Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Saturday, October 17
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»తెలంగాణ»మీసం మెలేసి.. సీఎం అవుతారా..?
    తెలంగాణ

    మీసం మెలేసి.. సీఎం అవుతారా..?

    LalithaBy LalithaOctober 17, 2026Updated:October 17, 2026No Comments3 Mins Read28 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    కేటీఆర్ సీఎం వ్యూహం
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    రాజేష్ ఖ‌న్నాలా ఉండేవాడు.. అమీర్ ఖాన్‌లా సిగ్గుప‌డేవాడు.. అలాంటిది ఒక్కసారే ర‌ణ‌వీర్ సింగ్ అయిపోయాడు. దురంధ‌ర్ లెవెల్లో ఎలివేష‌న్ ఇవ్వాల‌ని ఫిక్స్ అయిపోయిన‌ట్లున్నాడు. అందుకే పైకి ఏ క‌వ‌రింగ్ చేసుకున్నా.. రాబోయే ఎన్నిక‌ల ర‌ణ‌రంగం కోసం గెట‌ప్ మార్చే ప‌నిలో కేటీఆర్ ప‌డ్డారనేది అర్ధ‌మైపోతుంది. ఎందుకంటే దీని వెన‌క ఓ క‌థ ఉంది. దాని కోసం కొంచెం ఫ్లాష్ బ్యాక్ కి వెళ‌దాం.

    మామూలుగా తెలంగాణ హైద‌రాబాద్ నుంచి పైన ఉత్త‌ర తెలంగాణ వ‌ర‌కు కొంచెం నార్త్ క‌ల్చ‌ర్ అల‌వాటు అవుతుంది. అందుకే ఎక్కువ‌మంది క్లీన్ షేవ్ ఇష్ట‌ప‌డ‌తారు. నార్త్ ఇండియ‌న్స్ లాగా గెడ్డం పెంచకుండా మీసం తీసేసి ఉంటారు. అలాగే కేటీఆర్.. క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు కూడా. ఉద్య‌మం జ‌రిగే స‌మ‌యంలో అమెరికా నుంచి వ‌చ్చేసి రంగంలోకి దిగారు. అప్ప‌టికే కేసీఆర్ దూకుడు మీదుంటే.. హ‌రీష్ రావు నెంబ‌ర్ టు గా ఉన్నారు. కేటీఆర్ రావ‌డం.. అప్ప‌టికే క‌విత ఎంట్రీ ఇవ్వ‌డంతో ఉద్య‌మానికి కేసీఆర్ వార‌సుల క‌ల‌రింగ్ వ‌చ్చింది.

    ఉద్య‌మం అయిపోయి.. తెలంగాణ వ‌చ్చాక‌.. అధికారంలోకి రావ‌డంతో ఆ క‌ల‌ర్ మ‌రింత గూలాబీమ‌య‌మైపోయింది. కేటీఆర్ మంత్రి కావ‌డం… క‌విత ఎంపీ కావ‌డం చూశాం. కేటీఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ బిజినెస్ మైండ్ కావ‌డం.. అలాగే తండ్రి లాగే టాకింగ్ ప‌వ‌ర్ మ‌స్తుగా ఉండటంతో.. ప‌వ‌ర్‌లో చెల‌రేగిపోయారు. బిజినెస్ స‌ర్కిల్స్‌లో గ‌ట్టిగా పాగా వేసేశారు. ఇక ఐటీ మంత్రిగా విదేశాల్లోనూ చ‌క్రం తిప్పేశారు. పైగా ప‌దేళ్ల పాటు అధికారంలో ఉండ‌టంతో గ‌ట్టిగానే సెటిలైపోయారు.

    రెండో సారి అధికారంలోకి వ‌చ్చాక కేటీఆర్ దాదాపు కేసీఆర్‌కు ప్ర‌త్యామ్నాయంగా క‌న‌ప‌డ్డారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఇవ్వ‌డంతో వార‌సుడిగా క‌న్ఫమ్ అయిపోయారు. మూడోసారి కూడా గెలుస్తాం.. ఈసారి కేటీఆర్ సీఎం అని ఆయ‌న వ‌ర్గం గ‌ట్టిగా ఫీలైంది. కాని వీరి ఆశ‌ల‌కు రేవంత్ రెడ్డి గండి కొట్టారు. అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. అదే కేటీఆర్‌కు కూడా క‌లిసొచ్చింది. అవును ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టం వ‌ల్లే ప‌వ‌ర్ ముసుగులు పోయి… జ‌నంలోకి రావ‌డం మొద‌లెట్టారు. మాట తీరులో స్ట‌యిల్ పోయి.. మాస్ వ‌చ్చేసింది. కేసులు వ‌రుస‌గా భ‌య‌పెడుతున్నా ఎదురుదాడి చేస్తూ కేటీఆర్ ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు.

    పోను పోను రేవంత్ ప్ర‌భుత్వంపై అసంతృప్తి పెరుగుతుండ‌టం.. అది వ్య‌తిరేక‌త దిశ‌గా వెళుతుండ‌టంతో కేటీఆర్ దూకుడు పెంచారు. మ‌రోవైపు క‌విత బ‌య‌ట‌కు వెళ్లి ఎన్ని బండ‌లేసినా పెద్ద ఎఫెక్ట్ ప‌డ‌లేదు. పైగా హ‌రీష్ రావును టార్గెట్ చేయ‌డంతో కేటీఆర్‌కి బీఆర్ఎస్‌లో ఎదురు లేకుండా పోయింది. కేసీఆర్ ఉన్నా ఇమేజ్ లాగా మాత్ర‌మే.. యాక్టివ్ గా తిర‌గ‌లేని ప‌రిస్దితి. కేసీఆర్ బ్రెయిన్ వాడుకుంటూ కేటీఆర్ క‌థ న‌డిపిస్తార‌ని అర్ధ‌మైపోయింది.

    అయితే రేవంత్, కేటీఆర్‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం మ‌నం చూస్తూనే ఉన్నాం. అందులో రేవంత్ రెడ్డి ఊర మాస్ డైలాగులు వేసేస్తారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రేవంత్ రెడ్డి కేటీఆర్ క్లీన్ షేవ్ మీద కామెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి ఎప్పుడూ గ‌డ్డంతోను, మెలితిప్పిన మీసాల‌తోనూ ఉంటారు. దీంతో ఛాలెంజులు చేసేట‌ప్పుడు వాటిని వాడుతూ ఉంటారు. ఆ అవ‌కాశం కేటీఆర్ కి లేకుండా పోయింది.

    ఇప్పుడు రాబోయే ఎన్నిక‌ల కోసం రెండేళ్ల ముందే కేటీఆర్ బాగా ప్రిపేర్ అయిపోతున్నారు. ఇప్ప‌టికే యుద్ధం జ‌రుగుతున్న ఫీలింగ్ మ‌న‌కొస్తుంది. గ‌తంలో కేటీఆర్ పై కేవ‌లం అమెరికా నుంచి అధికారం కొట్టేశాడు. అధికారంలో పెత్త‌నం చేసి.. అవినీతితో బాగా సంపాదించారనే ఆరోప‌ణ‌లు గ‌ట్టిగా ఉన్నాయి. ఇప్ప‌టికీ అవే కాంగ్రెస్ వాడుతుంటోంది. అందుకే ఆ ఇమేజ్ బ్రేక్ చేయ‌డానికి కేటీఆర్ క్లాస్ టు మాస్ మారిపోతున్నార‌ని తెలుస్తోంది. ఇక నిత్యం జ‌నంలో ఉండాలి.. అలాగే అవ‌స‌ర‌మైతే పాద‌యాత్ర చేయాల‌ని కూడా ప్లాన్ ఉంది. అందుకే గెట‌ప్ మారుస్తున్నార‌ని స‌మాచారం.

    నోటి దాకా వ‌చ్చిన సీఎం పోస్టు 2023లో పోయింది. అందుకే ఈసారి మీసం మెలేసి మ‌రీ ఛాలెంజ్ చేసి సీఎం అవ్వాల‌ని గ‌ట్టిగా స్ట్రాట‌జీలు వ‌ర్క‌వుట్ చేస్తున్నారు. ప‌రిస్ధితులు కూడా కాస్త అనుకూలంగానే క‌న‌ప‌డుతున్నాయి. కేంద్రంలో బీజెపీ వీక్ అయి.. కాంగ్రెస్ బ‌ల‌ప‌డితే.. ఆ ఎఫెక్ట్ తెలంగాణ‌పై ప‌డితే.. కాస్త మార్పు ఉండొచ్చు.. లేదంటే కేటీఆర్ సీఎం కావ‌డానికి పుష్క‌లంగా అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. మ‌రిక లేటెందుకు గులాబీ రాజా మీసం మెలేయ్ .

    కేటీఆర్ తెలంగాణ బీఆర్ఎస్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    వంగ‌వీటి వార్ వ‌న్ సైడేనా..!

    October 17, 2026

    విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా..

    October 17, 2026

    పుంగనూరు నామినేషన్ల రణరంగంలో జరిగిందేంటి?

    October 17, 2026

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026

    కావ్య మారన్,అనిరుధ్ పెళ్లి కబురు..

    October 17, 2026

    వైసీపీకి షాకిచ్చిన ఛైర్‌పర్సన్ అభ్యర్థి..

    October 17, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202683 Views

    రాధాకు మంచి రోజులు.. ఇక‌నైనా

    October 15, 202658 Views
    డోన్'ట్ మిస్

    వంగ‌వీటి వార్ వ‌న్ సైడేనా..!

    October 17, 2026

    రాధా బ‌రిలోకి దిగ‌డంతో విజ‌య‌వాడ మేయ‌ర్, కార్పొరేష‌న్ రెండూ వార్ వ‌న్ సైడే న‌డుస్తాయ‌ని సామాన్య జ‌నం సైతం కామెంట్లు…

    విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా..

    October 17, 2026

    పుంగనూరు నామినేషన్ల రణరంగంలో జరిగిందేంటి?

    October 17, 2026

    మీసం మెలేసి.. సీఎం అవుతారా..?

    October 17, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202683 Views

    రాధాకు మంచి రోజులు.. ఇక‌నైనా

    October 15, 202658 Views
    ఔర్ పిక్స్

    వంగ‌వీటి వార్ వ‌న్ సైడేనా..!

    October 17, 2026

    విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా..

    October 17, 2026

    పుంగనూరు నామినేషన్ల రణరంగంలో జరిగిందేంటి?

    October 17, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.