Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, November 24
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»వైసీపీ మద్దతుతో జనసేన వైస్ ఛైర్మన్ కైవసం
    ఆంధ్ర ప్రదేశ్

    వైసీపీ మద్దతుతో జనసేన వైస్ ఛైర్మన్ కైవసం

    LalithaBy Lalitha24/11/2026Updated:24/11/2026No Comments2 Mins Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    నిడదవోలు వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో జనసేన విజయం
    నిడదవోలు వైస్ ఛైర్మన్ ఎన్నికతో జనసేన, టీడీపీ మధ్య రాజకీయ వివాదం.
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలో మిత్రపక్షాలైన జనసేన, టీడీపీ మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పక్కన పెట్టి, వైసీపీ సభ్యుల సాయంతో వైస్ ఛైర్మన్ పదవిని జనసేన దక్కించుకోవడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. నవంబర్ 24వ తేదీ సోమవారం జరిగిన ఎన్నికల్లో జనసేన కౌన్సిలర్ కళ్యాణ చక్రవర్తి, టీడీపీ అభ్యర్థి కొమ్మిన వెంకటేశ్వరరావుపై గెలుపొందారు.

    ఈ పరిణామాలకు ముందు జనసేనకు చెందిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ మురాల జ్యోతితో పాటు 32 మంది వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నిర్వహించిన వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో నాలుగో వార్డు కౌన్సిలర్ కళ్యాణ చక్రవర్తికి 18 ఓట్లు దక్కగా, టీడీపీ అభ్యర్థికి 13 ఓట్లు మాత్రమే వచ్చాయి. కళ్యాణ చక్రవర్తి విజయంలో జనసేన పార్టీకి చెందిన 15 మందితో పాటు బీజేపీకి చెందిన ఒకరు, వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడం గమనార్హం.

    ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 32 వార్డుల ఫలితాలను చూస్తే జనసేన 14, టీడీపీ 13, వైసీపీ 3, బీజేపీ 1 చోట గెలవగా, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ విజయం సాధించారు. ముందస్తు అంగీకారంతో ఛైర్మన్ సీటు జనసేనకు, వైస్ ఛైర్మన్ పదవి టీడీపీకి ఇవ్వాల్సి ఉంది. అయితే ఎన్నికల సమయంలో సమీకరణలు మారడంతో ఈ వివాదం మొదలైంది.

    ఈ వ్యవహారంపై టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కందుల దుర్గేశ్ హామీ ఇచ్చినా కూడా జనసేన నేతలు మాట తప్పారని టీడీపీ సీనియర్ నేత, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆరోపించారు. ఒప్పందాన్ని అమలు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.

    మరోవైపు స్వయంగా మంత్రి దుర్గేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి రావడంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీనిపై మంత్రిని వివరణ కోరగా, స్థానిక నేతలతో మాట్లాడి అధిష్ఠానం నిర్ణయాన్ని అమలు చేస్తానని మంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నిక ఫలితం వచ్చిన వెంటనే టీడీపీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు సభ నుంచి వాకౌట్ చేశారు.

    ఆంధ్రప్రదేశ్ జనసేన పవన్ కళ్యాణ్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    తగ్గిన రామాయణం మూవీ టికెట్ ధర..

    24/11/2026

    జనసేనకు కూటమిలో అవమానాలేనా? పవన్ మౌనమే పార్టీకి బలహీనతగా మారుతోందా?

    24/11/2026

    ఇది నా అడ్డా..చిరు టాక్ షో ప్రోమోతో పెరిగిన బజ్

    24/11/2026

    26 ఏళ్ల తర్వాత ‘గోల్డ్ స్పాట్’ రీ-లాంచ్..

    24/11/2026

    రామాయణ పార్ట్ 1 రికార్డుల వేట

    24/11/2026

    బెంగళూరులో షర్మిల ఎంట్రీతో పొలిటికల్ హైడ్రామా

    22/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    తగ్గిన రామాయణం మూవీ టికెట్ ధర..

    24/11/2026

    నితేష్ తివారీ డైరెక్షన్‌లో వచ్చిన రామాయణం బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్ల మైలురాయి దిశగా వేగంగా సాగుతోంది. దీపావళి సందర్భంగా…

    జనసేనకు కూటమిలో అవమానాలేనా? పవన్ మౌనమే పార్టీకి బలహీనతగా మారుతోందా?

    24/11/2026

    ఇది నా అడ్డా..చిరు టాక్ షో ప్రోమోతో పెరిగిన బజ్

    24/11/2026

    వైసీపీ మద్దతుతో జనసేన వైస్ ఛైర్మన్ కైవసం

    24/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    తగ్గిన రామాయణం మూవీ టికెట్ ధర..

    24/11/2026

    జనసేనకు కూటమిలో అవమానాలేనా? పవన్ మౌనమే పార్టీకి బలహీనతగా మారుతోందా?

    24/11/2026

    ఇది నా అడ్డా..చిరు టాక్ షో ప్రోమోతో పెరిగిన బజ్

    24/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.