Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, November 17
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»నేషనల్»నకిలీ పోలీస్ స్టేషన్‌నే క్రియేట్ చేసిన దొంగలు..
    నేషనల్

    నకిలీ పోలీస్ స్టేషన్‌నే క్రియేట్ చేసిన దొంగలు..

    LalithaBy Lalitha15/11/2026Updated:16/11/2026No Comments2 Mins Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    బీహార్‌లో హోటల్‌లో ఏర్పాటు చేసిన నకిలీ పోలీస్ స్టేషన్
    పోలీసులుగా నటిస్తూ ఎనిమిది నెలల పాటు మోసాలకు పాల్పడిన ముఠా.
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    దొంగతనం చేయాలంటే చీకటిని ఎంచుకుంటారు.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటారు. కానీ బీహార్‌లో కొందరు మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన దారిని ఎంచుకున్నారు. పోలీసులకు భయపడుతూ దాక్కోవాల్సిన అవసరం లేకుండా.. ఏకంగా తామే పోలీసుల అవతారం ఎత్తారు. అంతటితో ఆగకుండా ఒక నకిలీ పోలీస్ స్టేషన్‌(Fake police station)ను కూడా ఏర్పాటు చేశారు.

    అందులో డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుళ్ల హోదాలతో సిబ్బందిని నియమించుకున్నారు. నిజమైన పోలీస్ స్టేషన్‌ను తలపించేలా సెటప్‌, కుర్చీలు, యూనిఫామ్‌లు, కంప్లైంట్‌లు తీసుకునే సిస్టంను సిద్ధం చేశారు. ఇలా సుమారు 8 నెలల పాటు సాగిన ఈ నకిలీ పోలీస్ స్టేషన్(Fake police station) వ్యవహారం చివరకు అసలు పోలీసుల దృష్టికి రావడంతో బట్టబయలైంది.

    హోటల్‌లోనే పోలీస్ స్టేషన్ ఏర్పాటు..

    ఈ విచిత్రమైన ఘటన బీహార్‌లోని బంకా (Banka) ఏరియాలో వెలుగుచూసింది. సాధారణంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ అనుమతులు, అధికారుల నియామకాలు, అధికారిక భవనం వంటి ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. కానీ ఈ ముఠా మాత్రం అలాంటి నిబంధనలేవీ పట్టించుకోకుండా ఒక హోటల్‌లోనే నకిలీ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. బయటకు చూస్తే అది నిజమైన పోలీస్ స్టేషన్‌లాగే కనిపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

    డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుళ్లుగా కొందరు వ్యక్తులు వ్యవహరించారు. పోలీసుల మాదిరిగానే యూనిఫాంలు ధరించడం, పోలీస్‌ స్టేషన్‌లో కుర్చీలు ఏర్పాటు చేయడం, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం వంటి పనులు చేసేవారు. ఈ ఏర్పాట్లన్నీ చూసినవారికి అక్కడ నకిలీ పోలీస్ స్టేషన్ నడుస్తోందనే అనుమానం కలగడం కష్టంగా ఉండేది.

    ఫిర్యాదుల పేరుతో డబ్బుల వసూలు

    ఈ ముఠా టార్గెట్ ప్రజలకు న్యాయం చేయడం కాదు.. పోలీసుల పేరుతో డబ్బులు సంపాదించడమే. తమ వద్దకు ఫిర్యాదు చేయడానికి వచ్చే వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరికి ఆశ చూపించి మోసాలకు పాల్పడేవారు. అధికారుల్లా నటిస్తూ ప్రజల నమ్మకాన్ని సంపాదించి, అదే నమ్మకాన్ని తమ అక్రమాలకు ఉపయోగించుకున్నారు.

    ఒక సాధారణ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది యూనిఫాంలో ఉండటం, పోలీస్‌ స్టేషన్‌ అధికారికంగా కనిపించడం చూసి సహజంగానే నమ్ముతారు. ఈ ముఠా కూడా ప్రజల ఈ నమ్మకాన్నే ఆసరాగా చేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన వాతావరణాన్ని ఆర్టిఫిషియల్‌గా సృష్టించి, అమాయకులను మోసం చేసింది.

    ఎనిమిది నెలల తర్వాత బయటపడిన అసలు రంగు

    ఇలా సుమారు ఎనిమిది నెలల పాటు నకిలీ పోలీస్ స్టేషన్ కార్యకలాపాలు కొనసాగినట్లు సమాచారం. అయితే చివరకు అసలు పోలీసులకు ఈ వ్యవహారంపై అనుమానం రావడంతో విచారణ చేపట్టారు. దీంతో పోలీసుల అవతారంలో తిరుగుతున్న వ్యక్తుల అసలు స్వరూపం బయటపడింది. పోలీస్ స్టేషన్ పేరుతో సాగుతున్న మోసాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

    ఈ ఘటనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నకిలీ పోలీస్ స్టేషన్ నిజమైన పోలీస్ స్టేషన్‌కు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉండటం మరో విశేషం. ఇంత సమీపంలోనే ఇలాంటి వ్యవహారం నెలల తరబడి కొనసాగడం షాక్ కలిగిస్తోంది.

    ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం

    ఈ ఘటన ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. యూనిఫాం వేసుకున్న ప్రతి ఒక్కరూ నిజమైన పోలీసు అధికారులు కాకపోవొచ్చు. గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామనే హామీలు ఇచ్చేవారిని, ఫిర్యాదుల పరిష్కారం పేరుతో డబ్బులు అడిగేవారిని నమ్మకూడదు. ఏదైనా పోలీస్ స్టేషన్ లేదా అధికారులపై డౌట్‌ వస్తే సంబంధిత అధికారిక పోలీస్ శాఖ ద్వారా వివరాలు కన్ఫమ్ చేసుకోవాలి.

    ప్రజల భద్రత కోసం ఉండాల్సిన పోలీస్ వ్యవస్థనే మోసానికి వేదికగా మార్చడం ఈ ఘటనలోని అసలు ఆందోళనకరమైన అంశం. చట్టాన్ని కాపాడాల్సిన అధికారుల వేషంలోనే చట్టాన్ని ఉల్లంఘిస్తే, సాధారణ ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.

    బీహార్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    మండల యాత్రకు శబరిమల ఆలయం సిద్ధం

    16/11/2026

    మేక మాంసం తింటే తప్పు కాదు ఆవు మాంసం తింటే తప్పా? శోభా డే కామెంట్లపై సోషల్ మీడియాలో రచ్చ..

    16/11/2026

    సీనియర్ నటుడు గిరిబాబు అస్తమయం

    14/11/2026

    కాకినాడ మేయర్ ఎన్నికల వేడి

    14/11/2026

    సర్పంచ్ కుర్చీకి కోట్లు ఖర్చు చేస్తామంటున్న ఆశావహులు..

    14/11/2026

    రామ్‌లీలా మైదానంలో నిరసనలపై కొత్త రూల్స్

    14/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026422 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    మండల యాత్రకు శబరిమల ఆలయం సిద్ధం

    16/11/2026

    కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వార్షిక మండల-మకరవిళక్కు యాత్ర సీజన్ సందర్భంగా నవంబర్ 16న సాయంత్రం 5…

    మేక మాంసం తింటే తప్పు కాదు ఆవు మాంసం తింటే తప్పా? శోభా డే కామెంట్లపై సోషల్ మీడియాలో రచ్చ..

    16/11/2026

    నకిలీ పోలీస్ స్టేషన్‌నే క్రియేట్ చేసిన దొంగలు..

    15/11/2026

    సీనియర్ నటుడు గిరిబాబు అస్తమయం

    14/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026422 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    మండల యాత్రకు శబరిమల ఆలయం సిద్ధం

    16/11/2026

    మేక మాంసం తింటే తప్పు కాదు ఆవు మాంసం తింటే తప్పా? శోభా డే కామెంట్లపై సోషల్ మీడియాలో రచ్చ..

    16/11/2026

    నకిలీ పోలీస్ స్టేషన్‌నే క్రియేట్ చేసిన దొంగలు..

    15/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.