అనంతపురంలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. పాలిటిక్స్‌లో టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తనదైన శైలిలో మరోసారి ప్రకంపనలను సృష్టించారు. జిల్లా కేంద్రంలో జేసీ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలను, ప్రస్తుత ఫలితాలతో పోలుస్తూ ఆయన ఈ ఫ్లెక్సీలను ప్రదర్శించారు.
వైసీపీ వైఖరిని ఎండగడుతూ ఫ్లెక్సీలపై కళ్లు దొబ్బాయా? అంటూ సంధించిన ప్రశ్నలు అనంతపురం రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను టార్గెట్ చేసిన జేసీ.. మీకు కళ్లు, చెవులు పనిచేస్తే ఈ ఫలితాలను చూడండంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఫ్లెక్సీల ఆవిష్కరణ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy).. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై కూడా ఫైర్ అయ్యారు. జగన్ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ప్రతిష్ఠలను కూడా పూర్తిగా దిగజార్చారంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని చెప్పిన జేసీ.. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచిన వారికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.
అనంతపురం జిల్లా ప్రగతి పథంలో సాగాలంటే అనంత వెంకట్రామిరెడ్డి వెంటనే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని జేసీ డిమాండ్ చేశారు. అంతేకాదు నైతికత ఉంటే వైసీపీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులంతా కూడా తమ పదవులను స్వచ్ఛందంగా వదులుకోవాలని సవాల్ విసిరారు. సిటీ డెవలప్మెంట్ కోసం కొత్త మేయర్ రమేశ్‌గౌడ్ పార్టీ మారితే మంచిదంటూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు అనంతపురం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
