ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రాసెస్ వేగంగా జరుగుతున్న సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన ఉత్తర్వులను వెలువరించింది.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్బంగా శాంతిభద్రతల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అధికార పార్టీ ఒత్తిళ్లు, భయాందోళనల వల్ల చాలా చోట్ల అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేయలేకపోతున్నారంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది.
ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా ఎలక్షన్స్ జరగడమే ప్రాథమిక సూత్రమని స్పష్టం చేసిన సుప్రీంకోర్ట్.. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేయాల్సిన కేండిడేట్స్ ఫైనల్ లిస్ట్ ప్రచురణను అక్టోబర్ 25, 2026 వరకు వెంటనే వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను (SEC) ఆదేశించింది.
ఈ కేసు విచారణ సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు సమర్పించిన వినతి పత్రాలు, ఆధారాలు, వీడియో క్లిప్పింగులు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను మరింత లోతుగా పరిశీలించాలని సుప్రీంకోర్టు ఎస్ఈసీకి ఆర్డర్ వేసింది.
శాంతిభద్రతల లోపాలు నమోదైనా లేదంటే నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నట్లు ఆధారాలు ఉంటే..ఆ పట్టణాలు, వార్డులలో నామినేషన్ల గడువును పెంచాలా లేదా అనే అంశంపై అక్టోబర్ 22, 2026 నాటికి ఏపీ ఎన్నికల సంఘం సమగ్ర నిర్ణయాన్ని తీసుకోవాలని ఆదేశించింది.
ఒకవేళ ఏవైనా స్థానాల్లో నామినేషన్ల టైమ్‌ను పొడిగిస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటే కనుక, ఆ నిర్ణయాన్ని అఫీషియల్‌గా ప్రకటించిన సమయం నుంచి ఆయా వార్డులలో కేండిడేట్స్‌కు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి కనీసం 48 గంటల ఎక్స్ట్రా టైమ్‌ను తప్పనిసరిగా ఇవ్వాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
