ఏపీ రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కూటమి ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. కొంతమంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంతో పాటు.. మరికొందరికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ అధికారికంగా నిర్ణయాన్ని తీసుకుంది. దీనిపై సాధారణ పరిపాలన శాఖ జీవో ఆర్టీ నెంబర్ 1985 ద్వారా కొత్త పోస్టింగ్‌ల జీవోను రిలీజ్ చేసింది. ఈ ఆదేశాలన్నీ వెంటనే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి సౌరభ్ గౌర్‌ను రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్‌కు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా పంపించగా, డి. మురళీధర్ రెడ్డికి.. గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. అలాగే ఆమ్రపాలిని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగానూ నియమిస్తూ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మంజులే బాలాజీ దిగంబర్ను ..ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిగానూ నియమించారు.
మరికొన్ని ప్రధానమైన పోస్టింగ్‌ల వివరాలలోకి వెళ్తే.. యువజన సేవల డైరెక్టర్‌గా కె. నీలకంఠ రెడ్డి, పరిశ్రమలు అండ్ ఎంఎస్ఎంఈ( MSME) శాఖ సంయుక్త కార్యదర్శిగా బి. అనిల్ కుమార్ రెడ్డి బాధ్యతలను స్వీకరించనున్నారు.
ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా ..ఎన్. తేజ్ భరత్‌ను, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ ఉప కార్యదర్శిగా గెడెల శ్రీను కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ఇక పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎం.వరప్రసాద్‌ను నియమిస్తూ ఆదేశాలు వచ్చాయి.
వీటితో పాటు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్‌గా కె. శ్రీనివాసులుకు, అలాగే ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా శుభం బన్సాల్‌కు ఏపీ ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించింది. కొత్తగా పోస్టింగ్‌లు పొందిన అధికారులు.. తమ బాధ్యతలను వెంటనే స్వీకరించాల్సిందిగా సర్కార్ పేర్కొంది.
