BANDIKE SRINIVASULU,
8 ఎళ్లుగా ముచ్చుమర్రిమల్యాల లింక్ కెనాల్ తవ్వకం పనులు పెండింగ్,
ఈ కాలువ తవ్వకం పూర్తిఅయితే శ్రీశైలం నుంచి సీమ జిల్లాలకు రోజు 3,850 క్యూసెక్ల నీటిని తరలించవచ్చు…
పెండింగ్ పనుల వ్యవహారాన్ని టి.డి.పీ ఎమ్మేల్లేలు సియం దష్టికి తీసుకువెళ్లితే సీమ జిల్లాలకు సాగు,తాగునీరు..
కర్నూలు, సీమ జిల్లాలకు సాగు,తాగునీటిని అందించేందుకు చేపట్టిన పథకాల నిర్మాణాలు ఎళ్ల తరబడి అసంపూర్తిగా నిలిచిపోయాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన పథకాలను వైసీపీ ప్రభుత్వ హాయంలో పూర్తిచేసేందుకు చొరవచూపలేకపోయారు. అత్యవసర సమయాలల్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని సీమ జిల్లాలకు తరలించేందుకు చేపట్టిన పథకాలను పూర్తిచేయలేకపోయారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కాలువకు మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి సీమ జిల్లాలకు సాగు,తాగునీటిని అందించాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు 834 అడుగుల పైబడిన నీటిని మాత్రమే కాల్వకు ఎత్తిపోయటం సాధ్యపడుతుంది. 834 అడుగుల నీటిమట్టం కంటే దిగువకు నీటినిల్వలు పడిపోతే మల్యాల ఎత్తిపోత్తల పథకం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోయటం కుదరదు…ఈ పరిస్టితులల్లో శ్రీశైలం రిజర్వాయర్ లో 798 అడుగుల వరకు నీటిని ఉపయెగించుటకు ప్రత్యామాయంగా ముచ్చుమర్రి వద్ద 12 పంప్ లతో ముచ్చుమర్రి ఎత్తిపోత్తల పథకాన్ని చేపట్టారు. ఈ పథకాన్ని 22_05_2007లో అప్పటి ప్రభుత్వం అనుమతించింది. ముచ్చుమర్రి ఎత్తిపోత్తల పథకం నుంచి,కేసి కెనాల్ తోపాటు, హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకు నీటిని ఎత్తిపోసేందుకు 16 పంపులను ఎర్పాటుచేశారు. కేసి కెనాల్ కి.మీ 0.00 నుంచి 120 కి.మీ పరిధిలో నున్న 49,440 ఎకరాలు ఆయుకట్టుకు సాగునీటి అవసరాల నిమిత్తం శ్రీశైలం రిజర్వాయర్ పరివాహా ప్రాంతము నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోత్తల పథకం ద్వార 5 టియంసిల నీటిని సరఫరా చేయటంతోపాటు, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వార కాలువకు నీటిని ఎత్తిపోయాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు 834 అడుగులపై బడివుంటే నీటిని తరలించవచ్చు. అంతకంటే 834 అడుగులకంటే నీటినిల్వలు తగ్గితే హంద్రీనీవా కాలువకు నీటివిడుదల సాధ్యంకాదు, ఈ పరిస్టితుల్లో ముచ్చమర్రి ఎత్తిపోత్తల పథకం 12 పంప్ ల ద్వార ముచ్చుమర్రి మల్యాల వరకు 17 కి.మీ పోడవునా కాల్వకు నీటిని ఎత్తిపోస్తే ఆ నీరు మల్యాల పంప్ హాస్ వెనుకభాగానికి చేరుకొంటాయి. మల్యాల పంప్ హాస్ నుంచి హంద్రీనీవా కాల్వకు 3,850 క్యూసెక్ల నీటిని సీమ జిల్లాలకు తరలించాలన్న లక్ష్యంతో ముచ్చుమర్రి ఎత్తిపోత్తల పథకాన్ని నిర్మించారు. అయితే 2007లో చేపట్టిన ఈ పథకాన్ని 2017 అప్పటి సియం నారాచంద్రబాబు నాయుడు చేతులమీదుగా ముచ్చుమర్రి ఎత్తిపోత్తల పథకాన్ని ప్రారంభిచారు. క్రిష్ఝ జలాలను సీమ జిల్లాలకు తరలించాలన్న లక్ష్యంతో నిర్మించిన ముచ్చమర్రి ఎత్తిపోత్తల పథకాన్ని 2017లో ప్రారంభించినా, ఈ ఎత్తిపోత్తల పథకం ద్వార నిర్దేశించిన లక్ష్యం మేరకు 3,850 క్యూసెక్ల నీటిని హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వ ద్వార నీటి నేటివరకు తీసుకునే విధంగా పనులు పూర్తికాలేదు…
2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ముచ్చుమర్రి ఎత్తిపోత్తల పథకం నుంచి శ్రీశైలం రిజర్వాయర్ లో 798 అడుగుల పైబడిఉన్న నీటి నిల్వల నుంచి నీటిని సీమ జిల్లాలకు తరలించాలన్న లక్ష్యంతో ముచ్చుమర్రిమల్యాల లింక్ కెనాల్ నిర్మాణాన్ని 2018 జూన్ నెలలో రూ. 29.12 కోట్లతో చేపట్టారు.
ముచ్చుమర్రి ఎత్తిపోత్తల పథకం 12 పంప్ లద్వార 3,850 క్యూసెక్ల నీటిని తరలించేందుకు 17.77 కి.మీ పోడువునా ముచ్చమర్రి పంప్ హాస్ నుంచి మల్యాల పంప్ హాస్ వెనుక భాగం వరకు ప్రధాన కాల్వను తవ్వాలి. 2018 జూన్ లో ఈ కాల్వ తవ్వకం పనులకు సంబంధించి పనులు ప్రారంభించి, 2018 నాటికే 6నెలలోపు కాల్వ తవ్వకం పనులను పూర్తిచేయాలి. అయితే నిర్దేశించిన గడువు ముగిసి నేటివరకు 8 ఎళ్లు గడుస్తున్నా లింక్ కెనాల్ తవ్వకం 70 శాతము మాత్రమే పూర్తిచేశారు.
కాల్వ తవ్వకం అంచనా వ్యయం 29.12 కోట్ల మొత్తములో 19.63 కోట్ల విలువైన పనిని మాత్రమే పూర్తిచేశారు. మిగిలిన 9.48 కోట్ల విలువైన కాల్వ తవ్వకం పనులు అక్కడక్కడ నిలిచిపోయాయి. . 2018 డిసెంబర్ లో కాల్వ తవ్వకం పనులు 70 శాతము పూర్తికాగా,మిగిలిపోయిన కాలువ తవ్వకం పని విలువ అప్పట్లో రూ. 9.63 కోట్ల కాగా, ప్రస్తుతము పెండింగ్ లో ఉన్న 30 శాతము కాల్వ తవ్వకం పని విలువ అంచనా వ్యయము 14 కోట్లకు చేరుకొంది.
దీంతో అత్యవసర సమయాలల్లో ముచ్చుమర్రి ఎత్తిపోత్తల పథకం, ద్వార ముచ్చుమర్రి_మల్యాల లింక్ కెనాల్ ద్వార హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకు 1,000 క్యూసెక్ల నీటిని తరలించేందుకు మాత్రమే పరిస్టితులు అనుకూలిస్తున్నాయి. వాస్తవంగా ముచ్చుమర్రి_మల్యాల లింక్ కెనాల్ 17.77 కి.మీ పోడువుఉన్న కాల్వ తవ్వకం పనులు పూర్తి అయితే ముచ్చుమర్రి మల్యాల పంప్ హాస్ వెనుక భాగము వరకు 3,850 క్యూసెక్ల నీటని తరలించవచ్చు.
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఎడమగట్టు విద్యుత్ కేంద్రము ద్వార విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూ నీటిని దిగువకు తరలిస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్టాయి నీటినిల్వల 885 అడుగులుకాగా, ప్రస్తుత నీటినిల్వ 844 అడుగులకు పడిపోయాయి.
శ్రీశైలం రిజర్వాయర్ లో నీటినిల్వలు 834 అడుగుల నీటిమట్టానికి పడిపోతే సీమ జిల్లాలకు మల్యాల ఎత్తిపోత్తల పథకం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కాలువకు నీటిని ఎత్తిపోసేందుకు వీలుపడదు.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తాగునీటి పేరిట హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కాలువ ద్వార ఇప్పటివరకు 17 టియంసీల నీటిని తరలించారు. శ్రీశైలం ప్రాజక్టులో ఉన్న నీటినిల్వలనుంచి తెలంగాణా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తే మరో 10 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు 834 అడుగులకు చేరుకొంటాయి. అప్పడు మల్యాల ఎత్తిపోత్తల పథకం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కాల్వకు నీటిని ఎత్తిపోసేందుకు సాధ్యంకాదు.
ఈ పరిస్టితులతోపాటు, ఎల్ ని నో ప్రభావం, మండుతున్న ఎండలు వీటన్నితోపాటు రానున్న రోజుల్లో నీటిని తరలించాలంటే ముచ్చమర్రి_మల్యాల లింక్ కెనాల్ తవ్వకం పనులు పూర్తిచేయిస్తే.. యథావిధిగా ముచ్చుమర్రి నుంచి హంద్రీనీవా కాల్వ ద్వార సీమ జిల్లాలకు రోజుకు 3,850 క్యూసెక్ల నీటిని తరలించవచ్చునని హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు సర్కిల్ 1 ఎస్.ఈ రాజన్ బాబు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
ఇంతటి ప్రాథన్యం ఉన్న ముచ్చుమర్ర్రి_మల్యాల లింక్ కెనాల్ పెండింగ్ పనుల కొసం కూటమీ ప్రభుత్వం 14 కోట్ల రూపాయలను విడుదల చేసి పనులు చేపట్టాలని కూటమీ పార్టీ ఎమ్మేల్లేలు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, కే.ఈ శ్యాంకూమార్ లు కొరుతున్నారు…..
