పాత తరం జ్ఞాపకాలను తట్టిలేపేలా గోల్డ్ స్పాట్ మళ్లీ మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. 26 ఏళ్ల తర్వాత ఈ బ్రాండ్ తిరిగి వస్తుండటంతో, ఒకప్పటి ఆరెంజ్ డ్రింక్ లవర్స్ ఆసక్తి పెరిగింది. ఈసారి మారుతున్న టేస్ట్‌కు తగ్గట్టుగా లో షుగర్ లేదా షుగర్ ఫ్రీ వేరియంట్లలో దీన్ని తీసుకురావడానికి కోకా కోలా కసరత్తు చేస్తోంది. అంతేకాదు, గోల్డ్ స్పాట్‌కు విపరీతమైన గుర్తింపు తెచ్చిన ..ది జింగ్ థింగ్ ట్యాగ్‌లైన్‌ను కూడా మళ్లీ వాడాలని భావిస్తోంది.
ఈ రీ-లాంచ్ వేళ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతోంది. క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఫోటోను ముద్రించి ఉన్న గోల్డ్ స్పాట్ క్యాన్‌ను ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో గోల్డ్ స్పాట్‌కు ధోనీనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారేమో అనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ధోనీ ఈ బ్రాండ్‌తో యాడ్ అయితే , రీ-ఎంట్రీకి మరింత బూస్ట్ దొరుకుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు బెవరేజెస్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2025-26లో రూ.1.40 లక్షల కోట్లుగా ఉన్న ఈ మార్కెట్, 2030-31 నాటికి రూ.2.56 లక్షల కోట్లకు ఎదగొచ్చని అంచనాలు చెబుతున్నాయి. దీంతో పాత నాస్టాల్జియాను, కొత్త హెల్త్ ట్రెండ్‌ను కలిపి కోకా-కోలా తీసుకురాబోతున్న గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్ లవర్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
