సెలబ్రెటీల మధ్య నడిచే లవ్ అండ్ మ్యారేజ్ ట్రాక్స్ ఎప్పుడూ క్యూరియాసిటీని రేకెత్తిస్తాయి. సన్ గ్రూప్ వారసురాలు, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ అండ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ లవ్ స్టోరీ కూడా ఇలాగే అందరి మాటల్లో తెగ నానుతోంది. కొద్దికాలంగా మీడియా కంటపడకుండా మెయింటైన్ చేస్తూ వస్తున్న ఈ పెయిర్, ఇప్పుడు డైరెక్ట్‌గా కళ్యాణ ఘడియలకు రెడీ అయిపోయింది. దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ న్యూస్ బయటకు రాకపోయినా, జరిగిపోతున్న పరిణామాలు మాత్రం ఆ సందడిని క్లియర్‌గా చూపిస్తున్నాయి. హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్స్‌లో అక్టోబర్ 16న జరిగిన ఒక హైప్రొఫైల్ మీటింగ్ ఈ న్యూస్‌కు మరింత బలాన్నిచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన కళానిధి మారన్ దంపతులు, తమ కుమార్తె కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. వచ్చే నవంబర్ 21వ తేదీన చెన్నై గ్రాండ్ ఫంక్షన్‌కు రావాలంటూ ఆహ్వాన పత్రికను…
Author: Lalitha
స్థానిక సమరానికి కాకరేగుతున్న సమయంలో తూర్పుగోదావరి రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ వేడి పెరిగిపోయింది. కొవ్వూరు వైఎస్సార్సీపీ కేడర్ ఏ మాత్ర ఊహించని రీతిలో మైండ్ బ్లాంక్ అయ్యే పరిణామం తెర మీదకు వచ్చింది. పార్టీ అధిష్ఠానం ఎంతో నమ్మకంతో మున్సిపల్ ఛైర్పర్సన్ బీ ఫామ్ ఖరారు చేసిన కొద్ది గంటల్లోనే, ఆ కేండిడేట్ పోటీ నుంచే తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసి పెద్ద బాంబు పేల్చారు. నిన్నటివరకు గెలుపు గుర్రం అంటూ ప్రచారం చేసిన నాయకత్వానికి.. ఈ షాకింగ్ డెసిషన్ అస్సలు జీర్ణం కావట్లేదు. కొవ్వూరు మున్సిపల్ బరిలో వైఎస్సార్సీపీ తరఫున మన్నె పద్మను నిలబెడుతున్నట్లు గురువారం అక్టోబర్ 15వ తేదీ రాత్రి పార్టీ నుంచి క్లారిటీ వచ్చింది. తీరా తెల్లారేసరికి ఈ గుడ్ న్యూస్ చెబుదామని మాజీ మంత్రి వేణుగోపాల కృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు డైరెక్టుగా ఆమె నివాసానికి చేరుకున్నారు. గతంలో ఐదు…
ఎందుకు వదిలేయాలి ఇదే ప్రశ్న ఇప్పటి యువతరానిది. తరతరాలుగా అవినీతిని, మానిప్యులేషన్‌ని, రాజకీయ నాయకుల దొంగ వైఖరిని చూసి చూసి పాత తరాలకు అలవాటు అయిపోయింది. ఆఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసేది ఇదే కదా… 20 కోట్లు ఖర్చు పెట్టాడు సంపాదిందించుకోకుండా ఎలా ఉంటాడు. వాడెంత పనికిరాని వాడయినా మన కులపోడుకదా అనుకోవటం ఒక తరం పద్ధతి. మన వృద్ధతరం అయితే మంచి చెడు చూసి నిర్ణయించుకునేవారు.. తప్పులు చేయాలంటే నాయకులు భయపడేవారు. దాచుకుని దాచుకుని దోచుకునేవారు. అది కూడా బట్టబయలు అయితే రాజీనామా చేయక తప్పదు. ఈ రెండు తరాలు ఒక టైప్ అయితే.. ఇప్పటి యువతరం మరో టైప్. వాడు తిన్నది రూపాయేగా అని వదిలిపెట్టరు.. ఎందుకు వదిలేయాలి అంటూ తాట తీస్తున్నారు. ఆయన ఎంత పెద్ద నాయకుడు అయితే ఏంటి.. ఆయన ఏం చేసినా.. తప్పు అయితే జరిగిందిగా.. శిక్ష పడాలిగా.. ఎందుకు వదిలేయాలి? అంటున్నారు. అదే…
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన మొదటి రోజే నామినేషన్ల హీట్ ఉద్రిక్తతలకు దారితీసింది. అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు పట్టణం ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు వేయడానికి టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా నామినేషన్ కేంద్రాల వైపు దూసుకురావడంతో రెండు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి పరిస్థితి ఘర్షణకు దారి తీసింది. రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తన అనుచరులు, పార్టీ కేండిడేట్స్‌తో కలిసి భారీ కాన్వాయ్‌తో నామినేషన్ల కేంద్రానికి చేరుకోవడమే ఇక్కడ వివాదానికి కారణమైంది. ఆయన బారికేడ్లను దాటుకుంటూ వెళ్లడానిక ప్రయత్నించడంతో అక్కడున్న భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దీంతో జరిగిన తోపులాటలో ఓ పోలీస్ కానిస్టేబుల్ గాయపడటంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పెరిగింది. ఎంపీ మిథున్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ తెలుగు దేశం పార్టీ నేతలు అక్కడే ఆందోళనకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య…
మూవీ లవర్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక పిక్చర్ రామాయణ హంగామా అధికారికంగా మొదలైంది. నిన్న బెంగళూరు సాక్షిగా ఈ ఎపిక్ మూవీ అంతర్జాతీయ ట్రైలర్ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్, స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్‌తో పాటు ముంబై, సౌత్ సినీ రంగానికి చెందిన సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఈ వేడుకలో అందరి కళ్లూ సీత రోల్ చేస్తున్న సాయి పల్లవిపైనే నిలిచాయి. సంప్రదాయ ధర్మాలకు నిలువుటద్దంలా ప్రత్యేకంగా డిజైన్ చేయించిన పింక్ పట్టుచీరలో సాయి పల్లవి ప్రత్యక్షమైన తీరు ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది. వెండి దారాలతో నేసిన బ్రోకేడ్ డిజైన్, కట్‌వర్క్ బోర్డర్ శారీ, మోచేతుల వరకు ఉండే బ్లౌజ్‌తో పాటు తక్కువ మేకప్‌తో ఈ నేచురల్ బ్యూటీగా మెరిసిపోయారు. సింపుల్ ఇయర్ రింగ్స్, ఉంగరాలతో చాలా డిగ్నిఫైడ్‌గా కనిపించారు. వేదికపైకి వచ్చిన…
పవన్ ఆలోచనలు, వ్యూహాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. చివరకు వ్యూహకర్తలు కూడా పవన్ స్ట్రాటజీని అంచనా వేయలేకపోతున్నారు. నచ్చనివాళ్లు తిడుతున్నారు.. అభిమానించేవారు మాత్రం ఆయన ఏం చేసినా బాగు కోసమే అని వాదిస్తున్నారు. ఆఖరికి చంద్రబాబునాయుడు లాంటి సీనియర్ కూడా పవన్ ను డీల్ చేయలేకపోతున్నారని కామెంట్లు వస్తున్నాయి. సిట్యుయేషన్ ని అడ్డు పెట్టి తన బలాన్ని పెంచుకోవడంలో పవన్ ఏపీలో ఏ నాయకుడితో పోలిక లేని విధంగా తన ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు ఏం చేయాలో అర్ధం కాక, ఓటమిని ఎదుర్కొన్న ఆ పవన్ ఈ పవన్ ఒకరేనా అని ఆశ్చర్యపోయేలా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు జనసేనకు క్యాండిడేట్లు ఎవరో తెలియని పరిస్ధితి నుంచి ఈ రోజు క్యాండిడేట్లు వారి వెనక కేడర్ అందరూ వచ్చేలా చేసుకోవడం ఆశ్చర్యకరంగానే ఉంది. పైగా జనసేనలో పవన్ టీడీపీకి దాసోహం అయ్యారు.. లొంగిపోయారు అనే అసంతృప్తి నుంచి ఈరోజు ఎస్ పవన్ టీడీపీ…
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల్లో సత్తా చాటడానికి ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్న సమయంలో.. ఎన్నికల ప్రాసెస్‌లో అత్యంత కీలకమైన నామినేషన్ల పర్వానికి ఈరోజు అంటే అక్టోబర్ 16న శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రాసెస్ అధికారికంగా ప్రారంభం కానుంది. మొత్తం 28 జిల్లాల పరిధిలోని 100 పుర, నగరపాలక సంస్థల్లో ఎలక్షన్ నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ నామినేషన్ ఘట్టం ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ పీఠాలను దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు స్టాటజీలు రచిస్తుండగా, వార్డు స్థాయిల్లో పోటీ పడటానికి ఏకంగా 3,942 కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు అభ్యర్థులు శరవేగంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. అభ్యర్థుల రద్దీని…
నువ్వు రాజీనామా చేయ్.. ఇద్దరం పోటీ చేద్దాం ఎవరు గెలుస్తారో చూసుకుందాం… ఇది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎంపీ సీఎం రమేష్‌కు చేసిన సవాల్. ఏంటి గుడివాడ ఇంత ధైర్యంగా అగ్రెసివ్ గా వెళుతున్నారనే చర్చ మొదలైంది. ఎందుకిలా… నిజంగానే పోటీ జరిగితే ఎవరు గెలుస్తారనే చర్చ కూడా నడుస్తోంది. ముఖ్యంగా గుడివాడ చెప్పిన మాటలే ఇప్పుడు ప్రజలను ఆలోచనలో పడేశాయి. మేం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం..మా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ప్రజలందరికీ తెలుసు.. నీలా వ్యాపారాలు కాంట్రాక్టులు చేసి ఆ డబ్బులతో రాలేదు అని ఘాటుగానే కామెంట్ చేశారు అమర్ నాథ్. ఒక విధంగా ఆయన మాటల్లో వైసీపీ, జగన్ కన్నా.. తాను ఇండివిడ్యుల్ గానే బ్యాక్ గ్రౌండ్ ఉన్న పొలిటిషీయన్ అన్నట్లే చెప్పారు. అంటే జగన్ ను వదిలించుకుని .. పాడైన తన ఇమేజ్ మళ్లీ రీస్ట్రక్చర్ చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారే అనే…
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం.. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పంచాయితీ తేలిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ పెద్దల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఎవరికి ఏ ఏరియా కేటాయించాలనే దానిపై పక్కా క్లారిటీ వచ్చేసింది. ఏపీ వ్యాప్తంగా ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి మొత్తం 123 అర్బన్ బాడీస్‌లో క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కేడర్ జోష్ ఎంత అనే దానిని బేస్ చేసుకుని లెక్కలు తేల్చేశారు. మొత్తం 123 స్థానిక సంస్థల ఓవరాల్ పిక్చర్ చూస్తే, సింహభాగం సీట్లను తెలుగు దేశం పార్టీ తన ఖాతాలో వేసుకుంటూనే, మిత్రపక్షాలకు కూడా తగిన భాగం ఇచ్చింది. ఈ ఫార్ములా ప్రకారం టీడీపీ ఏకంగా 89 స్థానాల్లో (72.36%) బరిలోకి దిగుతుండగా, జనసేన 25 సీట్లలో (20.33%), బీజేపీ 9 సీట్లలో (7.32%) తమ కేండిడేట్స్‌ను…
MPTC, ZPTC ఎన్నికలు: ఏపీలో రానున్న మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (MPTC), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ZPTC) ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. నామినేషన్ దాఖలు చేసే సమయంలో అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడంతో పాటు, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలు, అనర్హతల గురించి తెలుసుకోవడం ముఖ్యం. నామినేషన్ చివరి రోజు వరకు వేచి ఉంటే ధ్రువపత్రాల సేకరణలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హతలు ఏమిటి? MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు సాధారణంగా కనీసం 21 సంవత్సరాల వయస్సు ఉండాలి. అలాగే సంబంధిత ప్రాదేశిక నియోజకవర్గానికి వర్తించే ఓటరు జాబితాలో పేరు ఉండటం కీలకం. MPTC అభ్యర్థులు సంబంధిత మండల పరిధిలో, ZPTC అభ్యర్థులు సంబంధిత జిల్లా పరిధిలోని నియోజకవర్గానికి వర్తించే ఓటరు జాబితా నిబంధనలను పరిశీలించాలి. విద్యార్హతలకు…