Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Saturday, October 17
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»లోకల్ ఎలక్షన్స్‌లో క్లీన్ స్వీప్‌పై కూటమి కన్ను..
    ఆంధ్ర ప్రదేశ్

    లోకల్ ఎలక్షన్స్‌లో క్లీన్ స్వీప్‌పై కూటమి కన్ను..

    LalithaBy LalithaOctober 16, 2026Updated:October 17, 2026No Comments2 Mins Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    ఏపీ స్థానిక ఎన్నికలు
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం.. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పంచాయితీ తేలిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ పెద్దల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఎవరికి ఏ ఏరియా కేటాయించాలనే దానిపై పక్కా క్లారిటీ వచ్చేసింది. ఏపీ వ్యాప్తంగా ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి మొత్తం 123 అర్బన్ బాడీస్‌లో క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కేడర్‌ జోష్‌ ఎంత అనే దానిని బేస్‌ చేసుకుని లెక్కలు తేల్చేశారు.

    మొత్తం 123 స్థానిక సంస్థల ఓవరాల్ పిక్చర్ చూస్తే, సింహభాగం సీట్లను తెలుగు దేశం పార్టీ తన ఖాతాలో వేసుకుంటూనే, మిత్రపక్షాలకు కూడా తగిన భాగం ఇచ్చింది. ఈ ఫార్ములా ప్రకారం టీడీపీ ఏకంగా 89 స్థానాల్లో (72.36%) బరిలోకి దిగుతుండగా, జనసేన 25 సీట్లలో (20.33%), బీజేపీ 9 సీట్లలో (7.32%) తమ కేండిడేట్స్‌ను నిలబెట్టుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి.

    ఇక 17 మున్సిపల్ కార్పొరేషన్ల పోరులో టీడీపీ 11 చోట్ల సత్తా చాటడానికి సిద్ధమవుతుండగా, జనసేనకు 4, బీజేపీకి 2 కార్పొరేషన్లు దక్కాయి. దీనిలో జనసేన పార్టీకి దక్కిన కార్పొరేషన్లు పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారాయి. శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరుతో పాటు పొలిటికల్‌గా అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయవాడ కార్పొరేషన్‌ను పవన్‌ కళ్యాణ్‌కు కేటాయించడం విశేషం. మరోవైపు బీజేపీ అకౌంట్‌లో రాజమహేంద్రవరం, అనంతపురం కార్పొరేషన్లు పడ్డాయి.

    ఇక మిగిలిన 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల విషయానికొస్తే, ఇక్కడ కూడా కూటమి నేతలు పక్కా ప్లాన్‌తోనే ముందుకు వెళ్లారు. ఈ మున్సిపాలిటీల్లో టీడీపీ 78 చోట్ల తన లక్‌ను పరీక్షించుకోనుండగా, జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. ఎక్కడ ఏ పార్టీకి పట్టుంది, ఏ స్థానంలో ఏ గెలుపు గుర్రాన్ని బరిలో దింపితే కరెక్ట్ అవుతుందనే లెక్కలతో.. ప్రామాణికంగా ఈ పొత్తుల కసరత్తు ముగిసింది. ఎక్కడా, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సీట్ల పంపకాలు సక్సెస్‌ఫుల్‌గా ముగియడంతో, కూటమి శ్రేణులు ఇప్పుడు గ్రౌండ్‌లోకి దిగి ఎన్నికల ప్రచార మోత మోగించడానికి ఫుల్ జోష్‌తో రెడీ అవుతున్నాయి.

    ఆంధ్రప్రదేశ్ జనసేన టీటీడీ బీజేపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    వంగ‌వీటి వార్ వ‌న్ సైడేనా..!

    October 17, 2026

    విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా..

    October 17, 2026

    పుంగనూరు నామినేషన్ల రణరంగంలో జరిగిందేంటి?

    October 17, 2026

    మీసం మెలేసి.. సీఎం అవుతారా..?

    October 17, 2026

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026

    కావ్య మారన్,అనిరుధ్ పెళ్లి కబురు..

    October 17, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202683 Views

    రాధాకు మంచి రోజులు.. ఇక‌నైనా

    October 15, 202658 Views
    డోన్'ట్ మిస్

    వంగ‌వీటి వార్ వ‌న్ సైడేనా..!

    October 17, 2026

    రాధా బ‌రిలోకి దిగ‌డంతో విజ‌య‌వాడ మేయ‌ర్, కార్పొరేష‌న్ రెండూ వార్ వ‌న్ సైడే న‌డుస్తాయ‌ని సామాన్య జ‌నం సైతం కామెంట్లు…

    విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా..

    October 17, 2026

    పుంగనూరు నామినేషన్ల రణరంగంలో జరిగిందేంటి?

    October 17, 2026

    మీసం మెలేసి.. సీఎం అవుతారా..?

    October 17, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202683 Views

    రాధాకు మంచి రోజులు.. ఇక‌నైనా

    October 15, 202658 Views
    ఔర్ పిక్స్

    వంగ‌వీటి వార్ వ‌న్ సైడేనా..!

    October 17, 2026

    విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా..

    October 17, 2026

    పుంగనూరు నామినేషన్ల రణరంగంలో జరిగిందేంటి?

    October 17, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.