మేషం: నూతన విద్యవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆటంకాలు తొలగుతాయి. ఆర్ధికంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.
వృషభం: చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున కొంత నిరుత్సాహం తప్పదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
మిథునం: దీర్ఘకాలిక ఋణాలు కొంతవరకు తీర్చగలరు. ఆరోగ్యపరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. స్వల్ప ధనప్రాప్తి కలుగుతుంది.
కర్కాటకం: ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ లబ్ది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
సింహం: ఉద్యోగ వ్యవహారాలలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి పైవారి నుండి ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరప్రాంతాల వారి నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు.
కన్య: సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన లాభం పొందుతారు. ధనాదాయం బాగుంటుంది. అనారోగ్య సూచనలున్నవి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
తుల: వృత్తి ఉద్యోగ విషయమై కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు పరంగా నష్టాల ఊబి నుండి బయటపడతారు.
వృశ్చికం: అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ధనస్సు: వ్యాపార పరంగా ఇబ్బందులు తొలగుతాయి. ధన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు.
మకరం: ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. ఋణ బాధలు తొలగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడగలుగుతారు.
కుంభం: సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాహన కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది.
మీనం: ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. నేత్ర సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయమై అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువుల నుండి విమర్శలు ఎదురవుతాయి.
