విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరి శుక్రవారం కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు అత్యంత భక్తిశ్రద్ధలతో పట్టువస్త్రాలు, సారెను సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు.దీనికి ముందు ఇంద్రకీలాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయ మర్యాదలతో సీఎం దంపతులను గర్భాలయానికి తీసుకుని వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు, భువనేశ్వరి.. ఏపీ ప్రజలందరూ సుభిక్షంగా, సిరిసంపదలతో వర్ధిల్లుతూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకున్నారు.దర్శనం ముగిసిన తర్వాత వేద పండితులు సీఎం దంపతులకు వేదాశీర్వచనం అందజేశారు. అలాగే అమ్మవారి తీర్థప్రసాదాలను, ప్రత్యేక జ్ఞాపికను వారికి బహుకరించారు. ప్రతి ఏటా దసరా నవరాత్రుల వేళ ప్రభుత్వ లాంఛనాలతో సీఎం స్వయంగా అమ్మవారికి పట్టువస్త్రాలు…
Author: Sai Durga
చరిత్ర పుటల్లో మరుగున పడిన ఒక ఆసక్తికరమైన కథను బిగ్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తూ రాహుల్ సాంకృత్యాయన్ సృష్టించిన విజువల్ వండర్ రణబాలి థియేటర్ల వద్ద రచ్చ చేస్తోంది. బ్రిటిష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్ పెట్టిన చిత్రహింసలను, ప్రజల ఆకలి కేకలను ఎదిరించే పాలెగాడిగా విజయ్ దేవరకొండ రణబాలిలో జీవించేశాడు.జయమ్మగా రష్మిక పర్ఫార్మెన్స్, విజయ్ ,రష్మిక మధ్య కెమిస్ట్రీ సినిమాకు మేజర్ ప్లస్. డైరెక్టర్ రాహుల్ డీటైలింగ్‌తో పాటు ఆర్నాల్డ్ వోస్లూ విలనిజం, ప్రొడక్షన్ వాల్యూస్ అదరగొట్టేశాయి.మైథలాజికల్ టచ్ ఉన్న భద్ర మల్లన్న దేవుడికి, రణబాలికి ఉన్న లింక్ ఏంటనేది కథలో మంచి హైలెట్ పాయింట్ అయింది.సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రాణం పోసిందనే చెప్పొచ్చు. 1850ల నాటి వాతావరణాన్ని, గుహల్లో జరిగే యాక్షన్ సీక్వెన్సులను కెమెరాలో క్యాప్చర్ చేసిన నిజంగానే తీరు వండర్ఫుల్. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ కథకు తగ్గట్లుగా హై రేంజ్లో ఉన్నాయి. అజయ్-అతుల్ పాటలు బాగున్నా,…
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రాసెస్‌పై రాజకీయ వివాదాలు ముదురుతుండటంతో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. కొంతకాలంగా సర్ నిర్వహణలో చోటుచేసుకున్న టెక్నికల్ లోపాలు, అభ్యంతరాలను సరిదిద్దే మెయిన్ టార్గెట్‌తో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, తమిళనాడుతో పాటు మొత్తం 17 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ (SIR) ప్రారంభించాలంటూ గురువారం రాత్రి సంచలన ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఓటు హక్కు పొందే పద్దెనిమిదేళ్లవారితో పాటు, టెక్నికల్ రీజన్స్ లేదా ఇతర ఇబ్బందుల వల్ల గత జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులందరికీ ఇది ఒక గొప్ప అవకాశం కాబోతుంది.ఈ తాజా రివిజన్ కోసం 2027 జనవరి 1న అర్హత గడువుగా ఈసీ అధికారికంగా నిర్ణయించింది. ఈసీ రిలీజ్ చేసిన కొత్త టైమ్‌లైన్ ప్రకారం, రాబోయే నవంబర్ 12వ తేదీన ముసాయిదా ఓటర్ల లిస్ట్‌ను ప్రచురిస్తారు. ఆ తర్వాత…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతి రోజు లక్షలాది వెహికల్స్‌తో కిటకిటలాడే అత్యంత కీలకమైన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–65) రూపురేఖలు ఇకపై మారబోతున్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అడ్డుకట్ట వేసేలా ప్రస్తుత 4 వరుసల హైవేను 6 వరుసలుగా విస్తరించే బృహత్తర ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి.చౌటుప్పల్, నల్గొండ, సూర్యాపేట మీదుగా సాగే ఈ రోడ్డు మార్గంలో జర్నీని మరింత ఈజీ చేయడానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలో కసరత్తు జరుగుతోంది. ఢిల్లీలో ఎన్హెచ్ఏఐ ఛైర్మన్ సంతోష్‌కుమార్ యాదవ్‌తో జరిగిన చర్చల వల్ల.. నవంబర్ 11వ తేదీలోగా టెండర్ల ప్రాసెస్‌ను పూర్తి చేసి 2027 జనవరి నాటికి పనులను గ్రౌండింగ్ చేసేలా పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దాదాపు 270 నుంచి 275 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉన్న ఈ మార్గంలో ప్రధాన హైవేతో పాటు రెండు వైపులా సర్వీసు రోడ్లను డెవలప్ చేయడం ద్వారా వెహికల్స్…
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండువగా సాగుతున్నాయి. దసరా నవరాత్రులలోనే అత్యంత పవిత్రమైనదిగా భావించే మూలా నక్షత్రం వేడుక సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు విజయవాడ కనక దుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించబోతున్నారు. సీఎం రాక అలాగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు కొండపై అత్యున్నత స్థాయి భద్రతతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కలిగేలా దుర్గమ్మ ఆలయ పాలకమండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మూలా నక్షత్రం రోజు ప్రతీ క్యూలైన్‌లోనూ ఉచిత దర్శనాలనే అమలు చేయాలని నిర్ణయించారు. రద్దీ కంట్రోల్ కోసం అంతరాలయ దర్శనాలతో పాటు అన్ని…
ప్రముఖ పారిశ్రామికవేత్త, బైరా ఫౌండేషన్ అధినేత శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి బుధవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకు ఉపముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నరసరావుపేట ప్రాంతానికి చెందిన శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి ప్రజారాజ్యం పార్టీ తరఫున గతంలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మొదటి నుంచి మెగా కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన ఆయన జనసేన పార్టీతోనూ కొన్ని రోజులు ప్రయాణం చేసిన అనంతరం వ్యాపార కార్యకలాపాల్లో బిజీ అయ్యారు. మళ్లీ రాజకీయంగా చురుగ్గా జనసేన పార్టీలోనే తన కార్యకలాపాలను కొనసాగించాలని నిశ్చయించుకొని బుధవారం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా శ్రీ దిలీప్ చక్రవర్తి తాను రచించిన “Life Hacks” పుస్తకాన్ని శ్రీ పవన్…
ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన వెంటనే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు స్పీడందుకున్నాయి. దీనిలో భాగంగానే టీడీపీ, జనసేన నాయకుల మధ్య జరిగిన కీలక భేటీలు ఫలప్రదమయ్యాయని, లోకల్ పోరులో పోటీకి సంబంధించి చర్చలు సఫలమయ్యాయని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. అమరావతిలో సీఎం నారా చంద్రబాబుతో జనసేన ముఖ్య నేతల సమావేశం ముగిసిన తర్వాత బొలిశెట్టి మీడియాతో మాట్లాడారు. తమ మధ్య సీట్ల కోసం ఇంటర్నల్ గొడవలు జరుగుతున్నాయనే నెగిటివ్ సంకేతాలకు చెక్ పెట్టే విధంగానే తాము పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నామని క్లారిటీ ఇచ్చారు. ప్రతి నాయకుడు, కార్యకర్త మనోభావాలను కూడా గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూటమి విజయమే టార్గెట్‌గా తామంతా సింగిల్ అజెండాతోనే ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే బొలిశెట్టి తెలిపారు. మరో రెండు రోజుల్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ…
తక్కువ వర్షపాతంలోనూ మెరుగైన దిగుబడులకు అవకాశం ఉందని ఎల్ఎస్ఆర్ సీడ్స్ రీజినల్ బ్రాంచ్ మేనేజర్ వి. రమణారెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామంలో రైతు శంకర్ పొలంలో ఎస్బీ 459 మొక్కజొన్న పంట క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విత్తన రకం తక్కువ పంటకాలంలోనే చేతికి రావడంతో పాటు, కొన్ని రకాల పురుగులను తట్టుకునే లక్షణాలు కలిగి ఉందన్నారు. దీంతో క్రిమిసంహారక మందుల ఖర్చులు తగ్గే అవకాశం ఉందని వివరించారు. కంకులు వలుచుట సులభంగా ఉండటంతో కూలీల ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. త్వరగా పంట కోతకు రావడం వల్ల తదుపరి పంట సాగుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. రైతులు తమ ప్రాంతంలోని నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, సాగునీటి లభ్యతను బట్టి విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీ మంజునాథ ట్రేడర్స్‌కు చెందిన వి. కుమార్ గౌడ్, కంపెనీ ఏరియా…
ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సమయంలో..రాష్ట్ర రాజకీయాల్లో వేగం ఒక్కసారిగా పెరిగింది. విజయవాడ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ముద్ర ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. మంగళగిరిలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో రాధా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు తిరుపతికి చెందిన ప్రణీత్ ప్రమోద్ కూడా ఇదే వేదికపై జనసేనలో కండువాను కప్పుకున్నారు. మరోవైపు ఏపీ ఎన్నికల సంఘం లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం, సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాసరావు , ఇతర కూటమి నేతలు సీట్ల సర్దుబాటుపై ఫైనల్ కసరత్తు జరుపుతుండగానే ఈ చేరిక జరగడం ఏపీ పాలిటిక్స్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే టార్గెట్‌గా జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని చెప్పడానికి వంగవీటి రాధా ఎంట్రీనే…
ఇకపై రోజువారీగా వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో అత్యంత కీలకమైన మలుపు తిరిగింది. దాదాపు పదేళ్లకు పైగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈ హైప్రొఫైల్ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసుల విచారణ ఇకపై మరింత స్పీడప్ కానుంది. ఈ కేసులను ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రోజువారీగా (Day-to-day) విచారించాలని సంబంధిత సీబీఐ స్పెషల్ న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో పాటు ఈ కేసుల్లో భాగమైన మరో 70 మందికి పైగా నిందితులను ఇక పర్సనల్‌గా విచారించడానికి కోర్టు ఏర్పాట్లు చేస్తోంది.పదేళ్లుగా జగన్‌పై ఉన్న దాదాపు 9 ఈడీ ఛార్జిషీట్లు , సీబీఐ కేసులు కోర్టులో పెండింగ్‌లోనే ఉంటూ వస్తున్నాయి. నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై సరైన టైమ్‌లో…