Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Friday, October 30
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»బాబు రూట్ మార్చారు..
    ఆంధ్ర ప్రదేశ్

    బాబు రూట్ మార్చారు..

    LalithaBy LalithaOctober 29, 2026Updated:October 30, 2026No Comments2 Mins Read19 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    చంద్రబాబు వ్యూహం
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    మేమేం తక్కువ తినలేదు.. మేం కూడా వైసీపీ అడుగుజాడల్లోనే నడుస్తామని టీడీపీ చెప్పకనే చెప్పినట్లయింది. ఒకవైపు సీఎం చంద్రబాబు సుభాషితాలు చెబుతూనే ఉన్నారు. మరోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు చేయాల్సింది చేసుకుంటూ పోతున్నారు. చివరకు చంద్రబాబే వారి దారిలోకి వచ్చినట్లున్నారు. గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ వారిని నామినేషన్లు వేయనిచ్చారా అని ప్రశ్నిస్తున్నారు.

    అయితే ఏకగ్రీవాల విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు అర్ధమవుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తాలలో ఈ గొడవ లేదు. నామినేషన్లు ఆపినట్లు ఆరోపణలు లేవు. కాని రాయలసీమలో మాత్రం గట్టిగా వచ్చాయి. రాయలసీమలోనే వైసీపీ బలం ఉన్నది. అక్కడ కూడా అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడిపోయినా.. పర్సేంటేజీలు చూస్తే ఇక్కడే ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.

    అందుకే రాయలసీమలో దెబ్బ కొడితే.. మళ్లీ కోలుకోకుండా చేయొచ్చనేది టీడీపీ వ్యూహంగా కనపడుతోంది. అందుకే రాయలసీమలో వైసీపీ బలంగా ఉన్న కడప, అనంతపురం, చిత్తూరు తర్వాత కర్నూలులోను గట్టిగా ఫోకస్ చేసింది టీడీపీ. ఏకగ్రీవాలు అయ్యేటట్లు బలంగా ప్లాన్ చేసింది. మున్సిపల్ ఛైర్ పర్సన్లు, వార్డులు, ఆఖరికి ఎంపీటీసీలు కూడా ఏకగ్రీవాలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు రాకపోతే ఇంకా భారీ సంఖ్యలో ఇవి ఉండేవనడంలో సందేహం లేదు.

    దీని వలన వైసీపీ నేతలు, కార్యకర్తల్లో నిరాశ కనపడుతోంది. ఇలా అయితే మళ్లీ పుంజుకోగలమా అనే డౌట్లు పెరిగిపోయాయి. మొన్నటివరకు జగన్ ఏదో ఒక పేరుతో చేసిన యాత్రలకు జనం ఎగబడినట్లుగా క్రియేట్ చేసుకున్నారు. దీంతో జగన్ కు క్రేజ్ తగ్గలేదని.. జగన్ అంటే కూటమి భయపడుతుందని.. మళ్లీ జగన్ వచ్చేస్తాడంటూ ప్రచారాన్ని పీక్స్‌కు తీసుకెళ్లారు. వైసీపీ అభిమానుల్లో కొందరు ఈ విషయాన్ని నమ్మారు కూడా. అయితే ఆ నమ్మకాన్ని వమ్ము చేసే లక్ష్యంగా టీడీపీ పావులు కదిపింది.

    వైసీపీ బలంగా ఉందనుకుంటున్న ప్రాంతాల్లోనే ఏకగ్రీవాలు చేయటం ద్వారా అంత బలం లేదని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే అక్రమాల విషయంలో చంద్రబాబు పైకి బయటపడరు గాని.. లోలోపల చేయిస్తారని ఇప్పటి వరకూ ఉన్న పేరు.. ఈసారి ఆ పేరు పోయి.. చంద్రబాబు కూడా ఓపెన్ హంటింగ్ చేసేశారనే టాక్ వచ్చేసింది. ఇది టీడీపీ అభిమానుల్లో కూడా చర్చ రేపింది. అంతే కాదు.. జనసేనకు పొత్తులో ఇఛ్చిన చోట కూడా తెలుగు తమ్ముళ్లు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుపడిన ఘటనలు కలకలం రేపాయి. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గరే గట్టి పట్టు పట్టడంతో… అవి కాస్త తగ్గుముఖం పట్టాయి.

    ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు టీడీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    సైలెంట్‌గా ఓటీటీలోకి కామ్రేడ్ కళ్యాణ్

    October 30, 2026

    తుపానులకు పేర్లు ఎలా పెడతారో తెలుసా?

    October 30, 2026

    ఈరోజు ఇండియా కూటమి జన మహాభియోగ్

    October 30, 2026

    అర్నబ్ ప్రభావిత జిల్లాల్లో సీఎం ఏరియల్ సర్వే

    October 29, 2026

    జగన్‌ లెసన్ నేర్చుకున్నారా? ఇంకా నేర్చుకుంటారా?

    October 29, 2026

    విజయవాడలో వెరైటీ ఫైట్

    October 29, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026411 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026103 Views
    డోన్'ట్ మిస్

    సైలెంట్‌గా ఓటీటీలోకి కామ్రేడ్ కళ్యాణ్

    October 30, 2026

    బాక్సాఫీస్ వద్ద తన మార్క్ కామెడీతో ఎప్పుడూ ఆకట్టుకునే యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ కామ్రేడ్…

    తుపానులకు పేర్లు ఎలా పెడతారో తెలుసా?

    October 30, 2026

    ఈరోజు ఇండియా కూటమి జన మహాభియోగ్

    October 30, 2026

    ఆదర్శ కుటుంబం ట్విట్టర్ టాక్..వెంకీ మామ మెప్పించాడా?

    October 30, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026411 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026103 Views
    ఔర్ పిక్స్

    సైలెంట్‌గా ఓటీటీలోకి కామ్రేడ్ కళ్యాణ్

    October 30, 2026

    తుపానులకు పేర్లు ఎలా పెడతారో తెలుసా?

    October 30, 2026

    ఈరోజు ఇండియా కూటమి జన మహాభియోగ్

    October 30, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.