టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు . తన పర్సనల్ లైఫ్‌ను ఎప్పుడూ చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేసే తేజ.. త్వరలోనే పెళ్లి పీటలెక్కిబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు.
నవంబర్‌లో ఎంగేజ్మెంట్ జరగనుండగా, డిసెంబర్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి (Arranged Marriage) అని, తన తల్లిదండ్రులే సంబంధం ఖరారు చేశారని తేజ తెలిపాడు.
ఎప్పుడూ సింప్లిసిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చే తేజ.. ఈ వేడుకను కూడా చాలా సింపుల్‌గా, కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్యే నిర్వహించనున్నాడు.అయితే ఉదయ్‌పూర్‌లో పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాడు.
తనకు కాబోయే భార్యకు సినీ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని, ఆమె టెక్నాలజీ సెక్టార్లో ఉంటూ తండ్రితో కలిసి వర్క్ చేస్తోందని తేజ వెల్లడించాడు. అమెరికాలో పెరిగిన ఆమెకు గ్లామర్ వరల్డ్ గురించి పెద్దగా పరిచయం లేకపోవడం బాగా నచ్చిందని, పెళ్లి తర్వాత ఆమె ప్రైవసీని కాపాడుకోవాలని కోరుకుంటున్నట్లు తేజ సజ్జా చెప్పాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న తేజ సజ్జా, ఆ తర్వాత మిరాయ్తో కూడా అదరగొట్టాడు. మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్‌ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నాడు.
ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ది ట్రైటర్స్ తెలుగు షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న హనుమాన్ హీరోకు నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
