావాలి హృషికేష్‌కు ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సుకు కన్వీనర్ కోటాలో ఉచిత సీటు లభించింది. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన విద్యార్థి వైద్య విద్యలో ప్రవేశం పొందడం గర్వకారణమని సత్యనారాయణ ముదిరాజ్ అన్నారు. హృషికేష్ సాధించిన విజయాన్ని అభినందిస్తూ కొత్తపల్లిలోని ఆయన స్వగృహంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హృషికేష్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కష్టపడి చదివి వైద్య విద్యలో సీటు సాధించిన హృషికేష్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టుదలతో చదివితే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలరని ఈ విజయం స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావాలి రాములు, నర్సింహులు, కనకప్ప, కే. శ్రీనివాస్, కావాలి రాంచందర్ తదితరులు పాల్గొని హృషికేష్‌ను సన్మానించారు. విద్యార్థి కుటుంబ…
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రణరంగంలో రోజుకొక ఆసక్తికరమైన పరిణామం తెరపైకి వస్తోంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. పూసపాటిరేగ మండలం నుంచి వైసీపీ తరఫున జెడ్పీటీసీ కేండిడేట్‌గా బరిలోకి దిగిన బొత్స చైతన్య నామినేషన్‌పై జనసేన పార్టీ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన నామినేషన్ చెల్లదంటూ జనసేన జెడ్పీటీసీ కేండిడేట్ కోట్ల రేవతి అధికారులకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. కోట్ల రేవతి తన ఫిర్యాదులో లేవనెత్తిన పాయింట్లు పొలిటికల్‌గా సంచలనం సృష్టిస్తున్నాయి. బొత్స చైతన్యకు అసలు పూసపాటిరేగ మండలంలో ఓటు హక్కే లేదని, చైతన్య పేరు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ వార్డు ఓటర్ జాబితాలో (ఓటర్ ఐడీ నంబర్: UJK1667229) క్లియర్‌గా ఉందని ఆమె మెన్షన్ చేశారు. ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటరుగా ఉన్న వ్యక్తి,…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రాసెస్ ప్రశాంతంగా సాగుతుందని అంతా అనుకుంటే ఎప్పటికప్పుడు నెక్స్ట్ లెవెల్ డ్రామాకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ నామినేషన్ల ఘట్టం పూర్తి కావాల్సిన టైమ్‌లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. ఏపీ వ్యాప్తంగా తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, తమ పార్టీవారికి రక్షణ కరువైందని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ఏకంగా ఏపీ హైకోర్టు తలుపును తట్టారు. నామినేషన్లు దాఖలు చేసే సమయాన్ని మరో 48 గంటల పాటు పెంచాలంటూ అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ వేయడం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. విచారణ సమయంలో వైసీపీ తరఫు న్యాయవాదులు ధర్మాసనం ముందు.. నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధపడిన వైసీపీ కేండిడేట్స్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని, ఇళ్లలోనే గృహనిర్బంధం విధిస్తూ బయటకు రానివ్వడం లేదని ఆరోపించారు. నామినేషన్ వేయడానికి వస్తున్న తమ నేతలను అధికార టీడీపీ వర్గాలు దారిలోనే అడ్డుకుని…
హస్తం పార్టీలో కాక రేపే మరో పొలిటికల్ వార్తలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. కాంగ్రెస్ అగ్ర నేతలయిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మధ్య అంతర్గత పోరు నడుస్తోందంటూ బీజేపీ గట్టిగా ఆరోపిస్తోంది. తాజాగా ప్రియాంక గాంధీ కుమారుడు, ఫోటోగ్రాఫర్ రైహాన్ వాద్రా ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో వివాదం తలెత్తగా.. దానికి రాహుల్ గాంధీ ఏ మాత్రం స్పందించకపోవడమే ఈ అనుమానాలకు బలమైన కారణమని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ సోషల్ మీడియా వేదికగా రచ్చ లేపారు. ఢిల్లీలోని బికనీర్ హౌస్‌లో రైహాన్ వాద్రా.. నో ఐడియా ఈజ్ ఫైనల్ పేరుతో 105 ఫోటోలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కానీ ఎగ్జిబిషన్ కొన్ని గంటల ముందే దానిలోని 74 ఫోటోలు తీసేయాలని లేదా మార్చాలని నిర్వాహకులు చెప్పడంతో కేవలం 35 ఫోటోలు మాత్రమే మిగిలాయి. దీనిపై ప్రియాంక గాంధీ రియాక్ట్ అవుతూ యువత గొంతు నొక్కుతున్నారంటూ మండిపడ్డారు. అయితే పర్సనల్…
రాధా బరిలోకి దిగడంతో విజయవాడ మేయర్, కార్పొరేషన్ రెండూ వార్ వన్ సైడే నడుస్తాయని సామాన్య జనం సైతం కామెంట్లు పెడుతున్నారు. అంతకు ముందు కార్పొరేషన్‌ను వెలంపల్లి శ్రీనివాసు చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూశారు. అప్పటి మేయర్ టీడీపీ కాబట్టి ఎదురు నిలిచారు గాని.. ఆపలేకపోయారు. ఇక తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చాక వైసీపీ మేయర్ భాగ్యలక్ష్మి కాంప్రమైజ్ ఫార్ములాలో పనులు చేసుకున్నారనే టాక్ ఉంది. సరేలే అంతవరకు తీసుకో గాని.. మిగతా వాటిలో వేలు పెట్టమాకు.. అని ఎమ్మెల్యేనో, ఎంపీనో అనడానికి ఇప్పుడు కుదరదు.. ఎందుకంటే అవతల మేయర్ గా ఉండబోయేది వంగవీటి రాధా. మిగతావారిలా ట్రీట్ చేయడం అసలు కుదరనే కుదరదు. వైసీపీ వాళ్లు ఎలాగూ హ్యాండ్సప్ … కాని టీడీపీలో కూడా గుబులు కనపడుతోంది. ఎలాగూ గెలుస్తాడు.. మనకు కూడా మొగుడు అవుతాడా అనే భయం కనపడుతోంది. కాని ఫస్ట్ నుంచి వంగవీటి రాధా ఎవరితోనూ కయ్యం…
ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఫస్ట్ లిస్ట్‌ను బయటపెట్టింది. అధికార కూటమిలో సీట్ల సర్దుబాటును కన్ఫమ్ చేసుకున్న జనసేన, తమకు కేటాయించిన స్థానాల్లో పోటీ చేసే మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థు వివరాలను మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో హాట్ టాపిక్‌గా ఉన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటుకి వంగవీటి రాధాకృష్ణ పేరును పవన్ కన్ఫర్మ్ చేశారు. అలాగే ఏలూరు మేయర్ క్యాండిడేట్‌గా రెడ్డి అప్పలనాయుడు బరిలోకి దిగుతున్నారు. మొత్తం 4 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుండగా.. తొలి విడతలో భాగంగా 12 మున్సిపాలిటీల ఛైర్మన్ కేండిడేట్స్ నేమ్స్‌ను కూడా లిస్ట్‌లో చేర్చారు. అమలాపురంలో నల్ల శ్రీధర్, తెనాలిలో టి. వెంకటరమణారావు, పిఠాపురంలో బీరా విజయ్ శేఖర్‌తో పాటు మిగిలిన చోట్ల కేండిడేట్స్‌ను ఖరారు చేశారు.…
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల తొలిరోజే అంటే అక్టోబర్ 16 శుక్రవారం రోజే రాయలసీమ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో చెలరేగిన హింసాకాండతో.. ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల పెట్టిన రూల్స్‌ను లెక్కచేయకుండా వాహనాలతో గేట్లను ఢీకొట్టి బలవంతంగా లోపలికి దూసుకెళ్లడంతోనే అసలు రచ్చ మొదలైనట్లు తేలింది. పుంగనూరు ఘటనపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలను బయటపెట్టారు. ఎంపీ కాన్వాయ్‌లోని కార్లలో కొంతమంది రౌడీషీటర్లు మారణాయుధాలతో తిరుగుతూ వీరంగం సృష్టించారని ఆయన వివరించారు. వైసీపీ, టీడీపీ వర్గాల రాళ్లదాడి, ఘర్షణలతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవడంతో.. డీఎస్పీ ప్రసాద్ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చిందని వెల్లడించారు. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఎస్పీ ధీరజ్ స్వయంగా…
రాజేష్ ఖన్నాలా ఉండేవాడు.. అమీర్ ఖాన్‌లా సిగ్గుపడేవాడు.. అలాంటిది ఒక్కసారే రణవీర్ సింగ్ అయిపోయాడు. దురంధర్ లెవెల్లో ఎలివేషన్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినట్లున్నాడు. అందుకే పైకి ఏ కవరింగ్ చేసుకున్నా.. రాబోయే ఎన్నికల రణరంగం కోసం గెటప్ మార్చే పనిలో కేటీఆర్ పడ్డారనేది అర్ధమైపోతుంది. ఎందుకంటే దీని వెనక ఓ కథ ఉంది. దాని కోసం కొంచెం ఫ్లాష్ బ్యాక్ కి వెళదాం. మామూలుగా తెలంగాణ హైదరాబాద్ నుంచి పైన ఉత్తర తెలంగాణ వరకు కొంచెం నార్త్ కల్చర్ అలవాటు అవుతుంది. అందుకే ఎక్కువమంది క్లీన్ షేవ్ ఇష్టపడతారు. నార్త్ ఇండియన్స్ లాగా గెడ్డం పెంచకుండా మీసం తీసేసి ఉంటారు. అలాగే కేటీఆర్.. కల్వకుంట్ల తారక రామారావు కూడా. ఉద్యమం జరిగే సమయంలో అమెరికా నుంచి వచ్చేసి రంగంలోకి దిగారు. అప్పటికే కేసీఆర్ దూకుడు మీదుంటే.. హరీష్ రావు నెంబర్ టు గా ఉన్నారు. కేటీఆర్ రావడం.. అప్పటికే కవిత ఎంట్రీ…
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల సమయంలో.. దైవభక్తితో పాటు అధికారుల హంగూ ఆర్భాటాలు కూడా పీక్స్‌కి చేరాయనే వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అక్టోబర్ 16వ తేదీన మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు విజయవాడకు తరలివచ్చారు. అయితే అందరికీ నిత్యం సేవలు అందిస్తున్న దేవస్థానం సిబ్బందిపై ఒక మున్సిపల్ అధికారి పెత్తనం ప్రదర్శించారన్న వార్తలు వినిపస్తున్నాయి. భక్తుల రద్దీని తట్టుకుంటూ అన్నదానం నిర్వహిస్తున్న సిబ్బందిపై వారి చెత్త తొలగింపును ఆపేస్తానంటూ బెదిరింపులు దిగారన్న ప్రచారం జరుగుతోంది. ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల సందర్భంగా విధులు నిర్వర్తిస్తున్న వివిధ డిపార్ట్‌మెంట్‌ల సిబ్బందితో పాటు భక్తుల కోసం బ్రాహ్మణ వీధిలోని సత్రంలో దేవస్థానం స్పెషల్‌గా అన్నదాన ఏర్పాట్లు చేసింది. అయితే ఈ అన్నదాన కేంద్రం వద్ద బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవిశంకర్ ప్రవర్తించిన తీరుపైన ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూలా నక్షత్రం రోజు…