పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుపాను తీరం వైపు అత్యంత స్పీడ్‌గా దూసుకొస్తూ ఏపీ వాసులను భయాందోళనకు గురి చేస్తోంది. కొన్ని గంటలుగా ఇది గంటకు 20 కి.మీ వేగంతో పశ్చిమ, వాయవ్య దిశగా ప్రయాణం చేస్తూ తీవ్రతను మరింత పెంచుకుంటోంది.
అక్టోబర్ 27వ తేదీన ఉదయానికి విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 220 కి.మీటర్లు, కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 240 కి.మీటర్లు, మచిలీపట్నానికి 340 కి.మీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఈ తుపాను క్రమంగా వాయవ్య దిశగా పయనించి అక్టోబర్ 28వ తేదీ, 2026 ఉదయానికి బాపట్ల – విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరాన్ని దాటనుందని వాతావరణ శాఖ అధికారులు అధికారికంగా ధ్రువీకరించింది.
తీరం దాటే క్లిష్ట సమయంలో అర్నాబ్ అత్యంత బలమైన పెను తుపానుగా మారి చెంది గంటకు 125 నుంచి 135 కి.మీటర్ల వేగంతో, గరిష్టంగా 150 కి.మీటర్ల భయానక వేగంతో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉంది. దీనికితోడు నైరుతి బంగాళాఖాతంలోని శ్రీలంక తీరం నుంచి ఈ తుపాను కేంద్రం వరకు సముద్ర మట్టానికి 3.1 కి.మీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది.
అలాగే దక్షిణ తమిళనాడు తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా ఈ ద్రోణితో కలిసిపోవడంతో వాతావరణ వ్యవస్థ చాలా అల్లకల్లోలంగా మారింది. ఈ పరిణామాల వల్ల సముద్రం తీవ్రంగా క్షోభించడమే కాకుండా తీరప్రాంతాల్లో అలల ఉధృతి ఊహించని స్థాయికి చేరుకోనుంది.
ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాగల 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం దారుణంగా మారనుందని అమరావతి వాతావరణ కేంద్రం కొన్ని ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.అలాగే కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ కుంభవృష్టి నమోదు కానుంది.
తీరం వెంబడి గంటకు 90 – 110 కి.మీటర్ల వేగంతో పెద్ద గాలులు వీచే అవకాశముంది. మరోవైపు రాయలసీమలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఇక తెలంగాణపై కూడా దీని ప్రభావం ఉండటంతో రాబోయే మూడు రోజులు ఏపీ వ్యాప్తంగా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలందరూ తమ ప్రయాణాలను వాయిదా వేసుకుని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.
