Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Friday, September 25
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»తెలంగాణ»జాతీయ కార్పెంటర్స్ దినోత్సవం.. 600 మంది కార్పెంటర్లకు సన్మానం
    తెలంగాణ

    జాతీయ కార్పెంటర్స్ దినోత్సవం.. 600 మంది కార్పెంటర్లకు సన్మానం

    Point News Point NewsBy Point News Point NewsSeptember 25, 2026Updated:September 25, 2026No Comments2 Mins Read9 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    జాతీయ కార్పెంటర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్షన్ టెస్సా సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఆర్‌.ఆర్‌.ఆర్ కన్వెన్షన్‌లో గురువారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 600 మంది కార్పెంటర్లను ఘనంగా సన్మానించారు. కార్పెంటర్ల సేవలను గుర్తిస్తూ ‘‘టెస్సా సలాం’’తో పాటు ‘‘సంఘ్ సంఘ్ చలే ఆగే బడే’’ అనే నినాదాన్ని వారికి అంకితం చేశారు.

    ఈ కార్యక్రమంలో యాక్షన్ టెస్సా వైస్ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ పాండే, జనరల్ మేనేజర్ డాక్టర్ వై. జనార్దన్ రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ బి.ఆర్.వి. మూలా రెడ్డి, సీనియర్ ఏరియా సేల్స్ మేనేజర్ డి. నాగార్జున రెడ్డి, స్థానిక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎ. కరుణాకర్, యాక్షన్ టెస్సా ఉత్పత్తుల అధీకృత డిస్ట్రిబ్యూటర్ శ్రీ శ్రీనివాస ప్లైవుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ తల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    కార్పెంటర్ల కోసం నాలుగు ప్రత్యేక పథకాలు

    కార్పెంటర్స్ డే సందర్భంగా యాక్షన్ టెస్సా ఉత్పత్తులను ఉపయోగించే కార్పెంటర్ల సంక్షేమం కోసం సంస్థ నాలుగు ప్రత్యేక పథకాలను ప్రకటించింది.

    రూ.2 లక్షల ప్రమాద బీమా: కార్పెంటర్ల భద్రత కోసం రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది.

    కుమార్తె వివాహానికి సహాయం: యాక్షన్ టెస్సా బోర్డుతో తయారు చేసిన ఫర్నిచర్‌పై కుమార్తె వివాహానికి రూ.50 వేల వరకు సహాయం అందించనున్నట్లు పేర్కొంది.

    పిల్లల ఉన్నత విద్యకు స్కాలర్‌షిప్: కార్పెంటర్ల పిల్లల ఉన్నత విద్య కోసం రూ.11 వేల స్కాలర్‌షిప్ సహాయం అందించనున్నట్లు తెలిపింది.

    మూడు నెలల శిక్షణా కోర్సు: కుటుంబ సభ్యుల కోసం టెస్సా, ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో మూడు నెలల శిక్షణా కోర్సును నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. సుమారు రూ.50 వేల విలువైన ఈ కోర్సులో వసతి సౌకర్యంతో పాటు, కోర్సు పూర్తయిన అనంతరం ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు.

    126 ఎకరాల్లో నూతన తయారీ యూనిట్

    ఈ సందర్భంగా యాక్షన్ టెస్సా జనరల్ మేనేజర్ డాక్టర్ వై. జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. విశాఖపట్నం–అనకాపల్లి సమీపంలోని రాంబిల్లిలో 126 ఎకరాల విస్తీర్ణంలో నూతన తయారీ యూనిట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని కార్పెంటర్లతో పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్పెంటర్ల అభివృద్ధి, సంక్షేమం కోసం సంస్థ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

    జాతీయ కార్పెంటర్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి కార్పెంటర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ వృత్తికి గుర్తింపు కల్పిస్తూ నిర్వహించిన సన్మాన కార్యక్రమం, సంక్షేమ పథకాల ప్రకటన పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

    khammam తెలంగాణ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    22A భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్

    September 24, 2026

    గండిపేటలో చవితి వేడుకలు.. రూ.3.60 లక్షలకు లడ్డూ వేలం

    September 24, 2026

    శ్రీనివాస్ గౌడ్ ఆస్తులపై చర్చ

    September 23, 2026

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 2026

    విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి

    August 29, 2026

    స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కొత్త AI ఫీచర్లు

    August 29, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026214 Views

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 202617 Views

    గండిపేటలో చవితి వేడుకలు.. రూ.3.60 లక్షలకు లడ్డూ వేలం

    September 24, 202615 Views
    డోన్'ట్ మిస్

    జాతీయ కార్పెంటర్స్ దినోత్సవం.. 600 మంది కార్పెంటర్లకు సన్మానం

    September 25, 2026

    జాతీయ కార్పెంటర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్షన్ టెస్సా సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఆర్‌.ఆర్‌.ఆర్ కన్వెన్షన్‌లో…

    పవన్ కళ్యాణ్‌తో రాధాకృష్ణ భేటీ

    September 24, 2026

    22A భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్

    September 24, 2026

    అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నో యూపీఐ డే

    September 24, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026214 Views

    ఉదయం వ్యాయామం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మొదటి అడుగు

    August 29, 202617 Views

    గండిపేటలో చవితి వేడుకలు.. రూ.3.60 లక్షలకు లడ్డూ వేలం

    September 24, 202615 Views
    ఔర్ పిక్స్

    జాతీయ కార్పెంటర్స్ దినోత్సవం.. 600 మంది కార్పెంటర్లకు సన్మానం

    September 25, 2026

    పవన్ కళ్యాణ్‌తో రాధాకృష్ణ భేటీ

    September 24, 2026

    22A భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్

    September 24, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.