సిల్వర్ స్క్రీన్‌పై ఒక విప్లవాత్మక కథతో ఆడియన్స్‌కు తెగ నచ్చేసిన నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసింది. థియేట్రికల్ రన్ ముగించుకుని, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో అన్ని లాంగ్వెజ్‌లలో గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ మూవీ కథా నేపధ్యం చాలా డిఫరెంట్‌గా .. ఒక పీరియాడిక్ వాల్స్‌లో సాగే ఈ స్టోరీ ప్రేక్షకులను కట్టిపడేసింది. అసలు ఈ మూవీ ఏ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది, జడల్ పాత్ర వెనుక ఉన్న ఎమోషన్ ఏంటనే స్టోరీలోకి వెళ్తే.. ఈ మూవీ పూర్తిగా 1980ల నాటి సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్‌ను బేస్ చేసుకుని సాగుతుంది. సొసైటీలో ఎలాంటి గుర్తింపు , కనీస పౌరసత్వ హక్కులకు నోచుకోని ‘సవారీ’ అనే ఒక అణగారిన సంచార తెగ ప్రజల జీవితాల చుట్టూ తిరుగుతుంది.
ఆ ప్రాంతాన్ని షికంజా మాలిక్’ (మోహన్ బాబు) తన గుప్పెట్లో పెట్టుకుని శాసిస్తూ, ఆ తెగ ప్రజలను బానిసలుగా చూస్తుంటాడు. ఆయన కొడుకు విక్రమ్ మాలిక్ (రాఘవ్ జుయల్) కలిసి ఆ ప్రాంతంలో చేసే అణచివేతలు పీక్స్‌కి వెళ్తాయి.
ఆ తెగకు చెందిన సమ్మక్క (సోనాలి కులకర్ణి) అనే సాహస మహిళ మొదటిసారి అక్కడ తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుంది. ఆమె అడుగుజాడల్లో నడుస్తూ, ఆ మాలిక్ కుటుంబపు అరాచకాలను ఎదురించడానికి ఆమె కొడుకు ‘జడల్’ (నాని) రంగంలోకి దిగుతాడు.
తన జాతి ప్రజల ఆత్మగౌరవం, హక్కుల కోసం జడల్ సాగించిన ఈ రక్తపాత పోరాటమే ది ప్యారడైజ్ అసలు సిసలైన స్టోరీ. శ్రీకాంత్ ఓదెల టేకింగ్, నాని రా అండ్ రస్టిక్ పెర్ఫార్మెన్స్, మోహన్ బాబు యాక్షన్ సినిమాకు మెయిన్ పిల్లర్లుగా నిలిచాయి. థియేటర్లలో మిస్ అయిన వారంతా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మాస్ అండ్ ఎమోషనల్ రైడ్‌ను ఎంజాయ్ చేసేయొచ్చు.
