భారతీయ సినిమా రేంజ్‌ను మరో మెట్టు ఎక్కించడానికి డార్లింగ్ ప్రభాస్ సరికొత్త పీరియాడిక్ వార్ యాక్షన్ విజువల్ ఫీస్ట్‌తో వస్తున్నారు . హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రెస్టీజియస్ మూవీ ‘ఫైల్ నెం.25 : ఫౌజీ’ నుంచి ఒరిజినల్ గ్లింప్స్ తాజాగా రిలీజ్ కాగా, అందులోని గ్రాండియర్ చూసి మూవీ లవర్స్ ఫిదా అయిపోతున్నారు.
రెండు శతాబ్దాల నాటి భారత స్వాతంత్య్ర పోరాట పరిస్థితులను చాలా నేచురల్‌గా, కళ్లు చెదిరే విజువల్స్‌తో పిక్చరైజ్ చేసిన తీరు సోషల్ మీడియాలో మైండ్ బ్లాకింగ్ వ్యూస్‌ను సాధిస్తోంది.
ఈ గ్లింప్స్‌లో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి స్టోరీ లైన్‌ను ఎంచుకోవడం మెయిన్ ప్లస్ పాయింట్ అయింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ ఫేస్ టు ఫేస్ మాట్లాడే సీన్ ..స్టోరీలోని తీవ్రతను ఎలివేట్ చేసింది. భారత దేశంపై హిట్లర్ చేసిన కామెంట్లకు నేతాజీ ఇచ్చిన కౌంటర్ సీన్ థియేటర్లలో విజిల్స్ వేయించేలా కనిపిస్తోంది.
అంతేకాదు ఈ మూవీలో బ్రిటీష్ నెట్‌వర్క్‌ను ఒంటిచేత్తో గడగడలాడించిన గూఢచారి, స్ట్రాటజిస్ట్ ‘ఫౌజీ’గా ప్రభాస్‌ను ప్రెజెంట్ చేసిన విధానం ఆడియన్స్ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది.
హిస్టరీలో హిట్లర్ ఎనిగ్మా అనే కోడ్ ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. అయితే దానికి డిఫరెంట్ మన ఫౌజీ భగవద్గీతలోని శ్లోకాల ఆధారంగా డిజైన్ చేసిన సీక్రెట్ కోడ్‌ను ఛేదించలేక బ్రిటీష్ ఇంటెలిజెన్స్ సైన్యం చేతులెత్తేయడమనే పాయింట్ అందరిలోనూ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
వీడియో ఎండింగ్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్ తన వాయిస్‌తో ..హే బ్రిటీషర్.. నీ రక్తాన్ని కళ్లజూసి నా దేశ స్వాతంత్య్రాన్ని బలంగా లాక్కుంటానంటూ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ డార్లింగ్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది.
మొత్తంగా హను రాఘవపూడి మేకింగ్ స్టైల్ చూస్తుంటే ఈ మూవీ గ్లోబల్ వైడ్‌గా దుమ్మురేపడం గ్యారంటీ అని అనిపిస్తోంది. ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ 2027 మార్చి 19న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది.
