తక్కువ వర్షపాతంలోనూ మెరుగైన దిగుబడులకు అవకాశం ఉందని ఎల్ఎస్ఆర్ సీడ్స్ రీజినల్ బ్రాంచ్ మేనేజర్ వి. రమణారెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామంలో రైతు శంకర్ పొలంలో ఎస్బీ 459 మొక్కజొన్న పంట క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విత్తన రకం తక్కువ పంటకాలంలోనే చేతికి రావడంతో పాటు, కొన్ని రకాల పురుగులను తట్టుకునే లక్షణాలు కలిగి ఉందన్నారు. దీంతో క్రిమిసంహారక మందుల ఖర్చులు తగ్గే అవకాశం ఉందని వివరించారు. కంకులు వలుచుట సులభంగా ఉండటంతో కూలీల ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. త్వరగా పంట కోతకు రావడం వల్ల తదుపరి పంట సాగుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. రైతులు తమ ప్రాంతంలోని నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, సాగునీటి లభ్యతను బట్టి విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీ మంజునాథ ట్రేడర్స్కు చెందిన వి. కుమార్ గౌడ్, కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ రాజశేఖర్ గౌడ్, పరిసర గ్రామాల రైతులు పాల్గొన్నారు.
