ఏపీలో మున్సిపల్ ఎలక్షన్ పోలింగ్ డేట్ మారడంతో ఉద్యోగుల సెలవు దినంపై కార్మిక శాఖ అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లోని వివిధ షాపులు, వాణిజ్య సంస్థలు , ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు నవంబర్ 1న శాలరీతో కూడిన సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం తాజాగా జీవోను జారీ చేసింది. నిజానికి ఈ పోలింగ్‌ను మొదట అక్టోబర్ 28న జరపాలని భావించినా , అనివార్య కారణాల వల్ల ఆ డేట్‌ని నవంబర్ 1కి మార్చడంతో సెలవు విషయంలో కూడా మరోసారి కొత్తగా ఆదేశాలు వెలువడ్డాయి.
ఏపీలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు , నగర పంచాయతీల పరిధిలో ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా జరగనున్నాయి. ప్రతీ కార్మికుడు, ఉద్యోగి ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ ప్రజాస్వామ్య హక్కును నూటికి నూరు శాతం వినియోగించుకుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు చెప్పారు. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం-1988లోని సెక్షన్ 31(2) రూల్స్‌కు లోబడి ఈ ఆదేశాలు అమలవుతాయని తెలిపారు.
దీనికి ముందు అక్టోబర్ 28వ తేదీకి సెలవును ప్రకటిస్తూ జారీ చేసిన పాత ఉత్తర్వులను పూర్తిగా కేన్సిల్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పుడు దాని స్థానంలో నవంబర్ 1 ఆదివారాన్ని మాత్రమే పెయిడ్ హాలిడేగా పరిగణించాలని క్లారిటీ ఇచ్చారు. ఈ రూల్స్‌ను క్షేత్రస్థాయిలో ఎక్కడా తేడాలు రాకుండా పకడ్బందీగా అమలు చేయాలని ఏపీలోని అన్ని జిల్లాల జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు ఉన్నతాధికారులు చెప్పారు.
