మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న దృశ్యకావ్యం ‘రామాయణ’. ఇప్పటికే ఈ ట్రైలర్‌లో యశ్ గంభీరమైన గొంతు, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన ఆడియన్స్ ఫిదా అయిపోగా.. తాజాగా మేకర్స్ విడుదల చేసిన రావణ తాండవం సాంగ్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేసింది. దసరా సందర్భంగా విడుదల చేసిన ఈ ప్రత్యేక వీడియోలో యశ్ లుక్స్, శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే శివ తాండవం విజువల్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి.
ఈ పాటకి సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అందించిన ఆర్కెస్ట్రా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో స్థాయికి తీసుకెళ్లాయి. అంతేకాకుండా ఈ సాంగ్కు సౌత్‌కు చెందిన ముగ్గురు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు గొంతు కలపడం మరో సంచలనానికి తెరతీసింది.
తెలుగులో దేవీశ్రీ ప్రసాద్ ఈ పాటను పాడగా, తమిళ వెర్షన్‌ను అనిరుధ్, జీవీ ప్రకాశ్ కుమార్ కాంబోలో రికార్డ్ చేశారు. ఒకే పాటలో ఇంతమంది మ్యూజిక్ సెన్సేషన్స్ భాగమవ్వడంపై సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులలో ఓ రేంజ్‌లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.
స్టార్ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ అతి పెద్ద బడ్జెట్ మూవీలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడుగా , సాయిపల్లవి సీతాదేవిగా నటిస్తుండగా, ఇతర కీలక పాత్రల్లో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్, రవి దూబే నటిస్తున్నారు.
ఇక రావణుడిగా యశ్ నట విశ్వరూపాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూడటానికి బాక్సాఫీస్ లవర్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ మూవీ నవంబరు 5న దీపావళి శుభ సమయంలో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
