సెలబ్రెటీల మధ్య నడిచే లవ్ అండ్ మ్యారేజ్ ట్రాక్స్ ఎప్పుడూ క్యూరియాసిటీని రేకెత్తిస్తాయి. సన్ గ్రూప్ వారసురాలు, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ అండ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ లవ్ స్టోరీ కూడా ఇలాగే అందరి మాటల్లో తెగ నానుతోంది.
కొద్దికాలంగా మీడియా కంటపడకుండా మెయింటైన్ చేస్తూ వస్తున్న ఈ పెయిర్, ఇప్పుడు డైరెక్ట్‌గా కళ్యాణ ఘడియలకు రెడీ అయిపోయింది. దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ న్యూస్ బయటకు రాకపోయినా, జరిగిపోతున్న పరిణామాలు మాత్రం ఆ సందడిని క్లియర్‌గా చూపిస్తున్నాయి.
హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్స్‌లో అక్టోబర్ 16న జరిగిన ఒక హైప్రొఫైల్ మీటింగ్ ఈ న్యూస్‌కు మరింత బలాన్నిచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన కళానిధి మారన్ దంపతులు, తమ కుమార్తె కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. వచ్చే నవంబర్ 21వ తేదీన చెన్నై గ్రాండ్ ఫంక్షన్‌కు రావాలంటూ ఆహ్వాన పత్రికను అందజేసి అక్కడి నుంచి వెళ్లారు.
ఈ ఇన్విటేషన్‌తో కేవలం చెన్నై రిసెప్షన్‌పైనే కాదు, గ్రీస్‌లో జరగబోయే సీక్రెట్ వెడ్డింగ్‌పై కూడా పూర్తి క్లారిటీ వచ్చేసింది. నవంబర్ 11వ తేదీన గ్రీస్ వేదికగా అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక ముగించుకుని, చెన్నైలో నవంబర్ 21వ తేదీన భారీ విందు ఇవ్వబోతున్నారు. బిజినెస్ వరల్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్‌ను షేక్ చేస్తున్న ఈ మ్యాచ్ ప్రెజెంట్ టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయింది.
