సిల్వర్ స్క్రీన్‌పై ఒక విప్లవాత్మక కథతో ఆడియన్స్‌కు తెగ నచ్చేసిన నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసింది. థియేట్రికల్ రన్ ముగించుకుని, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అన్ని లాంగ్వెజ్లలో గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కథా నేపధ్యం చాలా డిఫరెంట్‌గా .. ఒక పీరియాడిక్ వాల్స్‌లో సాగే ఈ స్టోరీ ప్రేక్షకులను కట్టిపడేసింది. అసలు ఈ మూవీ ఏ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది, జడల్ పాత్ర వెనుక ఉన్న ఎమోషన్ ఏంటనే స్టోరీలోకి వెళ్తే.. ఈ మూవీ పూర్తిగా 1980ల నాటి సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్‌ను బేస్ చేసుకుని సాగుతుంది. సొసైటీలో ఎలాంటి గుర్తింపు , కనీస పౌరసత్వ హక్కులకు నోచుకోని ‘సవారీ’ అనే ఒక అణగారిన సంచార తెగ ప్రజల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఆ ప్రాంతాన్ని షికంజా మాలిక్’ (మోహన్ బాబు) తన గుప్పెట్లో పెట్టుకుని శాసిస్తూ, ఆ…
Author: Sai Durga
ఏపీ రాజకీయాల్లో ఎన్నికలు వస్తున్నాయంటేనే సరికొత్త ట్విస్టులు, క్షణాల్లో మారిపోయే సీన్లు గుర్తుకొస్తాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల రణరంగంలో కూడా సరిగ్గా అదే జరిగింది. ఎన్నికల పోరు క్లైమాక్స్ కి చేరి కేండిడేట్స్ ఫైనల్ జాబితా కోసం అందరూ వెయిట్ చేస్తున్న సమయంలో.. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు..ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హీట్‌ను ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. మొదట్లో ఏదో కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాల వరకే ఈ అడ్డంకులు పరిమితమవుతాయని అందరూ అనుకున్నారు. కానీ ముందు ముందు లీగల్ కాంప్లికేషన్స్ ఏవీ రాకుండా ఉండటానికి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఏకంగా 100 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం ఎన్నికల ప్రాసెస్‌ను పాజ్ మోడ్‌లోకి నెట్టేస్తూ అఫీషియల్ ఉత్తర్వులను వెలువరించింది. ఈ ఊహించని పరిణామంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 13 బడా మున్సిపల్ కార్పొరేషన్లు, అలాగే 87 మున్సిపాలిటీల్లో ప్రస్తుతం నామినేషన్ల ఉపసంహరణల ఘట్టంతో పాటు…
ఎన్నికల పోరులో ప్రతి ఒక్కరి ఓటు ఎంతో విలువైనదని మనందరికీ తెలిసిందే. బ్యాలెట్ పేపర్ లేదంటే ఈవీఎమ్‌పై ఉండే గుర్తులలో వచ్చే స్వల్ప తేడాలు కూడా అభ్యర్థుల గెలుపోటములను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. సరిగ్గా ఈ అంశాన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్థానిక పోరులో ఈ విషయంలో కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. జనసేన పార్టీ వర్గాలు చేసిన అఫీషియల్ రిక్వెస్ట్‌ను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్, స్వతంత్రులకు కేటాయించే ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి బకెట్, పెన్ స్టాండ్ గుర్తులను తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు వెల్లడించి జనసేన పార్టీకి గుడ్ న్యూస్ వినిపించింది. తమ పార్టీ అధికారిక గుర్తు అయిన గాజు గ్లాసుకు, బకెట్, పెన్ స్టాండ్ సింబల్స్‌కు చాలా దగ్గర పోలికలు ఉండటం వల్ల ఓటింగ్ సమయంలో చాలామంది ఓటర్లు తీవ్ర అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందన్న విషయాన్ని జనసేన ప్రతినిధులు ఎస్ఈసీ దృష్టికి…
వెండితెరపై ఒక ఇతిహాస కావ్యాన్ని ఆవిష్కరించడమంటే సామాన్యమైన విషయం కాదు. అందులోనూ మనందరి గుండెల్లో కొలువైన శ్రీరాముడి కథ అయినప్పుడు, ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే సవాల్‌ను స్వీకరించి, ఇండియన్ మూవీని గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లే ప్రయత్నంలో రామాయణ మూవీ టీమ్ ఎండింగ్ స్టేజ్‌కు వచ్చేసింది. ప్రస్తుతం బుక్‌మైషోలో కనిపించిన 3 గంటల 15 నిమిషాల రన్‌టైమ్ ఇన్ఫో చూసి అందరూ షాక్ అవుతున్నా.. ఈ న్యూస్ సినిమాపై ఉన్న హైప్‌ను ఒక్కసారిగా మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. హిందువుల అత్యంత పవిత్రమైన రామాయణ కథలో ప్రతి సన్నివేశాన్ని ఎంతో సవివరంగా, అందరి మనసుకూ హత్తుకునేలా తెరపై చూపించడానికి ఈ 3 గంటల 15 నిమిషాల రన్‌టైమ్ ఎంతో అవసరమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆడియన్స్ భావోద్వేగాలకు అద్దం పట్టేలా ఈ విజువల్ వండర్‌ను డైరెక్టర్ నితీశ్ తివారీ అత్యంత అద్భుతంగా చెక్కినట్లు తెలుస్తోంది.…
ఏపీ స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను, ఇచ్చిన తీర్పును కొన్ని మీడియా సంస్థలు తమకు అనుకూలమైన కోణంలోకి తిప్పుకుని ప్రచారం చేయడాన్ని న్యాయ నిపుణులు తప్పు పడుతున్నారు. విచారణ సమయంలో ధర్మాసనం తాము ఎలక్షన్ ప్రాసెస్‌కు భంగం కలిగించే ఆలోచనతో ఎలాంటి మాండమస్ ఆర్డర్ ఇవ్వడం లేదు.. నామినేషన్ల లాస్ట్ డేట్‌ని మార్చే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ యూనివర్శల్ ఆర్డర్స్ ఇవ్వకూడదనే భావిస్తున్నామని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రాజ్యాంగ పరిధికి గౌరవం ఇస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అనేది ఇండివిడ్యువాలిటీ కలిగిన సంస్థ అని, వారి అధికార పరిధిలో తాము డైరెక్టుగా జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది. బాధితులు ఎవరైనా ఎస్ఈసీని ఆశ్రయించినప్పుడు ఆ ఫిర్యాదులను ఈసీ తిరస్కరిస్తే, కేండిడేట్స్ తగిన ఆధారాలతో ఆ తర్వాత ‘ఎలక్షన్ పిటిషన్’ దాఖలు చేసుకోవచ్చని లీగల్…
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రాసెస్ వేగంగా జరుగుతున్న సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన ఉత్తర్వులను వెలువరించింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్బంగా శాంతిభద్రతల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అధికార పార్టీ ఒత్తిళ్లు, భయాందోళనల వల్ల చాలా చోట్ల అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేయలేకపోతున్నారంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా ఎలక్షన్స్ జరగడమే ప్రాథమిక సూత్రమని స్పష్టం చేసిన సుప్రీంకోర్ట్.. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేయాల్సిన కేండిడేట్స్ ఫైనల్ లిస్ట్ ప్రచురణను అక్టోబర్ 25, 2026 వరకు వెంటనే వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను (SEC) ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు సమర్పించిన వినతి పత్రాలు, ఆధారాలు, వీడియో క్లిప్పింగులు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను మరింత లోతుగా పరిశీలించాలని సుప్రీంకోర్టు ఎస్ఈసీకి ఆర్డర్ వేసింది. శాంతిభద్రతల లోపాలు నమోదైనా లేదంటే…
వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా అయిన కడపలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రొద్దుటూరు, బద్వేల్, జమ్మలమడుగు, రాయచోటి, రాజంపేట, కమలాపురం మున్సిపల్ పీఠాలను తెలుగు దేశం పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా, ఎర్రగుంట్ల మున్సిపాలిటీని బీజేపీకి కేటాయించింది. దీంతో కడప మున్సిపల్ ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జిల్లాలోని మెజారిటీ మున్సిపాలిటీలు కూటమి అకౌంట్లోకి ఏకగ్రీవంగా చేరడంపై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ ఏకగ్రీవాల వెనుక ప్రజామోదం ఏమీ లేదని, కేవలం అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు మాత్రమే ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి నేతలు భయాందోళనలు సృష్టించి తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, చాలా చోట్ల అధికారులపై ఒత్తిడి తెచ్చి నామినేషన్ పత్రాలను అక్రమంగా తిరస్కరింపజేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కేవలం బెదిరింపులు, భౌతిక దాడులతో తమను ఎన్నికల రౌండ్ నుంచి తప్పించలేరని వైసీపీ నేతలు చెబుతున్నారు.…
మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న దృశ్యకావ్యం ‘రామాయణ’. ఇప్పటికే ఈ ట్రైలర్లో యశ్ గంభీరమైన గొంతు, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన ఆడియన్స్ ఫిదా అయిపోగా.. తాజాగా మేకర్స్ విడుదల చేసిన రావణ తాండవం సాంగ్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేసింది. దసరా సందర్భంగా విడుదల చేసిన ఈ ప్రత్యేక వీడియోలో యశ్ లుక్స్, శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే శివ తాండవం విజువల్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. ఈ పాటకి సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అందించిన ఆర్కెస్ట్రా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో స్థాయికి తీసుకెళ్లాయి. అంతేకాకుండా ఈ సాంగ్‌కు సౌత్‌కు చెందిన ముగ్గురు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు గొంతు కలపడం మరో సంచలనానికి తెరతీసింది. తెలుగులో దేవీశ్రీ ప్రసాద్ ఈ పాటను పాడగా, తమిళ వెర్షన్‌ను అనిరుధ్, జీవీ ప్రకాశ్ కుమార్ కాంబోలో రికార్డ్ చేశారు. ఒకే పాటలో ఇంతమంది మ్యూజిక్ సెన్సేషన్స్ భాగమవ్వడంపై…
బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం, తన రికార్డులను తానే బ్రేక్ చేసుకోవడం సూపర్ స్టార్ రజనీకాంత్‌కే చెల్లింది. దసరా పండుగ సందర్బంగా.. థియేటర్లలోకి వచ్చిన లేటేస్ట్ మూవీ ‘జైలర్ 2’ ఫస్ట్ డే నుంచే కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ. 541 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ రారాజు తానేనని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. అద్భుతమైన వసూళ్లతో 2026 సంవత్సరంలో అత్యధిక రాబడి సాధించిన ఇండియన్ మూవీల లిస్ట్‌లో ‘జైలర్ 2’ టాప్ దిశగా దూసుకుపోతోంది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆరో రోజు అయిన మంగళవారం కూడా తగ్గేదేలే అన్నట్లు రూ. 45.55 కోట్ల నెట్ వసూలు చేసింది. దీంతో దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 287.80 కోట్లకు (దాదాపు రూ. 337 కోట్ల గ్రాస్) చేరాయి. పండుగ సెలవుల కలిసిరావడం ఈ మూవీకి పెద్ద…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే సామాన్య భక్తులకు టీటీడీ ఒక తీపి వార్త అందించింది. ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో ఎన్నికలు జరిగే చోట ఎలక్షన్ మోడల్ కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో తిరుమల క్షేత్రంలో వీఐపీల సిఫార్సు లెటర్స్ ఆధారంగా ఇచ్చే శ్రీవారి దర్శనాలు, గదుల కేటాయింపును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు అఫీషియల్ ప్రకటన రిలీజ్ చేశారు. సాధారణంగా తిరుమలలో ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇచ్చే లెటర్స్ వల్ల వీఐపీ బ్రేక్ దర్శనాల కోటా పెరిగిపోయి, గంటల కొద్దీ లైన్లలో వేచి ఉండే సామాన్యులకు చాలా ఆలస్యం జరుగుతుండేది. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో ఎలాంటి సిఫార్సు లెటర్స్ స్వీకరించబోమని టీటీడీ తెగేసి చెప్పింది. దీనివల్ల ఆయా వీఐపీ కోటాలన్నీ రద్దయి, డైరెక్టుగా సాధారణ క్యూలైన్లలో వచ్చే భక్తుల కోసమే ఆ దర్శన సమయాలు కూడా అందుబాటులోకి…