Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Tuesday, September 29
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»ప్రలోభాలకు లొంగొద్దు… చదువుతోనే భవిష్యత్తు
    ఆంధ్ర ప్రదేశ్

    ప్రలోభాలకు లొంగొద్దు… చదువుతోనే భవిష్యత్తు

    Point News Point NewsBy Point News Point NewsSeptember 29, 2026Updated:September 29, 2026No Comments2 Mins Read5 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపి, ఎమ్మెల్యే

    చిత్తూరు, సెప్టెంబర్‌ 28: కేంద్రం, రాష్ట్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం యువత భవిష్యత్తుకు భరోసా కల్పిస్తోందని, విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉన్నత చదువులపై దృష్టి సారించాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమం సోమవారం చిత్తూరులోని అపోలో యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌తో కలిసి ఎంపీ హాజరయ్యారు.

    ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో భవిష్యత్‌పై నమ్మకం పెంపొందించడం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధంగా వ్యవస్థలను సమర్థవంతంగా నడిపిస్తూ పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పారు. ఎలాంటి అపోహలకు తావులేకుండా నిజాయితీతో ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. యువత తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకుని భవిష్యత్తును స్వయంగా నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.

    ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వ పథకాల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. పరిశ్రమలతో పాటు విద్యాసంస్థలు కూడా ప్రాంతీయ అభివృద్ధికి కీలకంగా మారుతున్నాయని తెలిపారు. అపోలో యూనివర్సిటీ స్థాపనతో మురకంబట్టు ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఇది విద్యా రంగ ప్రాధాన్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. అపోలో యూనివర్సిటీ అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోందని, భవిష్యత్తులో డీమ్డ్ యూనివర్సిటీగా ఎదగడానికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని వెల్లడించారు.

    ఈ కార్యక్రమంలో వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డా. నితిన్ ఎం. నాగార్కర్‌, ప్రో వైస్ ఛాన్సలర్‌ (అకాడెమిక్స్) డా. అల్ఫ్రెడ్ జే. ఆగస్టిన్‌, రిజిస్ట్రార్‌ అనిల్ కుమార్ ఎస్‌, ఏఐఎంఎస్‌ఆర్‌ డీన్‌ డా. రామ్య రామకృష్ణన్‌, యూనిట్ హెడ్ ఎస్‌. బాలరాజ్‌తో పాటు రాజకీయ ప్రముఖులు, వివిధ విభాగాల డీన్లు, ప్రిన్సిపల్స్‌, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    ఆంధ్రప్రదేశ్ దగ్గుమల్ల ప్రసాదరావు
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    పవన్ కళ్యాణ్‌తో రాధాకృష్ణ భేటీ

    September 24, 2026

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026

    ఏపీ స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం

    September 23, 2026

    జర్నలిస్టుల హౌసింగ్‌పై మంత్రి హామీ

    September 23, 2026

    రైలు ఢీకొని నలుగురు యువకులు మృతి

    September 23, 2026

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026229 Views

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 202617 Views

    గండిపేటలో చవితి వేడుకలు.. రూ.3.60 లక్షలకు లడ్డూ వేలం

    September 24, 202615 Views
    డోన్'ట్ మిస్

    ప్రలోభాలకు లొంగొద్దు… చదువుతోనే భవిష్యత్తు

    September 29, 2026

    యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపి, ఎమ్మెల్యే చిత్తూరు, సెప్టెంబర్‌ 28: కేంద్రం, రాష్ట్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం యువత భవిష్యత్తుకు…

    నేటి రాశి ఫలాలు

    September 29, 2026

    నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి

    September 28, 2026

    జాతీయ కార్పెంటర్స్ దినోత్సవం.. 600 మంది కార్పెంటర్లకు సన్మానం

    September 25, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026229 Views

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 202617 Views

    గండిపేటలో చవితి వేడుకలు.. రూ.3.60 లక్షలకు లడ్డూ వేలం

    September 24, 202615 Views
    ఔర్ పిక్స్

    ప్రలోభాలకు లొంగొద్దు… చదువుతోనే భవిష్యత్తు

    September 29, 2026

    నేటి రాశి ఫలాలు

    September 29, 2026

    నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి

    September 28, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.