స్థానిక సమరానికి కాకరేగుతున్న సమయంలో తూర్పుగోదావరి రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ వేడి పెరిగిపోయింది. కొవ్వూరు వైఎస్సార్సీపీ కేడర్ ఏ మాత్ర ఊహించని రీతిలో మైండ్ బ్లాంక్ అయ్యే పరిణామం తెర మీదకు వచ్చింది. పార్టీ అధిష్ఠానం ఎంతో నమ్మకంతో మున్సిపల్ ఛైర్పర్సన్ బీ ఫామ్ ఖరారు చేసిన కొద్ది గంటల్లోనే, ఆ కేండిడేట్ పోటీ నుంచే తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసి పెద్ద బాంబు పేల్చారు. నిన్నటివరకు గెలుపు గుర్రం అంటూ ప్రచారం చేసిన నాయకత్వానికి.. ఈ షాకింగ్ డెసిషన్ అస్సలు జీర్ణం కావట్లేదు.
కొవ్వూరు మున్సిపల్ బరిలో వైఎస్సార్సీపీ తరఫున మన్నె పద్మను నిలబెడుతున్నట్లు గురువారం అక్టోబర్ 15వ తేదీ రాత్రి పార్టీ నుంచి క్లారిటీ వచ్చింది. తీరా తెల్లారేసరికి ఈ గుడ్ న్యూస్ చెబుదామని మాజీ మంత్రి వేణుగోపాల కృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు డైరెక్టుగా ఆమె నివాసానికి చేరుకున్నారు. గతంలో ఐదు సార్లు మున్సిపల్ ఛైర్మన్గా కొవ్వూరులో పని చేసిన మాజీ ఎమ్మెల్సీ కొడాలి శివరామకృష్ణ ఇంటి వద్ద ఈ హైడ్రామా నడిచింది. బీ ఫామ్ ఇవ్వడానికి వచ్చిన నేతలకు.. మన్నె పద్మ ఇచ్చిన షాకింగ్ జవాబు చూసి సీనియర్ నాయకులకే మైండ్ పోయినంత పనైంది.
ఎన్నికల రేసులో తాను నిలబడలేనని పద్మ తేల్చి చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ పొలిటికల్ సీన్ రివర్స్ అయింది. పెద్దలంతా కలిసి ఎంత సర్దిచెప్పినా, ఎలాంటి ఆఫర్లు ముందు పెట్టినా కూడా ఆమె మాత్రం తాననుకున్న మాటపైనే మొండిగా నిలబడ్డారు. దీంతో ఏమీ చేయలేక ఆ సీనియర్ నేతలంతా ఈ విషయాన్ని తాడేపల్లికి చేరవేసినట్లు సమాచారం.
రాజకీయంగా విపరీతమైన పట్టున్న కొడాలి ఫ్యామిలీ నుంచే ఈ స్థాయిలో రిజెక్షన్ రావడం ఇప్పుడు గ్రౌండ్ లెవల్లో పోటీకి సిద్ధమవుతున్న మిగతా వార్డు కేండిడేట్స్లో కూడా వణుకు పుట్టిస్తోంది. గెలుపు వాతావరణం ఉందా లేదా అనే అనుమానాలు మళ్లీ మొదలయ్యాయి. కన్ఫర్మ్ అనుకున్న ఛైర్పర్సన్ కేండిడేట్ చేతులెత్తేయడంతో, ఇప్పుడు కొవ్వూరు వైఎస్సార్సీపీలో ఎవరిని బరిలోకి దింపాలి , ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై అయోమయం నెలకొంది.
