బుల్లితెరపై కొద్ది నెలల క్రితం నయా ట్రెండ్‌ను క్రియేట్ చేసిన జయమ్ము నిశ్చయమ్మురా.. విత్ జగపతి టాక్ షో రెండో సీజన్ మళ్లీ గ్రాండ్‌గా షురూ కాబోతోంది. ప్రతి ఎపిసోడ్లో సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి, రేర్‌గా బయటకు వచ్చే జ్ఞాపకాలను బయటకు తీస్తూ..ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని పంచడం ఈ షో స్పెషాలిటీ. నాగార్జున, శ్రీలీలతో ముగిసిన ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్లో మాత్రం నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చి రచ్చ లేపడానికి రెడీ అవబోతోంది. హోస్ట్ జగపతిబాబు అడిగే ట్రెండీ అండ్ ఫ్రెండ్లీ క్వశ్చన్స్‌కి సాయి పల్లవి చెప్పే సిన్సియర్ ఆన్సర్స్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటాయని నిర్వాహకులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.ముఖ్యంగా రామాయణ చిత్రంలో సీత రోల్‌ను సాయి పల్లవి పోషిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఆమెపైన ఉండే క్రేజ్.. అమితమైన ప్రేమ మరింతగా పెరిగిపోయాయి.
ప్రేక్షకులు మా సీత అని సాయి పల్లవిని ఆప్యాయంగా పిలుచుకుంటున్న సమయంలో.. ఈ సినిమా ఎనౌన్స్మెంట్ తర్వాత ఆమె ఇస్తున్న తొలి ఇంటర్వ్యూ ఇదే కావడంతో ఆడియన్స్‌లో మరింత ఇంట్రస్ట్ పెరిగిపోయింది. రియల్ లైఫ్‌లో కూడా ఎంతో నిజాయితీగా, ఆత్మీయంగా ఉండే సాయి పల్లవి.. తన సినీ జర్నీలో ఎదురైన మలుపులు, మరచిపోలేని సంఘటనలను ఈ షోలో పంచుకోబోతోంది. జగపతిబాబు మార్క్ కామెడీ అండ్ ఆత్మీయ సంభాషణలతో సాగే ఈ ఫుల్ క్రేజీ ఎపిసోడ్ అక్టోబర్ 16వ తేదీన జీ5 డిజిటల్ ప్లాట్ఫామ్లో, అలాగే అక్టోబర్ 18 వ తేదీ ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కాబోతోంది.
