తెలుగు ఇండస్ట్రీలో మరో స్టార్ కిడ్ ఎంట్రీ ఇచ్చేసింది. సీనియర్ హీరో శ్రీకాంత్, నటి ఊహ.. ముద్దుల కూతురు మేధ ఇప్పుడు అందరినీ సడన్‌గా సర్ప్రైజ్ ఎంట్రీ ఇస్తూ డైరెక్టుగా వెండితెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే శ్రీకాంత్ కొడుకు.. రోషన్ హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతుంటే, ఇప్పుడు చెల్లెలు మేధ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ బ్యూటీ గురించే హాట్ హాట్ చర్చ నడుస్తోంది. అంతేకాదు అచ్చం పక్కా లవ్ స్టోరీతో వస్తున్న మేధ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు టాలీవుడ్లో ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయింది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీతో రాజమండ్రి రోజ్ మిల్క్ ఫేమ్.. జై జాస్తి హీరోగా చేస్తున్నాడు. ఇక ఈ పిక్చర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్…
Author: Point News Point News
ఏపీ రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కూటమి ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. కొంతమంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంతో పాటు.. మరికొందరికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ అధికారికంగా నిర్ణయాన్ని తీసుకుంది. దీనిపై సాధారణ పరిపాలన శాఖ జీవో ఆర్టీ నెంబర్ 1985 ద్వారా కొత్త పోస్టింగ్‌ల జీవోను రిలీజ్ చేసింది. ఈ ఆదేశాలన్నీ వెంటనే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సౌరభ్ గౌర్‌ను రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్‌కు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా పంపించగా, డి. మురళీధర్ రెడ్డికి.. గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. అలాగే ఆమ్రపాలిని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగానూ నియమిస్తూ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మంజులే బాలాజీ దిగంబర్ను ..ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిగానూ నియమించారు. మరికొన్ని ప్రధానమైన పోస్టింగ్‌ల వివరాలలోకి వెళ్తే.. యువజన సేవల డైరెక్టర్‌గా కె.…
BANDIKE SRINIVASULU, 8 ఎళ్లుగా ముచ్చుమర్రిమల్యాల లింక్ కెనాల్ తవ్వకం పనులు పెండింగ్,ఈ కాలువ తవ్వకం పూర్తిఅయితే శ్రీశైలం నుంచి సీమ జిల్లాలకు రోజు 3,850 క్యూసెక్ల నీటిని తరలించవచ్చు…పెండింగ్ పనుల వ్యవహారాన్ని టి.డి.పీ ఎమ్మేల్లేలు సియం దష్టికి తీసుకువెళ్లితే సీమ జిల్లాలకు సాగు,తాగునీరు..కర్నూలు, సీమ జిల్లాలకు సాగు,తాగునీటిని అందించేందుకు చేపట్టిన పథకాల నిర్మాణాలు ఎళ్ల తరబడి అసంపూర్తిగా నిలిచిపోయాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన పథకాలను వైసీపీ ప్రభుత్వ హాయంలో పూర్తిచేసేందుకు చొరవచూపలేకపోయారు. అత్యవసర సమయాలల్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని సీమ జిల్లాలకు తరలించేందుకు చేపట్టిన పథకాలను పూర్తిచేయలేకపోయారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కాలువకు మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి సీమ జిల్లాలకు సాగు,తాగునీటిని అందించాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు 834 అడుగుల పైబడిన నీటిని మాత్రమే కాల్వకు ఎత్తిపోయటం సాధ్యపడుతుంది. 834 అడుగుల నీటిమట్టం కంటే దిగువకు నీటినిల్వలు పడిపోతే మల్యాల…
KUMAR CHAND PULLAGURA బెజవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ దసరా ఉత్సవాలు ఎవరికోసం..? సామాన్య భక్తుల కోసమేనా..? అన్న ప్రశ్న వేస్తే అందుకు ఠక్కున వచ్చే సమాధానం హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులకు మాత్రమే అని వస్తుంది. అలాగే దుర్గ గుడి ఉత్సవాల్లో విధులు నిర్వహించాలన్నా.. అందుకు దుర్గ గుడి ట్రస్ట్ బోర్డ్, దుర్గ గుడి ఈవో పచ్చ జెండా ఉపాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో దుర్గ గుడి చిక్కుకుంది. హై లెవల్ రికమండేషన్లు ఓ వైపు వీరి వద్ద వర్కౌట్ అవుతుంటే.. మరోవైపు అధికారం ఉన్న జిల్లా అధికారులు తమ ఇష్టానుసారం విధులు నిర్వహించేందుకు ఇవ్వాల్సిన పాసులపై నియంత్రణను చేస్తూ ఈ ఏడాది విమర్శలకు లోను అయ్యేలా చేస్తోంది. మరో విషయం ఏంటంటే.. అస్సలు దుర్గ గుడికి సంబంధం లేకుండా ఎటువంటి ఉద్యోగం దుర్గ గుడిపై లేని ప్రయివేట్ వ్యక్తులకు డ్యూటీ పాస్ లను జారీ చెయ్యటం ఏంటో తనకేం…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ తానే సీఎం అవుతానన్న వ్యాఖ్యలపై తాజాగా చర్చ మొదలైంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ నేత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని, దీనికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆశీస్సులు ఉన్నాయని సూచించినట్లు వచ్చిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో కాంగ్రెస్ భవిష్యత్ నాయకత్వంపై ఊహాగానాలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పెరుగుతున్నాయని భావిస్తున్న ప్రజావ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకత్వం ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తోందని కొందరు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పనితీరు, అవినీతి ఆరోపణలు కూడా రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తున్నాయి. అయితే ఇవి ఎన్నికల ఫలితాలను ఖరారు చేసే అంశాలు కావు. గతంలో తెలంగాణలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో, పార్టీ నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. మరోవైపు మైనారిటీలు, వామపక్ష భావజాలం కలిగిన వర్గాలు, యువత, మహిళల మద్దతు పార్టీకి ఉపయోగపడవచ్చని మరికొందరు భావిస్తున్నారు.…
ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం (AP VROs Association) 2026–2029 కాలానికి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. విజయవాడ రెవెన్యూ భవన్లో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వీఆర్వోలు పాల్గొన్నారు. ఎలాంటి పోటీ లేకుండా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కోన ఆంజనేయ కుమార్ (చంటి), ప్రధాన కార్యదర్శిగా ఎం. బాపూజీ ఎన్నికయ్యారు. సహ అధ్యక్షుడిగా టి. శ్రీనివాసరావు, ఉపాధ్యక్షురాలిగా జి. అనుపమ, ప్రచార కార్యదర్శిగా జి. దిల్లేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కే. సాహితి ఎన్నికయ్యారు. APRSA రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వీఆర్వోల ఏకగ్రీవ ఎన్నికలు వారి ఐక్యతకు నిదర్శనమన్నారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేయడంలో వీఆర్వోల పాత్ర ముఖ్యమని పేర్కొన్నారు. బాధ్యత, పారదర్శకతతో విధులు నిర్వహించాలని సూచించారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమంతో పాటు ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించడమే తమ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ఘన విజయం సాధించింది. అనూహ్యంగా 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలను కూటమి పార్టీలు గెలుచుకున్నారు. వై నాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు ముగిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాదితో సరిగ్గా రెండున్నరేళ్ల పాలనను చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఎలా ఉంది..? మరోసారి కూటమి విజయం గెలుస్తుందా..? రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసే ఉంటాయా.. లేక విడిపోతాయా..? మళ్లీ కూటమి అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరుంటారు..? అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారిన ప్రశ్నలు. ఏపీలో 2024 ఎన్నికల…
యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపి, ఎమ్మెల్యే చిత్తూరు, సెప్టెంబర్ 28: కేంద్రం, రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం యువత భవిష్యత్తుకు భరోసా కల్పిస్తోందని, విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉన్నత చదువులపై దృష్టి సారించాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమం సోమవారం చిత్తూరులోని అపోలో యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో భవిష్యత్‌పై నమ్మకం పెంపొందించడం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధంగా వ్యవస్థలను సమర్థవంతంగా నడిపిస్తూ పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పారు. ఎలాంటి అపోహలకు తావులేకుండా నిజాయితీతో ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు…
మేషం: ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తప్పవు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగమున మార్పులు ఉంటాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభ సూచలున్నవి. మిథునం: ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. కర్కాటకం: సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సింహం: వృత్తి ఉద్యోగాలలో కీలక…
మేషం: నూతన విద్యవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆటంకాలు తొలగుతాయి. ఆర్ధికంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. వృషభం: చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున కొంత నిరుత్సాహం తప్పదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మిథునం: దీర్ఘకాలిక ఋణాలు కొంతవరకు తీర్చగలరు. ఆరోగ్యపరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. స్వల్ప ధనప్రాప్తి కలుగుతుంది. కర్కాటకం: ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ లబ్ది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సింహం: ఉద్యోగ వ్యవహారాలలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి పైవారి నుండి ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం…