ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు లోకల్ పోరు రచ్చ రంబోలాగా మారింది. నిన్నటి వరకూ సోషల్ మీడియాకే పరిమితమైన పొలిటికల్ హీట్, ఇప్పుడు నామినేషన్ల రూపంలో సునామీలా విరుచుకుపడింది. ఏపీ వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు పోటెత్తారు. రికార్డు స్థాయిలో దాఖలైన ఈ నామినేషన్ల లెక్కలను చూస్తుంటే, ఏపీలో గ్రౌండ్ లెవెల్ హీట్ ఏ స్థాయిలో అర్థమైపోతోంది.
ఏపీలోని 28 జిల్లాల పరిధిలో ఉన్న 9వేల829 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఏకంగా 51వేల902 నామినేషన్లు పోలవ్వడం సాధారణ విషయం కాదు. ఇక 659 జెడ్పీటీసీ స్థానాల కోసం 5,724 మంది పోటీలోకి దిగి తమ లక్‌ను పరీక్షించుకోవడానికి సై అంటున్నారు. ఇక నామినేషన్ల చివరి రోజైతే ఏకంగా 3,315 జెడ్పీటీసీ, 25,016 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు క్యూ కట్టి మరీ పత్రాలు సమర్పించారు.
ఎంపీటీసీ స్థానాల విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థులు ఏకంగా 22వేల13 నామినేషన్లు వేయగా, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పోటీపోటీగా 20వేల556 నామినేషన్లను దాఖలు చేసింది. ఇక జనసేన పార్టీ తరఫున 4,609 మంది, బీజేపీ నుంచి 1,150 మంది తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. జెడ్పీటీసీ స్థానాల్లో కూడా ఇదే రకమైన హోరాహోరీ పోటీ నడిచింది. టీడీపీ నుంచి 2వేల78 నామినేషన్లు దాఖలు కాగా, వైసీపీ తరఫున 1వెయ్యి815 మంది, జనసేన నుంచి 679 మంది, బీజేపీ నుంచి 255 మంది రేసులో నిలిచారు.
