చరిత్ర పుటల్లో మరుగున పడిన ఒక ఆసక్తికరమైన కథను బిగ్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తూ రాహుల్ సాంకృత్యాయన్ సృష్టించిన విజువల్ వండర్ రణబాలి థియేటర్ల వద్ద రచ్చ చేస్తోంది. బ్రిటిష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్ పెట్టిన చిత్రహింసలను, ప్రజల ఆకలి కేకలను ఎదిరించే పాలెగాడిగా విజయ్ దేవరకొండ రణబాలిలో జీవించేశాడు.జయమ్మగా రష్మిక పర్ఫార్మెన్స్, విజయ్ ,రష్మిక మధ్య కెమిస్ట్రీ సినిమాకు మేజర్ ప్లస్. డైరెక్టర్ రాహుల్ డీటైలింగ్‌తో పాటు ఆర్నాల్డ్ వోస్లూ విలనిజం, ప్రొడక్షన్ వాల్యూస్ అదరగొట్టేశాయి.మైథలాజికల్ టచ్ ఉన్న భద్ర మల్లన్న దేవుడికి, రణబాలికి ఉన్న లింక్ ఏంటనేది కథలో మంచి హైలెట్ పాయింట్ అయింది.సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రాణం పోసిందనే చెప్పొచ్చు. 1850ల నాటి వాతావరణాన్ని, గుహల్లో జరిగే యాక్షన్ సీక్వెన్సులను కెమెరాలో క్యాప్చర్ చేసిన నిజంగానే తీరు వండర్ఫుల్. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ కథకు తగ్గట్లుగా హై రేంజ్లో ఉన్నాయి. అజయ్-అతుల్ పాటలు బాగున్నా, బీజీఎం మన నేటివిటీకి ఇంకాస్త సింక్ అవ్వాల్సిందన్న ఫీల్‌ను మాత్రం ఇస్తున్నాయి.గతంలో సైరా వంటి చిత్రాలు చూసిన వారికి ఇందులో కొన్ని సన్నివేశాలు కాస్త తెలిసినట్లే అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో పెంచిన అంచనాలను సెకండాఫ్‌లో పూర్తిగా నిలబెట్టుకోవడంలో కథనం కాస్త నెమ్మదించిందనే అనాలి. చిన్న చిన్న ల్యాగ్ పాయింట్లను కాస్త పక్కన పెడితే.. విజయ్ కెరీర్లోనే ఓ మంచి అటెంప్ట్‌గా, బలమైన ఎమోషన్స్ ఉన్న మంచి పీరియాడిక్ మూవీగా ‘రణబాలి’ మూవీ అందరికీ పక్కా నచ్చుతుంది.
